రివ్యూ

ఆటాడుకున్న ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **ఎక్కడికి పోతావు చిన్నవాడా
**
తారాగణం: నిఖిల్, హెబ్బాపటేల్, నందిత శే్వత, అవికాగోర్,
వెనె్నల కిషోర్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: పివి రావ్
దర్శకత్వం: విఐ ఆనంద్

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి ఊపుమీదున్న నిఖిల్‌కి ‘శంకరాభరణం’ చిత్రం చిన్న షాక్‌నిచ్చింది. మళ్లీ ప్రయోగాల ఫార్ములానే నమ్ముకుని నిఖిల్ తాజాగా చేసిన సినిమా ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ప్రేమించిన వ్యక్తి దక్కేలోగా ప్రాణం పోతే -ఆశచావని ఆత్మ మరొకరిలో ప్రవేశించి ప్రియుడిని సొంతం చేసుకోవడానికి తపనపడే ధీమ్‌తో సినిమాలు తెలుగుకు కొత్తేంకాదు. విఠలాచార్య పీరియడ్‌లోనే ‘జగన్మోహిని’ లాంటి చిత్రాలు ఈ థ్రెడ్‌తో డిజైన్ చేసినవే. కాకపోతే ఇప్పటి వరకూ అలాంటి చిత్రాలను -హారర్ కోణంలో తెరకెక్కించారు. అలాంటి రోటీన్ కథకే ఒకింత థ్రిల్లర్ కమర్షియల్ కోటింగ్ ఇచ్చి, సైంటిఫిక్ రీజన్ విశే్లషణతో కథను నడిపించేందుకు ప్రయత్నించిన సినిమా -ఎక్కడికి పోతావు చిన్నవాడా. అఖిల్ చిన్నోడిని మిస్సయ్యింది ఎవరు? ఆత్మగా ఎవరిలోకి ప్రవేశించింది? ఆ ఆత్మ బరువు 21 గ్రాములు ఎందుకుంది?లాంటి ఆసక్తికర అంశాలకు సమాధానాలే ఈ సినిమా.
***
ఆయేషా అనే అమ్మాయిని చూడకుండా ప్రేమించిన అర్జున్ (నిఖిల్), ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్తాడు. వస్తుందనుకున్న అమ్మాయి రాకపోవడంతో, నిరాశతో వెనుదిరుగుతాడు. తరువాత స్నేహితుడు కిషోర్ (వెనె్నల కిషోర్) పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకు కేరళ తీసుకెళ్తాడు అర్జున్. అక్కడ అమల (హెబ్బాపటేల్) పరిచయమవుతుంది. ఉన్న మూడు రోజుల్లోనే అర్జున్, అమల బాగా దగ్గరవుతారు. మనసుకు దగ్గరైన అమల, అకస్మాత్తుగా మాయమవుతుంది. అమలకి సంబంధించిన చిన్న ఆధారంతో విజయవాడ వెళ్ళి ఆమె తండ్రిని కలుస్తాడు అర్జున్. అమల నాలుగేళ్ల క్రితమే ప్రమాదంలో చనిపోయిందన్న తండ్రి మాటలతో షాక్‌కి గరవుతాడు. తర్వాత అనుకోకుండా అమలను కలుస్తాడు. అయితే తన పేరు నిత్య అని, నువ్వెవరో తెలీదంటుంది ఆమె. ఆశ్చర్యానికి గురైన అర్జున్‌కి -నిత్య చెల్లె ద్వారా అసలు విషయం తెలుస్తుంది. అమల ఆత్మ నిత్యను ఆవహించిందని, కేరళలో ఆ ఆత్మను వదిలించామని వివరించటంతో అర్జున్‌కి క్లారిటీ వస్తుంది. తను ప్రేమించింది అమలని కాదని, నిత్య అనే అమ్మాయి శరీరంలోవున్న అమల ఆత్మనని అర్జున్‌కి అర్థమవుతుంది. అర్జున్ ఆ షాక్‌లో ఉండగానే, అమల ఆత్మ అర్జున్‌ని వెతుక్కుంటూ వస్తుంది. అర్జున్ కోసం తపనపడుతున్న అమల ఎవరు? ఆత్మరూపంలో అర్జున్‌కు ఎందుకు దగ్గరవ్వాలనుకుంటోంది? చివరికి అర్జున్ అమలకి దక్కాడా? లేదా? ఈ మిస్టరీకి సమాధానం కావాలంటే సినిమా చూడాలి.
నిజమైన ప్రేమికుడిగా, ఆత్మనుంచి తప్పించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించే కుర్రాడిగా నిఖిల్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. కథ మొత్తం అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కనుక, నిఖిల్ పాత్రకు కొంచెం ప్రాధాన్యత తగ్గింది. కుమారి 21 ఎఫ్‌తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హెబ్బాపటేల్, ఈ చిత్రంలో తన పనితనాన్ని చూపించలేకపోయింది. ఫస్ట్ఫాలో అమలగా, సెకండాఫ్‌లో నిత్యగా రెండు వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్ దక్కినా -ఆకట్టుకోవడంలో హెబ్బా మార్క్ కనిపించలేదు. ఇక తమిళ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంటున్న నందిత శే్వత -పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెకండాఫ్‌లో ప్రదర్శించిన నటన బావుంది. వెనె్నల కిషోర్, సత్య, ప్రవీణ్, సుదర్శన్ కామెడీ సన్నివేశాలు రొటీనే. అవికాగోర్ స్పెషల్ క్యారెక్టర్ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది.
కన్ఫ్యూజన్ కథను క్లారిటీగా తెరకెక్కించటంలో దర్శకుడు, రచయిత విఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడు. ఓపెనింగ్, ఇంటర్వెల్ థ్రిల్, సెకండాఫ్ ప్లే, టైమింగ్ కామెడీని గ్రాఫ్‌కు తగ్గట్టుగా వాడుకోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. శేఖర్‌చంద్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమంత చెప్పుకోదగింది కాదు. సాయిశ్రీరామ్ కెమెరా ఓకే. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సెకెండాఫ్ ప్లేలో శ్రుతిమించిన మెలో డ్రామా ఒకింత బోర్ కొట్టిస్తుంది. ఎక్కువైన సినిమా రన్‌టైంను భరించడమూ కష్టమే. చిన్నవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికే తప్ప, థ్రిల్లయ్యేంతగా తెలుసుకోవడానికి ఏమీ లేదు.

-శ్రీ