రివ్యూ

పోలిక లేని కొత్త కహానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** కహానీ-2
**
తారాగణం:
విద్యాబాలన్, అర్జున్ రాంపాల్, నిషా ఖన్నా, తునీషా శర్మ, జుగల్ హన్స్‌రాజ్, తోట రాయ్‌చౌదరి తదితరులు
కెమెరా:
తపన్ బసు
సంగీతం:
క్లింటన్ సెరెజో
నిర్మాణం:
బౌండ్‌స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్
నిర్మాత, దర్శకత్వం:
సుజయ్ ఘోష్
**
ఇది సీక్వెల్‌నా? అంటే కాదు. పోనీ -నాలుగేళ్లనాటి కథతో ఎక్కడైనా ‘లింక్’ కుదురుతుందా? అంటే లేదు. దీనికి మరి ‘కహానీ-2’ అన్న టైటిల్ పెట్టడం వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలీదు. కానీ... ఇదొక ప్రత్యేక కథ. అంతే-. దేని గురించీ వెనక్కి వెళ్లి వెతుక్కోకూడదు. ‘కంపారిజన్’ గురించిన ఆలోచన అస్సలు పెట్టుకోకూడదు. ప్రత్యేకించీ.. అందునా విద్యాబాలన్ గురించి అయితే- ఎంచక్కా సస్పెన్స్ థ్రిల్లర్‌ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సీక్వెల్ అన్న థాట్ రానీయకండి. అదొక్కటీ ప్రేక్షకుడు చేయగలిగితే- ‘కహానీ-2’లో సరికొత్త అంశాలెన్నో దొర్లుతాయి.
**
పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌పూర్ అనే గ్రామవాసి విద్యాసిన్హా (విద్యాబాలన్). ఆమె కూతురు మిన్ని. ఆ పాపకి నడుం కింది భాగం చచ్చుబడిపోతుంది. కూతురే లోకంగా బతుకుతూంటుంది విద్య. ఎవరితోనూ కలవని ఆమె మనస్తత్వం చుట్టుపక్కల వారిలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ఆమె గత జీవితం ఏమిటి? అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మెలగటానికి గల కారణాలేమిటి? అన్న మీమాంసలో ఉండగా -ఓ రోజు మిన్ని అదృశ్యమవుతుంది. విద్యకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో కోమాలో ఉండిపోతుంది. మిన్ని కిడ్నాప్ వ్యవహారం.. విద్య యాక్సిడెంట్ ఇత్యాది అంశాలపై ఇనె్వస్టిగేట్ చేయటానికి ఇంద్రజీత్ (అర్జున్ రాంపాల్) అనే పోలీస్ ఆఫీసర్ అపాయింట్ అవుతాడు. విద్యాసిన్హాకూ.. పోలీసుల ఫైల్‌లో క్రిమినల్‌గా ఉన్న దుర్గారాణి సింగ్‌కూ పోలికలు ఉండటంతో ఈ కేసు ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. కలింపాంగ్‌లోని ఓ స్కూల్‌లో దుర్గారాణి గుమాస్తాగా పని చేస్తూంటుంది. ఆమెపై అనేక కేసులు నమోదుకావటంతో దుర్గారాణి పోలీసులకు దొరక్కుండా పారిపోతుంది. దీంతో దుర్గారాణి పోలికలున్న విద్య -ఇలా వేషం మార్చుకొని జీవితాన్ని గడుపుతోందనీ.. పోలీస్ ఆఫీసర్ ఇంద్రజీత్ -విద్యాసిన్హాపై నిఘా పెడతాడు. ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఏమిటి? దుర్గారాణి - విద్యాసిన్హా ఒక్కరేనా? లేక దుర్గారాణి తప్పించుకొని పారిపోవటంతో విద్య ఆ కేసులో ఇరుక్కుందా? మిన్నిని కిడ్నాప్ చేసింది ఎవరు? విద్య యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఆమెపై ఎవరైనా కావాలనే అటాక్ చేశారా? లాంటి ఉత్సుకత అంశాలతో క్లైమాక్స్ వరకూ చిత్రం సాగుతుంది.
చిత్రమంతా -రాత్రి నేపథ్యంలో.. రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించటంవల్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠత కలిగిస్తుంది. కోల్‌కతాని అమితంగా ప్రేమించేవారికైతే మరీనూ. ‘కహానీ’ కూడా కోల్‌కతా నేపథ్యం కావటం.. స్థానిక బెంగాలీ నటులతో చిత్రాన్ని ఆద్యంతం నిర్మించటం ఒక విశేషమైతే.. ‘కహానీ-2’లోనూ అదే పంథా కొనసాగించారు. దాంతో -కథ మనసుకి హత్తుకునే విధంగానూ.. ఆయా సన్నివేశాల్లో ప్రేక్షకులు లీనమయ్యేట్టుగానూ ఉంది. చక్కటి సినిమాటోగ్రఫీ వల్ల ఈ సినిమా చిక్కటి కథలా సాగిపోతుంది.
విద్యాసిన్హాగా.. దుర్గారాణిగా విద్యాబాలన్ తనదైన నటనతో ఆకట్టుకొంది. ప్రతి సన్నివేశంలోనూ ఆమె కనబరచిన నటనకు హేట్సాఫ్. స్పెషల్ ఆఫీసర్ ఇంద్రజీత్‌గా అర్జున్ రాంపాల్ ఆ పాత్రలో వొదిగిపోయాడు. ఆయా బెంగాలీ నటులు కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. సంగీతం, ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్.

-బిఎనే్క