రివ్యూ

...గీత దాటితే? (లజ్జ - బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ -ఓ బ్రహ్మపదార్థం. కొంతమందికి సులభంగా అరిగిపోతుంది. కొంతమందిని కొరకరాని కొయ్యలా ఇబ్బంది పెడుతుంది. ఏ ప్రేమైనా జీవితంలో భాగమేకానీ, జీవితమంతా ప్రేమకాదు అని చెబుతారు. కానీ ప్రేమే సర్వస్వం అనుకున్న వ్యక్తికి ఎదుటి మనిషిలో ప్రేమను చూడగలిగిన సామర్థ్యం ఉండాలి. అలాకాకుండా కేవలం ఎదుటి వ్యక్తి స్వార్థంతో ప్రేమను చూపితే, ఆ ప్రేమే చివరికి ఉరి తాడుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. తన సార్వత్రిక ప్రేమ ఇతరులకు హాని కలిగిస్తుంది. ఈ అంశాన్ని చెప్పడానికి ప్రయత్నించింది ‘లజ్జ’.
కథేంటి?
సుశీల, శ్రీ్ధర్‌రావు భార్య. ఆర్‌ఎంపి డాక్టర్ భార్యగా సుశీల జీవితం సాఫీగా సాగుతోంది. కానీ ఆమె మనసులో ప్రేమరాహిత్యపు సాలెగూడు రోజురోజుకీ బలంగా అల్లుకుంటోంది. కారణం -తనకిష్టమైన నృత్యం నేర్చుకోవద్దన్నాడు భర్త. అయినా కోరికను చంపుకోలేక ప్రక్క గ్రామంలోని నాట్యాచారుడి దగ్గరకు వెళ్తుంది. దారిలో పరిచయమైన సలీం ఆమెకు దగ్గరయ్యాడు. ఒక్కసారిగా ప్రేమలోకంలోకి ఊడిపడ్డట్టుగా ఆమె జీవితం మారిపోయింది. ఈ క్రమంలో సుశీలకు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. రజియాపై మనస్సు పడ్డానని సలీం చెబితే, అతని సుఖమే తన సుఖమని ఆమె దగ్గరికి తీసుకువెళుతుంది. తన బంగారు గాజులు ఇచ్చి అతని కోర్కె తీర్చమంటుంది.
తల్లి కాబోతున్న సుశీలను సలీం వద్దని వారించే వివాదంతో ఇద్దరూ దూరమవుతారు. అప్పుడు ఆమెకు తోడుగా సలీం స్నేహితుడు నిలబడతాడు. అనుకోని పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి సలీం మళ్లీ వస్తాడు. ఇన్నాళ్లుగా సుశీల నీ స్నేహితుడితో తిరిగిందంటూ మరో వ్యక్తి సలీంను తప్పుదోవ పట్టిస్తాడు. ఆవేశంతో సలీం తన స్నేహితుణ్ణి చంపేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సలీంను కూడా చంపేస్తారు. ప్రేమ కోసం భర్తను, తల్లిదండ్రులను ఎదిరించి బయటికి వచ్చిన సుశీల జీవితం చివరికి ఏమైంది? అనేదే మిగతా కథనం.
ఎలా వుంది?
మనిషికి నిబద్ధత అనేది అవసరం. అది లేనప్పుడు పశువుతో సమానం. సుశీల జీవితంలో స్వేచ్ఛ అనేది ఎంత విశృంఖలంగా విహరించినా చివరికి అనుభవాలన్నీ చేదుగానే మిగిలాయి. ఎందుకిలా? మనిషికి స్వేచ్ఛగా విశృంఖల శృంగారం కావాలా? లేక అచ్చమైన ప్రేమ వేడిలో కరిగిపోవాలా? ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైన శృంగారం? శృంగారం ప్రధానమా? అలా అనుకుంటే పశువులకు, మనిషికి తేడా ఎక్కడుంది.
మనస్సులో పుట్టిన ప్రతీ కోరికను తీర్చుకోవాలి అని అంటే ఓ మానవ జీవితం సరిపోతుందా? ఎవరికివారు మానసికంగా అనుభవించాల్సిన ప్రేమ రుచిని బహిరంగంగా అందరూ చూసేలా చవిచూడాలనుకోవడం ఎంతవరకు సబబు? ఇక్కడ సుశీల పాత్రలో స్ర్తి అంతర్మథనాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఆమె ఆలోచనా విధానం కరెక్టే, కానీ అది అనుభవంలోకి వచ్చేసరికి చేదు విషాన్ని విసిరింది. దీన్ని తట్టుకోవడం ఓ మనిషిగా, అబలగా సుశీలకు సాధ్యమా? చిత్ర ముగింపు పరిణామాలు ఆ దిశగానే సాగాయి.
ఉన్నంతలో దర్శకుడు నరసింహ నంది ఓ స్ర్తిమూర్తి మనోగతాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ప్రేమరాహిత్యపు కాపురాలలో బ్రతుకులీడుస్తున్న అబలల ఆర్తనాదాలను వెండితెర సాక్షిగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. సినిమాలో నటీనటులందరూ పాత్రకు తగిన విధంగా నటించారు. డైలాగ్‌లు రాసినవి బాగానేవున్నా సీరియల్‌లో మాట్లాడినట్లుగా వినిపించాయి. మగాళ్లు ఎంత పెద్దవాళ్లైనా పిల్లల్లాంటి వాళ్లు. మనస్సుకు నచ్చిన వ్యక్తికి సుఖాన్నివ్వాలనే తెలివి గొప్పదనం ప్రేమ నేర్పుతుంది.
ప్రేమించిన వారికోసం ఎలా స్వార్థంగా ఆలోచించాలో, త్యాగం ఎలా చేయాలో నేర్పుతుంది. మగతనం లేని మగాడితో కాపురం చేయవచ్చు కానీ, అనుమానపు మొగుడితో చేయలేం. ఒక జన్మంత ప్రేమను పంచుకోడానికి వచ్చాను. ప్రేమను బ్రతికించుకోవడం కోసం కడుపులోని బిడ్డను బలి తీసుకుంటున్నాను లాంటి సంభాషణలు ఆలోచింపచేస్తాయి. నీవనీ నేనని, ఇలా ఇలా పాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు తనదైన స్ర్తి స్వేచ్ఛా స్వాతంత్ర భావతరంగాలలో తేలిపోయినట్లుగా తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలోనూ చిత్రీకరణ చేశారు.

తారాగణం:
మధుమిత, శివ, వరుణ్, సాగర్, సుక్కు, మహంతి, రఫి తదితరులు.
సంగీతం:
సుక్కు
నిర్మాత:
బూచేపల్లి తిరుపతిరెడ్డి
దర్శకత్వం:
నరసింహ నంది

-తిలక్