రివ్యూ

కోటికి దక్కని కామెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* మీలో ఎవరు కోటీశ్వరుడు
*
తారాగణం: నవీన్‌చంద్ర, పృథ్వీ, సలోని, శృతి శోధి, మురళీశర్మ, పోసాని, రఘుబాబు, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి
సంగీతం: డిజె వసంత్
కెమెరా: బాల్‌రెడ్డి పి
నిర్మాత: కెకె రాధామోహన్
దర్శకత్వం: ఇ.సత్తిబాబు
*
ఒక్క ఐడియా కోటీశ్వరుణ్ని చేస్తుందన్న ఎంటర్‌టైన్‌మెంట్ కానె్సప్ట్ సినిమా -మీలో ఎవరు కోటీశ్వరుడు. తెలుగు చానెల్‌లో నిర్వహించిన గేమ్ షో టైటిల్‌కు ఎలాగూ పాపులార్టీ ఉంది కనుక, దానే్న సినిమా టైటిల్ చేసుకోవడం చిన్న ప్లస్. కామెడీని ఒడుపుగా నడిపించగల దర్శకుడు ఇ.సత్తిబాబు, క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్‌కాని నిర్మాత కెకె రాధామోహన్, డిఫరెంట్ స్పూఫ్ క్యారెక్టర్లతో పాపులార్టీ తెచ్చుకున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హీరో మెటీరియల్‌గా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న నవీన్‌చంద్ర, కళ్లతోనే మురిపించగల సీనియర్ బ్యూటీ సలోని.. కితకితలు పెట్టడానికి ఇంతకంటే గొప్ప కాంబో అక్కర్లేదు. ఆ ధైర్యంతో వచ్చిన చిత్రంలో ఎవరు కోటీశ్వరుడయ్యాడన్నదే ఆడియన్స్‌కి ఆసక్తి..
**
డబ్బుతో అన్నీ సాధ్యమేనని నమ్మే బిజినెస్‌మేన్ ఎబిఆర్ (మురళీశర్మ). కూతురు ప్రియ (శృతిసోధి). రొటీన్‌గానే మధ్యతరగతికి కుర్రాడు ప్రశాంత్ (నవీన్‌చంద్ర) ప్రేమలో పడిపోతుంది. ఆ రోటీన్‌ని కంటిన్యూ చేస్తూ- పాత డైలాగులే బలహీనంగా వినిపించి వీళ్ల ప్రేమ కుదరదంటాడు ప్రియ నాన్న ఎబిఆర్. షరా మామూలుగా ప్రశాంత్ తన టాలెంట్‌ని చూపించి సంతోషం వేరు, ఆనందం వేరు అన్న చాలెంజ్ దగ్గరకు తీసుకొస్తాడు ఎబిఆర్‌ని. ఓడి గెలిస్తే వచ్చే ఆనందాన్ని రుచి చూడమంటూ ఇగోను టచ్ చేస్తాడు. ఛాలెంజ్‌కు టిక్కు కొట్టిన ఎబిఆర్ -నష్టంవచ్చే బిజినెస్ ఐడియా చెప్పినోడికి కోటి గిఫ్ట్ ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. సినిమా తీస్తే నష్టం ఖాయమని తాతారావు (పోసాని), పదండి సినిమా తీద్దామంటూ రోల్డ్‌గోల్డ్ రమేష్ (రఘుబాబు), వేరియేషన్ స్టార్‌గా జూనియర్ ఆర్టిస్ట్ వీరబాబు కథలోకి రంగ ప్రవేశం చేస్తారు. హిట్టుకంటే ఫ్లాప్ సినిమా ప్లాన్ కష్టంకనుక, అలాంటి అష్టకష్టాలన్నీ పడి ‘తమలపాకు’ ప్రాజెక్టు మొదలెడతారు. సంతోషం, ఆనందం మధ్యనున్న వ్యత్యాసాన్ని ఎబిఆర్ తెలుసుకున్నాడా? ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారు? అన్నది మిగతా సినిమా.
కామెడీతో అదరగొట్టేస్తాడనుకున్న ఆడియన్స్ అంచనాలను తలకిందులు చేస్తూ -పృథ్వీ టెన్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. తమలపాకు ప్రాజెక్టుతో సెకెండాఫ్ సినిమా మొత్తం పృథ్వీ భుజాలపై పెట్టినా -ఆడియన్స్ కిసుక్కుమన్న పాపాన పోలేదు. ఇంకా పోసాని, రఘుబాబులే అడపాదడపా కితకితలు పెట్టగలిగారు. కథానాయకా నాయికలు నవీన్‌చంద్ర, శృతిశోది, తమలపాకు హీరోయిన్ సలోని పెర్ఫార్మెన్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. జనానికి బాగా రిజిస్టర్ అయిన టైటిల్‌తో -ఆద్యంతం వినోదాలవిందు పంచేద్దామనుకున్న యూనిట్ అంచనాలు అమాంతం తలకిందులయ్యాయి. సినిమాలో -్ఫ్లప్ సినిమా ‘తమలపాకు’ కంటే బలహీనంగా నేరేషన్ సాగడంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యారు. బాలరెడ్డి ఫొటోగ్రఫీ, డిజె వసంత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రం. దర్శకుడు ఇ సత్తిబాబు గత సినిమాల రేంజ్‌కు ఏమాత్రం చేరని సినిమా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. మొదటి పది నిమిషాల సన్నివేశాలతో -కథ, కథనం తక్కువ.. మాటలెక్కువ అన్న ఫీలింగ్ కలిగింది. ఎవరి కష్టమూ సినిమాకు ప్లస్ కాలేదు. విషయం లేకపోయనా -కోటీశ్వరుడి వెతుకులాట ఒకింత సరదాగానే సాగడంతో ఫరవాలేదన్న భావన మాత్రం కలుగుతుంది.

-ప్రవవి