రివ్యూ

పట్టాలు తప్పిన సప్తగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* సప్తగిరి ఎక్స్‌ప్రెస్
*
తారాగణం: సప్తగిరి, రోషిణి, శివప్రసాద్, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, అలీ, షకలక శంకర్, తులసి, హేమ, జబర్దస్త్ శ్రీను,
సుధాకర్ తదితరులు
సంగీతం: బుల్గానిన్
కెమెరా: సి.రాంప్రసాద్
నిర్మాత: రవికిరణ్
దర్శకత్వం: అరుణ్ పవార్
*
మనిషి సంఘజీవి. సంఘంలో మనిషి స్వేచ్ఛగా బ్రతకడానికి నిర్మించుకున్న రక్షణ వలయానికి మరోపేరే పోలీస్. అయతే డిపార్ట్‌మెంట్‌లోనే ఎన్నో పిచ్చిమొలకలు మొలిచి తులసి వనం లాంటి కీర్తిని అపవిత్రం చేస్తాయి. అలాంటి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వున్న అధికారుల, వారి భార్యల భాగోతాలను చూపెడుతూ చిన్న ఉద్యోగుల సాధక బాధకాలు, డ్యూటీలో తెలుసుకున్న నిజాలను పై అధికారులే ఎలా సమాధి చేయడానికి ప్రయత్నిస్తారో చెబుతూ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సాగింది. పోలీసు శాఖలో ఉన్న అసమానతలను, చిన్న ఉద్యోగుల బాధలను ప్రధానంగా తీసుకొని నవ్విస్తూ సినిమాను సాగించాలని దర్శకుడు ప్రయత్నించాడు. కానీ, స్పీడు ఎక్కువవ్వడంతో అతిగా మారింది. చివరకు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పేసింది.
***
సప్తగిరి (సప్తగిరి) ఓ కానిస్టేబుల్ (డా శివప్రసాద్) కొడుకు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ తండ్రి పోలీసు ఉద్యోగాన్ని చెయ్యమంటే, తనకు నటుడవ్వాలన్న కోరిక వుందని, దుర్యోధన, భార్గవరామ డైలాగులను పేజీలు పేజీలు వల్లిస్తూ గ్యాంగ్‌నేసుకుని తిరుగుతుంటారు. బదిలీపై అక్కడికివచ్చిన మరో పోలీసు అధికారి కూతురు పూర్ణిమ (రోషిణి)తో ప్రేమలో పడతాడు. అధికారులు చేసే తప్పిదాలన్నింటిపై నివేదికలు తయారుచేసిన తండ్రిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో పైఅధికారులే హతమారుస్తారు. అది మాణిక్యం అనే రౌడీషీటర్ చంపాడని ప్రకటిస్తారు. తండ్రి మరణంతో విధిలేక పోలీసు ఉద్యోగంలో చేరతాడు సప్తగిరి. తన తండ్రి మరణానికి కారణాలు తెలుసుకుంటాడు. అలా కారణమైనవారినందర్నీ సరికొత్త స్టైల్లో అక్కడక్కడా వెటకారంతో, ‘అతి’వేగంతో, నమ్మబుద్ధికాని పనులతో మట్టుబెట్టడమే ఈ కథ.
****
తొలిసగమంతా సోసోగా సాగిపోయింది. పోలీసు అధికారుల భార్యలే వేశ్యాగృహాలను నడపడం, రౌడీషీటర్ మాణిక్యానికి భయపడి కనె్నపిల్లలను తార్చడం, పోలీసు అధికారి కొడుకు కనిపించిన ఆడపిల్లను నాశనం చేయడం, చైన్ స్నాచింగ్ చేసే రౌడీ గ్యాంగుల చేతులను వారికి తెలియకుండానే నరికి ఎత్తుకుపోవడం, రేపిస్టులను మగవాళ్లచేత తిరిగి రేప్ చేయించడం లాంటి అసహజ సన్నివేశాలు సినిమాలో అతిగా అనిపిస్తాయి. వైవిధ్యంకోసమని చెప్పుకున్నాకానీ, అన్నివర్గాలవారు చూడలేరు. భార్గవరాముడి గెటప్ చూపడానికి ముందు సోషియా ఫాంటసీ సినిమాలాగా బిల్డప్ చూపించి ప్రేక్షకుణ్ణి తప్పుదోవ పట్టించారు. ఎన్టీఆర్ చెప్పిన దుర్యోధన డైలాగులు ఎన్నిసార్లో ఎన్ని సినిమాల్లోనో వాడేశారు. ఇందులోనూ విని విసుగెత్తింది. తన తండ్రిని డిపార్ట్‌మెంట్‌లో వున్నవాళ్లే చంపాడన్న విషయాన్ని తెలుసుకోవడంలో హీరో ఓకె అయినా దాన్ని ఒప్పుకోవడంలో ప్రేక్షకుడు ఓకె కాడు. ఆ సన్నివేశానికి మరింత వివరణ ఇవ్వాల్సింది. కేవలం తండ్రి తయారుచేసిన రిపోర్టును చూసి వాళ్లే చంపారు అని అంచనాకు రావడం కరెక్టు కాదు కదా!
ఇక నటనాపరంగా సప్తగిరి తన పాత్రను పూర్తిగా ఆకళింపు చేసుకొని నటించేశాడు. అన్నిరకాల భావాలు తనలో పలుకుతాయని చేసి చూపాడు. తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడినా, ‘ష’కు బదులు ‘స’ను పలకడం మార్చుకోవాలి. మిగతా డాన్సుల్లో, ఫైట్స్‌ల్లో ఓకె అన్పిస్తాడు. హీరోయిన్ సినిమాకు మైనస్. ఆమెలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కనపడవు. సినిమా మొత్తం ఇరగదీసింది షకలక శంకర్. సంగీత పరంగా నాన్న సెంటిమెంట్ పాట బాగుంది. పాపా అది మాకే పడొచ్చుగాలో డ్రమ్స్ గోలతో ఒక్క మాట కూడా వినపడనీయలేదు బుల్గానిన్. కెమెరా పనితనం ప్లస్ పాయింట్ చిత్రానికి. కొత్తవారైనా నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వ పరంగా మాతృకలో వున్న విషయాన్ని తీసుకొని తెలుగు ప్రేక్షకులకు తగిన విధంగానే తీస్తే బాగుండేది. అలా కాకుండా సప్తగిరి హీరో కనుక మరింత ఎక్స్‌ర్‌సైజ్ చేసి ఓవర్ స్క్రిప్ట్ రాసి అతిగా చేసినట్లుగా అయింది. కాకపోతే తీసుకున్న టిక్కెట్‌కు దండగలేదు.

-సరయు