రివ్యూ

సరిగ్గా కాలలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* కారం దోశ
*
తారాగణం: శివ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, అనిల్, చందన, వంకాయల సత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ తదితరులు.
కెమెరా: రాజాభట్టాచార్య
సంగీతం: సిద్ధార్థ్ వాట్కిన్స్
దర్శకత్వం: త్రివిక్రమ్ గాజులపల్లి
*
యువతరమే దేశానికి బలం. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమే. కానీ తలుచుకోవడమే కష్టం. నిరంతర బండచాకిరీ కంటే ఒకేసారి స్వర్గానికి నిచ్చెన వేయాలన్నది యువత లేటెస్ట్ లైఫ్ స్టయిల్. అలాంటి అర్థంపర్థంలేని ఆలోచనలు, ఆశలతో అమూల్యమైన కాలాన్ని, శక్తినీ నిర్వీర్యం చేసుకుంటున్న యువతరానికి ఓ చెంపపెట్టుగా ‘కారం దోశ’ చిత్రీకరించారు. ఎక్కడో అడవుల్లో నాగరికతకు దూరంగా బతికే కొండజాతి ప్రజల్లో చైతన్యాన్ని నింపి, వారిని అభివృద్ధి పథంవైపు నడిపించేందుకు ప్రయత్నించే అజ్ఞాతవీరుల కథనాలు -కళ్లముందు సన్నివేశాలుగా సాగిపోతాయి.
**
ఒక రూంలో బ్యాచిలర్ జీవితాలు లాగించేస్తుంటారు వ్యూహాల వేమన (శివ రామచంద్రవరపు), రవి (సూర్యశ్రీనివాస్), బలి (అనిల్). ముగ్గురూ మూడు వ్యక్తిత్వాలకు రూపాలు. రవి దొరికిన ఉద్యోగంతో బండి లాగించేస్తుంటే, వేమన కుంభస్థలాన్ని కొడతానంటూ టైంపాస్ చేస్తుంటాడు. అతనికి తోడు బలి. ముగ్గురి స్వభావాలను బేరీజు వేస్తూ తొలి సగం సాగిపోతుంది. పిచ్చయ్య మెస్ యజమాని సత్యనారాయణ (వంకాయల సత్యనారాయణ). ఆ మెస్ స్పెషల్ -ఒక్కసారి తింటే ఎప్పటికీ వదిలిపెట్టని కారం దోశ. మెస్ యజమాని సత్యనారాయణ ఆలోచనలు మరోరకం. అతడు అడుగులు ఏవైపు పడుతున్నాయనే అంశాన్ని అనుమానాస్పదంగా తొలి సగంలో చూపించాడు దర్శకుడు. మలి సగంనుంచే అసలు కథ మొదలవుతుంది. ఊరినుంచి వచ్చిన వెంకటరమణకు తమ రూమ్‌లో ఆశ్రయమిస్తారు బ్రహ్మచారులు. అతని ప్రశ్నలు భరించలేక ఉద్యోగం పేరిట పగలంతా దూరంగా ఉంటాడు వేమన. చివరకు కాశీవిశ్వనాథ్ కంపెనీలో సంతకాలు పెట్టే సులువైన ఉద్యోగం సంపాదించినా, అందులోనూ కష్టం ఉందని తెలుసుకుంటాడు. వెంకటరమణకు ట్యూషన్లు చెబుతూ, ఆ కష్టానికి (?) బలైపోతుంటాడు బలి. మంచి లక్షణాలున్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందామన్న ఆలోచనతో మ్యారేజ్ బ్యూరోల వెంట తిరుగుతుంటాడు ఉద్యోగం చేస్తున్న రవి. అమ్మాయిల క్లియరెన్స్ సేల్స్‌లో ఓ మ్యాట్రిమోని కంపెనీ నుంచి అతనికి ఫోన్ వస్తుంది. అడ్డమైన ప్రశ్నలతో పెళ్లిమీదున్న కోరిక నీరుగారిందంటూ రవి బాధపడతాడు. ఈ ముగ్గురి స్వభావాలనే సినిమాగా మలిచాడు దర్శకుడు.
**
యువతరం దోసె పిండిలాంటివాళ్లు. రుబ్బగానే దోసె వేస్తే పెనానికి అతుక్కుని పాడవుతుంది. అదే పిండి కొద్దిగా పులిస్తే మంచి దోశ వస్తుంది. అలాగే యువతరానికి తమ జీవితాల్లో ఎదురయ్యే అనేక సంక్లిష్ట పరిస్థితులే వాళ్ల ఆలోచనల్లో వేడి పుట్టిస్తాయి. వేడి తగిలిన పిండిలా పులుస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుని పనిలోకి దూకితే కారందోశల్లా రుచి సంతరించుకుని సమాజానికి ఉపయోగపడతారు అంటూ కొత్త సిద్ధాంతాన్ని చెప్పే సత్యనారాయణ మాటల్లో నిజాలు గ్రహిస్తాడు వేమన. అడవుల్లోని ఆదిమ జాతులకు జ్ఞానభిక్ష పెట్టి వారిని ఆధునిక జీవితాల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్న సత్యనారాయణ యజ్ఞంలో తానూ ఓ సమిధలా మారి సేవ చేస్తానంటూ ముందుకొస్తాడు వేమన. అతను ఎందుకు ముందుకొచ్చాడు? రవికి నచ్చిన అమ్మాయి దొరికిందా? బలి చివరికి ఏమయ్యాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా ముగింపు.
ఎంచుకున్న సబ్జెక్టు గొప్పదే అయినా, సినిమా చూపించేంత పెద్దది కాలేకపోయింది. ఓ వాస్తవాన్ని సందేశం రూపంలో చెప్పడానికి చేసిన ప్రయత్నం సక్రమంగా సాగలేదనిపిస్తుంది. సంక్లిష్టమైన కథ, తొలి సగంని సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి. అయితే కథాకథనాలు పాత్రల సంభాషణలు ఫరవాలేదనిపిస్తాయి. కడపలో తెలంగాణ మాండలికంలో మాట్లాడే పాత్ర ఉండటం విశేషం. నటీనటుల్లో శివ రామచంద్రవరపు తన పాత్రలో లీనమయ్యాడు. సూర్య శ్రీనివాస్, అనిల్ పాత్రల పరిధిమేరకు ఓకే. సినిమా మొత్తంలో సీనియర్ నటుడు వంకాయల అభినయం మెచ్చుకోదగింది. కెమెరా పనితనం, కథాకథనాలకు సరిపోయినట్టుగా సాగింది. నేపథ్య సంగీతం నాటకాన్ని గుర్తు చేసింది. ‘దోశలు వేసి దేశాన్ని మార్చాలని కారం దోశ ప్రేమతో పోశా’ అంటూ సాగే పాట బావుంది. ‘కరిగిపోదు నీ కల’ పాట బాణీపరంగా ఓకే. సంభాషణలు వచన కవిత్వంలా సాగడంతో, ప్రేక్షకులకు ఎక్కలేదు. అశ్లీలం, ద్వంద్వార్థాలు, పిచ్చి డ్యాన్సులు, ఓవరాక్షన్లు లేకుండా ముగ్గురి యువకుల జీవితాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు పడిన తపన సినిమాకు ఒకింత ప్లస్ పాయింట్. నేటి యువతరం -బ్రహ్మాండాన్ని ఆలోచిస్తూ అండాన్ని మర్చిపోతున్న విషయాన్ని తనదైన శైలిలో దర్శకుడు చెప్పిన తీరు బావుంది.

-సరయు