రివ్యూ

అన్యాయంపై హీరోయజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు **అప్పట్లో ఒకడుండేవాడు
**
తారాగణం: నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యాహోప్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, రాజ్యలక్ష్మి, ప్రభాస్ శీను, జీవా, అజయ్, సత్యదేవ్, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరి, సమీర్, సి.వి.ఎల్.,
సంగీతం: సాయికార్తీక్,
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణవిజయ్,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,
దర్శకత్వం: సాగర్ కె.చంద్ర.
**
‘‘అప్పట్లో’’ తనకు జరిగిన అన్యాయాన్ని, అనంతరం లభించిన హోదాతో అంతం చేయాలనుకున్న యువకుడు ఒకరైతే, తన క్రికెట్ ఆటేదో తానేమిటో రీతిలో బ్రతుకుతున్న తనకు జరిగిన అన్యాయాన్ని, తిరిగి అన్యాయంగానే ఎదుర్కోవాలనుకున్న యువకుడు మరొకరు. వీరిద్దరి జీవితాలు ఎలా సాగాయో అన్నదాన్ని సాగర్ కె.చంద్ర (దర్శకుడు) ‘‘అప్పట్లో ఒకడుండేవాడు’’లో ఆవిష్కరించారు. వివరాల్లోకి వెళ్ళేముందు ఓ చిన్నమాట. నవతరం దర్శకులు- నవతరం నటులు ప్రధాన భాగస్వాములుగా ఉన్న చిత్రాల్లో చాలామటుకు అల్లి‘బల్లి’ ప్రేమకథలో లేకపోతే ఈమధ్య తరుముకొచ్చిన ‘ఆత్మ’ల ట్రెండో తరహా కథావిధానాలు చూస్తున్నాం. కానీ ఇప్పటి ఈ ట్రెండ్‌ను కాదని కాస్తంత భిన్నంగా ‘‘అప్పట్లో....’’ అంటూ చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే అలా చూపించిన భిన్నత్వంలో సాధ్యాసాధ్యాలు సాంతం అటకెక్కించేయడమే విచారకరం. ఇక విషయంలోకి వస్తే.... తాను ప్రాణప్రదంగా అభిమానించే క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలు చేరాలని కలలుకనే రైల్వేరాజు (శ్రీవిష్ణు) ఓరోజు అనుకోకుండా ఆ ఏరియా గూండా బారినపడి అవస్థలు పడతాడు. అంతకుముందే ‘అన్నల’గూటికి చేరిన అతని అక్క, ఇతర బృందాన్ని హతం చేయాలన్న ప్రణాళికతో ఉన్న పోలీస్ అధికారి ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) రైల్వేరాజు వెంటబడతాడు. కాలక్రమంలో ఇందాకటి గూండా ఆగడాలు ఎక్కువైపోతే, అనుకోని పరిస్థితిలో అతన్ని అంతం చేస్తాడు రైల్వే రాజు. పర్యవసానంగా రైల్వేరాజు జైలుకెళ్లడం జరుగుతుంది. తర్వాత, బెయిల్‌పై వచ్చిన రాజు ఏంచేస్తాడు? అతన్ని ఇంతియాజ్ అలీ ఏంచేసాడు? అన్నది మిగతా కథ. మొదటే చెప్పినట్లు ఏ అంశమైనా చట్టపరిధిలో చేస్తే అది హర్షణీయం అవుతుంది తప్ప ఇలా నేలవిడిచి సాముచేస్తే జీర్ణించుకోడం కష్టం. ఈ సినిమాలోనే ఇంతియాజ్ పైఅధికారిణి (రాజేశ్వరి) చెప్పినట్లు ‘చట్టం అందరికీ చట్టమే, ఎవరికీ చుట్టం కాకూడదు’ ‘హింస- ప్రతిహింస’ రెండూ ఎప్పుడూ ఖండనీయ అంశాలే. ఇంకో ప్రధాన విషయం- ఏ పోలీసాఫీసరూ నేరం చేసిన వాణ్ణి చట్టానికి పట్టివ్వడానికే ప్రాధాన్యమిస్తాడు తప్ప, మొట్టమొదటే ‘నేను వాళ్లని చంపేస్తాను, లేపేస్తానూ’ అన్న ఈ చిత్ర రీతిలో ముందుకుపోడు. ‘ఎన్‌కౌంటర్’ అన్నది ఆఖరి, విధిలేని పరిస్థితిలో ప్రయోగించే ప్రయత్నం. దాన్ని న్యాయస్థానంలో నిరూపించుకోడానికి చూపాల్సిన దాఖలాలు బోల్డున్నాయి. ఇదంతా మరచి ప్రవర్తించడం వింత విషయం. పోనీ అలా చేసిన పోలీసధికారిని విధుల్లోంచి తప్పించినట్లు చూపినా, తిరిగి అదే అధికారిని ఆగమేఘాలమీద నియమించడం అన్నదీ అంతగా వాస్తవానికి పొసగేది కాదు. ఇక అంతటి ప్రణాళికపైనా ఉద్యమించే అదే ఆఫీసరు తన చెల్లెల్ని కాపాడానన్న కృతజ్ఞతతో చేతికి దొరికిన అసాంఘికశక్తి పారిపోయేలా వీలుకల్పించడం ఇంకా పెద్ద అసహజ అంశం. ఒకవేళ కథ సుఖాంతం చేయడంకోసం అలా చేసాడనుకున్నా, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వ్యక్తి ఆనుపానుల్నీ ప్రభుత్వం అనంతరం కూడా నిశితంగా పరిశీలిస్తుంది. ఈ చిత్రంలోలా విస్మరించడం జరగదు. ఇక చిత్రంలో చెప్పిన ఇన్ని అసంగతాలున్నా, సినిమా ఫర్వాలేదన్న స్థాయికి చేరడానికి ప్రధాన కారణం దర్శకుడు ఎక్కడా చీప్ కామెడీకిగానీ, ఇతర పోకడలకుగానీ పోక పోవడం. అయితే అక్కడక్కడ ఫ్లాష్‌బ్యాక్‌లు ఎక్కువైపోయి ఏది ‘‘అప్పుడో’’ ఏది ‘‘ఇప్పుడో’’ అన్న దానిపై ప్రేక్షకులు సందిగ్ధపడాల్సి వచ్చింది. క్రికెట్ నేపథ్యాన్ని, ఆటనీ దర్శకుడు వీలైనంతగా బాగా వివరించారు. వ్యక్తి వెనుక ఉన్న అంశాల ఆధారంగా ఉన్నతస్థాయి క్రికెట్ ఆటకు ఎంపిక చేయకపోవడం లాంటి విషయాల పట్ల రాజకీయాలు ఎలా జరుగుతున్నాయా? అన్నదీ ఇందులో బాగా చూపారు. కానీ విఠల్‌సేఠ్ (బ్రహ్మాజీ) ఎదిగినతీరు చూపడానికి దొంగ బంగారం తదితరాలు అనవసరమనిపించాయి. ప్రధాన పాత్రధారులైన నారారోహిత్, శ్రీవిష్ణులలో శ్రీవిష్ణు ఎక్కువ ఆకర్షించాడు. దానికి కారణం,... ఎక్కడా నటిస్తున్నాడన్న తలంపు ప్రేక్షకుడికి రాకుండా అత్యంత సహజంగా నటించడమే. నారా రోహిత్ పాత్రకిచ్చిన ప్రతి నాయక లక్షణాలు వారి నటన రాణించడానికి ప్రతిబంధకమైనా, దర్శకుడిచ్చిన కాన్వాసులో సరిగ్గానే ఇమిడిపోయారు. రాజు కూతురిగా, జరిగిన విషయాన్ని తెలుసుకునే తీరులో రియా పాత్రధారిణి కూడా అభినందనీయ నటన ప్రదర్శించింది. చాలా కాలానికి బ్రహ్మాజీకి గుర్తుండిపోయే పాత్ర ఇందులో లభించింది. అలా లభించిన విఠల్‌సేఠ్ పాత్రలో బాగా నటించాడు. ఈ చిత్రంలోని పాటల కంటే నేపథ్య సంగీతం (బొబ్బిలి రాజు) సన్నివేశానికి చక్కటి బలాన్నిచ్చింది. అలాగే చిత్రంలో ఓ సందర్భంలో వచ్చిన నేపథ్య గీతంలో ‘పసి మనసును కలిపేగా కసిపాదం’ అన్న లైన్సు బాగున్నాయి. సినిమాలో సంభాషణలపరంగా కూడా దర్శకుడు (దర్శకుడే సంభాషణకర్త కూడా) మంచి శ్రద్ధకనిపించిన వైనం ప్రస్ఫుటమైంది. అందుకు ‘మొసలికి నీళ్లల్లో బలం, వీళ్లకి అడవుల్లో బలం’ అన్నవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ నిత్యం అవసరమైన ‘న్యాయస్థానాలకు’ రెండు నెలల సెలవులెందుకు అన్న డైలాగ్‌ని ఇంతియాజ్ అలీ పాత్ర ద్వారా అనిపించారు. కానీ పరిస్థితి తీవ్రతనుబట్టి వెకేషన్ కోర్టులు (సెలవుల్లో పనిచేసే న్యాయస్థానాలు) కూడా ఉంటాయన్నది గ్రహించాలి. రాజు తల్లి రైల్వేలో పనిచేయడంవల్ల అతన్ని రైల్వే రాజుగా అందరూ పిలుస్తారు అన్న కారణం చూపడం బావుంది. రాజీవ్‌కనకాల పాత్ర పరిధి తక్కువ.

- అనే్వషి