రివ్యూ

అంతరిక్ష ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** ప్యాసెంజర్స్
***
తారాగణం: క్రిస్ ప్రాట్, జెన్నిఫర్ లారెన్స్, మిఖాయల్ షీన్, లారెన్స్ ఫిష్‌బర్న్, ఆండీ గార్సియా, విన్స్‌ఫోస్టర్, కారా ఫ్లవర్స్ తదితరులు
కథ: జోన్ స్పైట్స్
సినిమాటోగ్రఫీ: రోడ్రిగో ప్రిటో
సంగీతం: న్యూమన్ థామస్
నిర్మాతలు: నీల్ హెచ్,
మారిట్జ్, స్టీఫెన్ హమిల్
దర్శకత్వం: మార్టిన్ టిల్‌డమ్
***
అంతరిక్షాన్ని చూపించాలన్నా.. అంతకుమించి అద్భుత ప్రేమ కథలు చెప్పాలన్నా -హాలీవుడ్ శైలికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ రెంటినీ కలగలిపి ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తే -‘ప్యాసింజర్స్’ తెరపై ఆవిష్కృతమవుతుంది. నేలవిడిచి ప్రేమసాము చేసిన సినిమా ఇది. విడుదలకు ముందు రేకెత్తించిన అసాధారణ అంచనాల స్థాయిని అందుకోలేకపోయినా -సాంకేతికంగా గొప్ప చిత్రంగా ప్రస్తావించేందుకు సందేహం అక్కర్లేదు.
**
సైన్స్ ఫిక్షన్ అన్నది హాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్ ముడిసరుకు. దీనికితోడు సాహసభరిత ప్రేమకథలు కథనంతో పెట్టిన విద్య. ఈ రెండింటి సమ్మిళితంగా వచ్చిన ‘ప్యాసింజర్స్’లో రెండు పాత్రలు రెండు గంటలపాటు ఆడియన్స్‌ని కూర్చోబెట్టేశాయి. అవి -జిమ్ ప్రెట్‌సన్, అరోరా లేన్. జురాసిక్ వరల్డ్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ చిత్రాలతో అసాధారణ నటుడు అనిపించుకున్న క్రిస్‌ప్రాట్, ‘ఎక్స్‌మెన్’ సిరీస్‌తో యాక్షన్ యాక్ట్రెస్‌గా చెరగని ముద్ర వేసుకున్న జెన్నిఫర్ లారెన్స్.. ఆ రెండు పాత్రలు పోషించారు. స్క్రీన్‌పై వీళ్లిద్దరు పుట్టించిన కెమిస్ట్రీ వెచ్చదనంతో -ఈ శీతాకాలం ఓ చక్కని అనుభూతికి గురవుతాం. ఆ వెచ్చదనం సృష్టికర్తగా దర్శకుడు మోర్టిన్ టిల్‌డమ్‌కు క్రెడిట్స్ ఇవ్వక తప్పదు.
**
నక్షత్ర మండలంలో ఓ కొత్త గ్రహంపై మానవ నివాసాల కోసం -ఓ ఐదువేల మందితో అంతరిక్షానికి బయలుదేరుతుంది హోమ్‌స్టెడ్-2. సుదూర గ్రహ తీరాన్ని చేరుకోడానికి 120 ఏళ్ల సమయం పడుతుందన్నది అంచనా. ఈలోగా హోమ్‌స్టెడ్-2 ప్రయాణికుల జీవితకాలం ముగిసిపోకుండా -ప్రత్యేక సాంకేతిక పరికరాల సాయంతో నిద్రావస్థలో ఉంచుతారు. అయితే -గమ్యానికి చేరాల్సిన కాలంలో 90 ఏళ్లకు ముందే మెకానికల్ ఇంజనీర్ జిమ్ ప్రెట్‌సన్ (క్రిస్‌ప్రాట్)కు వెలకువ వచ్చేస్తుంది. ఏడాదిపాటు నౌకలో ఒంటరి జీవితం గడిపిన జిమ్ -తోడు కోసం అందమైన అరోరా లేన్ (జెన్నిఫర్ లారెన్స్)ను నిద్రలేపుతాడు. సాంకేతిక సమస్య కారణంగానే తనకు వెలకువ వచ్చిందని అరోరా భావిస్తుంది. అలా జిమ్, అరోరాలు ప్రేమలో పడతారు. తనకు మెలకువ వచ్చేయడానికి కారణం జిమ్ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన సాంకేతిక సమస్యేనని అరోరాలకు తెలియడం, అదే సమయంలో నౌక సాంకేతిక సమస్యకు గురై ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడటం జరుగుతుంది. ఈ సమస్యలను ఎలా అధిగమించారన్నది -హాలీవుడ్ స్టయిల్ ముగింపు.
**
అంతరిక్షంలో అద్భుతమైన ప్రేమ కథను చూపించేందుకు దర్శకుడు మార్టిన్ టిల్‌డమ్ తెలివైన, బలమైన కథను ఎంచుకోగలిగాడు. సన్నివేశాలను అల్లుకోవడం నుంచి, అత్యద్భుతంగా చిత్రీకరించే వరకూ దర్శకుడి పనితనం కనిపిస్తుంది. నిజానికి ఇదొక విజువల్ ఫీస్ట్. మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూడగలిగితే -3డి సొగసు మరింతగా అనుభవంలోకి వస్తుంది. ఫలానా సన్నివేశం అని చెప్పడానికి వీల్లేకుండా ప్రతి దృశ్యాన్నీ సినిమాటోగ్రఫీతో మాయ చేసి చూపించాడు రోడ్రిగో ఫ్రిటో. ఆసక్తిని కలిగించే కథ, కథనాలు.. ఆనందాన్ని పంచే దృశ్య సన్నివేశాలు.. కదలకుండా కట్టిపడేసే పాత్రధారుల నటన -వెరసి ‘ప్యాసింజర్స్’లో మనమూ ఒకరైపోయి సినిమాలో లీనమైపోతాం. సాంకేతిక సమస్య తలెత్తి జిమ్ నిద్రలోంచి లేచిపోవడం, తోడుకోసం అరోరాని లేపడం దగ్గర్నుంచి -అంతరిక్ష వీధుల్లో వాళ్లమధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు కొత్త అనుభూతికి గురి చేస్తాయి. హాయిగా సాగిపోతున్న ప్రేమకథలో అలజడి సృష్టించి, ఆ అలజడిని తీవ్రస్థాయికి తీసుకెళ్లేందుకు నౌకనే ప్రమాదంలోకి నెడుతూ -కథనంలో తన స్టయిల్ ప్రతిభను ప్రదర్శించాడు దర్శకుడు మార్టిన్ టిల్‌డమ్. హాయిగా సాగిపోతున్న అంతరిక్ష ప్రేమ కథలో అలజడి తలెత్తడం దగ్గర్నుంచీ కథ, కథనంలో వేగం కనిపిస్తుంది. ప్రేమ సమస్య, నౌక సమస్యను పరిష్కరించే క్రమంలో హీరోయిజాన్ని క్రిస్ ప్రాట్ బాగా పండించాడు. జెన్నిఫర్ లారెన్స్ సొగసు అందం -ప్రేక్షకులను ఊపిరి తీసుకోనివ్వదు. చీఫ్ డెక్ ఆఫీసర్ పాత్రలో లారెన్స్ ఫిష్‌బర్న్, క్యాప్టెన్ నోరిస్‌గా ఆండీ గార్సియా, కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా కారా ఫ్లవర్స్ పాత్రల పరిధిని దాటి నటన ప్రదర్శించారు. చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదనపు బలం. విజువల్ ఫీస్ట్ అందించేందుకు చేసిన సిజె వర్క్‌లో హాలీవుడ్ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకటి రెండు సన్నివేశాల్లో వినా అంతరిక్ష దృశ్యాలు లేకపోయినా -సినిమా పూర్తయ్యే వరకూ మనం నక్షత్ర మండలంలో ఉన్నామన్న భావన కలిగించడంలో విజయం సాధించారు.
ప్యాసింజర్స్.. -ఓ గొప్ప అంతరిక్ష ప్రయాణ ప్రేమానుభూతి.

-ప్రవవి