రివ్యూ

ప్రేక్షకుల కేకల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** నేను లోకల్
**

తారాగణం: నాని, కీర్తి సురేష్, సచిన్ ఖేడ్కర్, నవీన్ చంద్ర,
పోసాని, ఈశ్వరీరావు,
తులసి, రావు రమేష్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:
ప్రసన్నకుమార్ బెజవాడ
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
**
మనిషి డబ్బులో ఆనందం వెతుక్కుంటాడుకానీ, నిజమైన ఆనందం ప్రేమలో ఉందని చెప్పడానికి ప్రయత్నించిన సినిమా -నేను లోకల్. అనేక మాస్ హిట్టు సినిమాల్లోని సన్నివేశాలను గుదిగుచ్చి -వాటిని నేచురల్ స్టార్ నాని యాంగిల్‌లో అప్లై చేసి తీసిన ప్రాడెక్ట్. పట్టింది బంగారమవుతున్న దిల్‌రాజు ప్రొడక్షన్, ‘సినిమా చూపిస్త మావ’ అంటూ మాస్ హిట్టుతో ఊపుమీదున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు.. ప్రాజెక్టుకు ఎక్స్‌ట్రా బూస్ట్.
బ్యాక్ బెంచి స్టూడెంట్ స్టామినాతోనే ఎట్టకేలకే ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు బాబు (నాని). ఓ ఫైన్ మార్నింగ్ అందమైన కీర్తి (కీర్తి సురేష్)ని చూసి ఆటోమేటిక్‌గా లవ్‌లో పడిపోతాడు. నాన్నచాటు కూతురైన కీర్తి -బాబును అవాయిడ్ చేస్తూనే మాటలు, చేష్టలకు పడిపోతుంది. పూర్తిగా కీర్తి లవ్‌ట్రాక్‌లోకి వచ్చేసిందనుకున్న టైంకి -బాబు నెత్తిన బాంబు పడుతుంది. అది -ఇన్స్‌పెక్టర్ సిద్ధార్థవర్మ (నవీన్ చంద్ర)తో కీర్తికి పెళ్లి అని తెలియడం. కీర్తి తండ్రికి బాబు పట్ల సరైన ఒపీనియన్ లేకపోవడం, తండ్రి ఎవర్ని పెళ్లి చేసుకోమంటే అతనే్న పెళ్లి చేసుకుంటానని కీర్తి చెప్పడం.. వెరసి హీరోకి స్ట్రగుల్ స్టార్టవుతుంది. కీర్తి తండ్రిని ఇంప్రెస్ చెయ్యడానికి బాబు ప్రయత్నాలు ఆరంభమవుతాయి. సమస్యల సవాళ్లను ఎదుర్కొన్న బాబును కీర్తి అంగీకరించిందా? వీరిద్దరి పెళ్లికి ఎదురైన అడ్డంకులేమిటి? ఈ రెండు ప్రశ్నలకు అనేక సమాధానాలతో సినిమా ముగుస్తుంది.
ఇలాంటి క్యారెక్టర్లను పండించటంలో నాని పండిపోయాడు కనుక -అతని పెర్ఫార్మెన్స్ ఆటోమేటిక్‌గా సినిమాకు వర్కవుటైపోయింది. మాస్ అప్పీల్‌లోనూ తనేంటో నిరూపించుకోగలిగాడు నాని. ఫస్ట్ఫాలో నాని డైలాగ్ డెలివరీ, టైమింగ్ సినిమాకు బాగా వర్కవుటైంది. ఎమోషనల్ సన్నివేశాలు పండించటంలో నాని టాలెంట్ చెప్పనక్కర్లేదు కనుక -టోటల్‌గా నాని భుజస్కంధాలపై సినిమా నడిచేసింది. చేసిన ఒకట్రెండ్ సినిమాలతోనే గ్లామర్, పెర్ఫార్మర్‌గా క్రెడిట్ కొట్టేసిన హీరోయిన్ కీర్తికి -ఈ సినిమా ఆమె కెరీర్‌కి చేసే ఉపకారమైతే ఏమీ ఉండదు. ప్రాజెక్టుకు కీర్తి గ్లామర్ సైతం చెప్పుకోతగినంత ప్లస్ పాయింట్ కాదు. తెలుగు ప్రేక్షకులకు వ్యసనమైపోయినంత సాదా సీదా కథ కావడంతో -సచిన్ ఖేడ్కర్, రావు రమేష్ సహా ఇతర పాత్రలన్నీ వాళ్ల పరిధిమేరకు నటించేశారు.
సాంకేతికంగా -నిజార్ షఫీ తన ఫొటోగ్రఫీతో సినిమాకు రిచ్‌నెస్ అందిస్తూనే మంచి లవ్ మూడ్‌ను ప్రజెంట్ చేయగలిగాడు. మొహంమొత్తే పాత కథనే ఎంచుకున్నా -క్యారెక్టరైజేషన్ మీద కొండంత నమ్మకంతో దర్శకుడు త్రినాథరావు చేసిన ప్రయత్నం విఫలం కాలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్, దేవి శ్రీ ప్రసాద్ బాణీల్లోని ఎనర్జీ, ప్రసన్నకుమార్ సెటారిక్ మాస్ డైలాగులు, ప్రవీణపూడి ఎడిటింగ్, దిల్‌రాజు నిర్మాణ విలువలు.. ప్రాజెక్టుకు దన్నుగా నిలిచాయి.
సినిమా మొదలైన దగ్గర్నుంచీ -ఇలాంటి సన్నివేశాలు ఇంకెక్కడో చూశామన్న ఫీలింగ్ మాత్రం ఆడియన్‌ని వెంటాడింది. హీరోకు ఓ ఇంట్రొడక్షన్ సాంగ్, హీరోయిన్ కనిపించగానే ఓ టీజింగ్ సాంగ్, మధ్యమధ్యలో హీరో ఫ్యామిలీతో కొన్ని కామెడీ సన్నివేశాలు, హీరోయిన్ తండ్రితో మాటల యుద్ధం.. ఇలా ఫార్మాట్ మొత్తం పరమ రొటీన్ అన్న భావన కలిగింది. ఏ దశలోనూ -ట్రెండీ సినిమా చూస్తున్నామన్న భావన మాత్రం ఆడియన్స్‌కు కలిగించలేకపోయారు. హీరోయిన్ తండ్రిని ఇంప్రెస్ చేయడానికి హీరో ఎంత సహనంతో ఎదురు చూస్తాడంటే -ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ... చూస్తూనే ఉంటాడు. హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాను నడిపిస్తూనే -సన్నివేశాల పరంగా మెలో డ్రామాకు ప్రాధాన్యత ఇవ్వడంతో -‘ప్రాతిపదిక’ను పక్కన పెట్టేసి సినిమా చూస్తూ కూర్చోవాలంతే. కథకు పెద్దగా అవసరం లేకున్నా -బావున్న సన్నివేశాలు కొన్ని చొప్పించడానికి కారణం రన్‌టైం పెంచడానికేననిన అర్థమవుతుంది. సాగదీతను భరిస్తూ.. నాని పర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ.. చూసేసిన కథనే కొత్తగా చూడాలనుకునే వాళ్లకు ‘నేను లోకల్’ ఓ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.

-త్రివేది