రివ్యూ

యుద్ధంలో గెలిచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా బాగుంది**** ఘాజీ
****

తారాగణం: రానా దగ్గుబాటి, కె.కె.మీనన్, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్, సత్యదేవ్, భరత్‌రెడ్డి
సంగీతం: కె.
ఛాయాగ్రహణం: మధి
మాటలు: గంగరాజు
స్క్రీన్‌ప్లే: గంగరాజు, సంకల్ప్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి
నిర్మాతలు: ప్రసాద్ వి.పొట్లూరి, అనే్వష్‌రెడ్డి, ఎన్.ఎం.పాషా, జగన్‌మోహన్, వెంకటరమణారెడ్డి
దర్శకత్వం: సంకల్ప్‌రెడ్డి

****

వాస్తవ సంఘటనను ఉన్నది ఉన్నట్టుగా చెబితే -అది డాక్యుమెంటరీగా మారి తిప్పికొట్టే ప్రమాదం ఉంది. అందరికీ తెలిసిన చరిత్రలో ఏదైనా కాస్త కాల్పనికతను జోడిస్తే.. అదీ బెడిసి కొడుతుంది. అస్సలు తెలీని చరిత్రని ‘టచ్’ చేసినా.. పాఠ్య పుస్తకాల పరిజ్ఞానంతో బేరీజు వేసుకొంటే.. ఆ విషయంలోనూ పరమార్థం చెడుతుంది. తెలుగు సినిమా వాళ్లు ఎంతసేపూ.. ఇమేజ్‌లూ చట్రాలంటూ పరిగెడతారనీ.. వారి ‘టేస్ట్’ ఏమిటో ఆ భగవంతుడు సైతం అర్థం చేసుకోలేడనీ.. కాబట్టి- కాస్తంత కమర్షియల్‌నీ.. మాస్‌నీ వీడకుండా నెట్టుకొచ్చేస్తున్నామని అంటారు. సరికొత్త కథని లేటెస్ట్ ఆలోచనల్తో ‘మిక్స్’ చేసి కొత్త ప్రయోగం చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయిన సందర్భాల్ని పరికించిన సినీ కథకులు.. ప్రయోగాల జోలికి ఎప్పుడో తప్ప వెళ్లటంలేదు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే- ఇటు అస్సలు తెలీని చరిత్ర.. జల గర్భంలో సమాధి అయిన కథని కొత్త దర్శకుడు నెత్తికెత్తుకుని.. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠభరితంగా నడిపించి మెప్పించటం వెనుక కథనం.
1971 -విశాఖ తీరం. భారత్ నావికా దళానికీ.. పాక్ నావికా దళానికీ మధ్య జరిగిన యుద్ధం. ఏ అతి కొద్దిమందికో తప్ప.. ఆ సంవత్సరంలో జరిగిన ఆ భయంకర సంఘటన విషయం కూడా ఎవరికీ తెలీదు. ఆ కారణంగా విశాఖ తీరం విస్ఫోటనం చెంది ఉండేదన్న ఊసే ఇప్పుడు గగుర్పాటు కలిగిస్తుంది. చరిత్రని చెప్పటం వేరు.. వాస్తవిక సంఘటనలతో ప్రేక్షకుడు మమేకమయ్యేట్టు చేయటం వేరు. రెంటి మధ్య అనుసంధానం కుదరకపోతే.. కథ జల గర్భంలో మునిగిపోతుంది. అయతే- ‘సంకల్ప’ బలం వల్ల ఈ కథ సముద్ర జలాల్లో సాఫీగా సాగిపోయింది.
కరాచీలోని నేవల్ బేస్ నుండి పశ్చిమ పాక్‌కి (బంగ్లాదేశ్ తీర ప్రాంతం) ‘ఘాజీ’ అనే సబ్‌మెరైన్‌ని పాక్ ఆర్మీ పంపిస్తుంది. ఈ సబ్‌మెరైన్ బంగ్లాదేశ్ తీర ప్రాంతాన్ని చేరుకోవాలంటే భారత్ జలాల నుండే వెళ్లాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న భారతీయ జలాల్లో యుద్ధ వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పహారా కాస్తూంటుంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి చేరుకోవాలంటే ముందుగా విక్రాంత్‌ని ధ్వంసం చేయాలి. పాకిస్తాన్ ఆర్మీ ‘ఘాజీ’ని బంగ్లాదేశ్‌లో పోరాడుతున్న తమ సైనికుల సహాయం నిమిత్తం సంధించిందన్న వార్త ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొన్న భారత్ నావిక దళం ‘ఎస్-21’ అనే భారతీయ సబ్‌మెరైన్‌ని సముద్ర జలాల్లోకి పంపుతుంది. దీంతో విక్రాంత్‌ని ఎదుర్కోవాలన్న ప్లాన్‌లో ఉన్న ‘ఘాజీ’కి ‘ఎస్-21’ని ముందుగా పేల్చేయాల్సి వస్తుంది. విశాఖ హార్బర్‌ని ధ్వంసం చేస్తే తప్ప.. యుద్ధం తీవ్ర స్థాయికి చేరదని భావించిన పాక్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఎస్-21, ఘాజీ సబ్ మెరైన్‌ల మధ్య భీకర పోరు జరిగిందా? భారతీయ జలాంతర్గమి కెప్టెన్ కమాండెంట్ రణ్ విజయ్ సింగ్ (కెకె మీనన్), లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ (రానా) యుద్ధాన్ని ఏ విధంగా నడిపించారు? అన్నది క్లైమాక్స్.
తెలీని యుద్ధ చరిత్ర. అసలు జరిగిందో లేదోనన్న సందేహం. డ్రై సబ్జెక్ట్. హాలీవుడ్‌కి మల్లే ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తిస్తాడా? లేదా? అన్న అనుమానం. ఇన్ని ఆలోచనల మధ్య థియేటర్‌లోకి అడుగుపెడితే.. దర్శకుడు ఏ సన్నివేశాల్తో యుద్ధం చేశాడో ఒక్క క్షణం అర్థమై.. జలాంతర్గామితోపాటు ప్రేక్షకుడూ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాడు. సబ్‌మెరైన్ అంతర్భాగాన్ని తీర్చిన తీరువల్ల.. ఏనాడూ సబ్‌మెరైన్ సాంకేతికతను చూడని ప్రేక్షకుడికి తీయటి అనుభూతితోపాటు ఉక్కిరిబిక్కిరవుతాడు. సముద్ర జలాల అడుగున టార్పీడో (మిస్సైల్స్)తో యుద్ధం, ఎస్-21, ఘాజీ అటాక్.. యుద్ధ సన్నివేశాలు.. వీటన్నిటినీ ‘విఎఫ్‌ఎక్స్’ ద్వారా అద్భుతంగా చూపటమే కాకండా.. కెప్టెన్ల మధ్య అభిప్రాయ భేదాలు.. వాటిని చిత్రీకరించిన తీరు ఆకట్టుకొంటుంది.
చిత్రానికి -ఆర్ట్ వర్క్ ప్లస్ పాయింట్. సినిమా అంతా సబ్‌మెరైన్‌లోనే జరుగుతున్నా.. ప్రేక్షకుడు కూడా సబ్‌మెరైన్‌లోనే ఆయా పాత్రలతో ఉన్నాడన్న ఫీలింగ్‌ని తెప్పించగలిగాడు.
నటనాపరంగా - ప్రతి ఒక్కరూ కథకీ.. కథనానికీ జీవం పోశారు. భారతీయ సినీ చరిత్రలో పూర్తి స్థాయి ‘జలాంతర్గామి’ సినిమా ఇదే కావొచ్చు. ఇదో సరికొత్త ప్రయోగం.

-బిఎనే్క