రివ్యూ

రంగుల సొరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** నగరం
**
తారాగణం: సందీప్‌కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్, చార్లీ, రాందాస్ తదితరులు
సంగీతం: జావేద్ రియాజ్
ఫొటోగ్రఫీ: సెల్వకుమార్
నిర్మాతలు: అశ్వినీకుమార్, సహదేవ్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
**
నగరం ఎప్పుడూ నిత్యనూతనమే! కొత్తవారికి స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ఇక్కడే ఉండిపోయేవారికి అన్నీ అందిస్తుంది. వెలుగు మాటున చీకటి ఉన్నట్టుగానే నగరంలోనూ అనేక క్రూర, కర్కశ, రాక్షస క్రీడలు జరుగుతూనే ఉంటాయి. వాటికి అనేకమంది బలైపోతుంటారు. కళ్లెదురుగా అఘాయిత్యాలు జరుగుతున్నా, ప్రమాదాల్లో ఎవరైనా గాయాలపాలైనా, నిరంతరం హడావుడిగా వారి పనుల కోసం పరిగెత్తే జనం కాస్త ఆగి చూడలగరా? ఆర్తులను ఆదుకోగలరా? అలాచేస్తే అతనికి సమయం, డబ్బు వృధా. నగరం ఎప్పటికప్పుడు కొత్తగా తయారైనా, దాని కంపు అలా జనజీవన స్రవంతిలో వెల్లువెత్తుతూనే ఉంటుంది. ఒకవైపు అంగారం, మరోవైపు శృంగారం కలగలిపి రాసిపోసినట్టు కనిపిస్తుంది నగరం. ఎన్నో లక్షల మంది నగరంలో.. వారి వెనుక మరెన్నో లక్షలు. అన్ని కథలను ఒకే చిత్రంలో చూపలేరు కనుక దర్శకుడు ఓ నాలుగు కథలు తీసుకుని వాటి సమాహారంగా జరిగే సంఘటనల నేపథ్యంలో కథ రాసుకున్నాడు. పగలు జలపాతంలా సాగే నగరం రాత్రి అయితే మృగాన్ని మింగిన కొండ చిలువలా ఉంటుంది. పగలంతా నిశ్శబ్ధం పాటించే రౌడీమూకలు, తమ దైనందిన కార్యకలాపాల్లో మునిగి తేలేది రాత్రి మాత్రమే! అదే వారికి ఆటవిడుపు. రాత్రి అయితే నేరాల ఊడలమర్రి వొళ్లు విదిల్చి మరీ కరాళ నృత్యం చేస్తుంది. ఆ ఇనుప పాదాల కింద నలిగేవారి ఆనవాలు కూడా దొరకదు. అదే రాత్రి నగరం చేసే మహిమ.
ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన శ్రీపై కొందరు రౌడీలు దాడి చేస్తారు. ఆ దాడిలో డబ్బు, సర్ట్ఫికెట్లు పోగొట్టుకుంటాడు. అసలు దాడి చేయాలనుకున్నది సందీప్ కిషన్‌పై. తన ప్రియురాలు రెజీనాపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన రౌడీని చావ చితక కొడతాడు సందీప్. అదే పగ! పికెపి (మధుసూదన్) నగరంలో పెద్ద డాన్. ఓ చొటామోటా గ్యాంగ్ తెలియక పికెపి కొడుకును కిడ్నాప్ చేస్తారు. జరిగిన తప్పును తెలుసుకున్న చోటా రౌడీలు ఎలాగైనా తమను డాన్ చంపేస్తాడు కనుక, వీలైతే డీల్ కుదుర్చుకుని ఆ డబ్బుతీసుకుని పారిపోదామని పథకం వేస్తారు. శ్రీ ఇంటర్వ్యూలో ఎంపికై సర్ట్ఫికెట్ల వేటలో పడతాడు. పోలీసు అధికారి అయిన తన బాబాయి నగరం వదిలి వెళ్లమనడంతో బయలుదేరిన సందీప్‌కు కిడ్నాప్ అయిన బాలుడు దొరుకుతాడు. ఆ తరువాత కథనం ఏమిటనేది సినిమా చూడాల్సిందే.
నగరం పడగ ముద్రను నిరంతరం ప్రేక్షకుడికి గుర్తుండేలా సినిమా అంతా ఒకే పద్ధతిలో చిత్రీకరించిన విధానం బావుంది. నాలుగు కథల సమాహారంగా రూపొందించినా అన్ని కథలకు ప్రధాన సూత్రం ‘స్ర్తి, ధనం’ అనే ముడి పదార్థాలు. కథనం పరంగా కొత్తగానేవున్నా, ముడి పదార్థాలు రెండూ అప్రధానంగా కనిపిస్తాయి. అలాంటి వాటికోసం జరిగే భీకర పోరాటమే అయినా చాలా ప్రశాంతంగా సాగినట్టు చూపడంతో సన్నివేశాల గాఢతను ప్రేక్షకులు అనుభవిస్తారు. ఎక్కడా అకస్మాత్తుగా దాడులుజ జరగడం, ప్రేక్షకులు అలెర్ట్‌గా లేనపుడు భయపెట్టడంలాంటి వైరస్ దృశ్యాలు ఉండవు. ఒక సన్నివేశాన్ని ఎంత దీర్ఘంగా పాత్రలపై అసహ్యం కలిగేలా తీర్చిదిద్దటంలో దర్శకుడి ముద్ర కనిపిస్తుంది. ప్రారంభం నుంచి చివరి వరకూ కొనసాగించిన సస్పెన్స్ ఓకే. ప్రేక్షకుడు ఊహించింది జరగకపోవడం, సరికొత్తగా నేరానికి ముగింపు ఇవ్వడం లాంటి అంశాలు క్రైం థ్రిల్లర్ జోనర్‌లో కొత్తగా ఉంటాయి. అయితే, సినిమా అంతా తమిళనటులు కావడంతో నేరమయ చరితల వ్యక్తులుగా
స్పష్టంగా ముద్ర వేయగలిగారు. అక్కడక్కడ తెలుగు పదాలు కనిపించినా, తమిళ వాసనలు వస్తాయి. స్ర్తి అంశం కోసమే రెజీనా పాత్ర ఉన్నట్టు అనిపిస్తుంది. దృశ్యాల్లో వేగం లేదు. నెమ్మదిగా సాగుతాయి. కథలో పాత్రలన్నీ ఒక్కొక్కటిగా పరిచయమై, ఆ పాత్ర ఓ స్పష్టమైన రూపాన్ని తీసుకుంటుంది. కథా కథనాలు వాస్తవానికి దగ్గరగా సాగి క్రైం థ్రిల్లింగ్ చిత్రాలు ఇష్టపడేవారికి ఓ మైండ్ గేమ్‌లా ఉంటుంది. సందీప్ కిషన్ హీరోలాకాక ఓ పాత్రగా లీనమయ్యాడు. రెజీనా పాత్ర పరిధి చిన్నదికనుక తక్కువేసేపే కనిపిస్తుంది. వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ పండించిన రామ్‌దాస్ గుర్తుండిపోతాడు. కెమెరా పనితనం కథకు తగ్గట్టు సాగింది. నేపథ్య సంగీతం ఒకే. పాటల్లో ‘ఏంటే పిల్లా చిలకలు..’ మెలోడీ. ఎడిటింగ్ ఎంత క్రిస్ప్‌గా చేసినా లాగుతున్నట్టే అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న కథకు నేపథ్యంలో అక్కడక్కడ పక్కదారి పట్టకుండా చెప్పదలచుకున్న నాలుగు కథలను ఒకే దారంలో ముడివేసి పెట్టాడు. సంబంధంలేని సామహారంగా రాసుకున్నా, ఓ కథలో సన్నివేశానికి మరో కథలో సన్నివేశానికి లింకు పెట్టిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఊరమాస్, క్రైం థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి నచ్చుతుంది.

-సరయు