రివ్యూ

వైవిధ్యమైన ‘ఆత్మ’ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * చిత్రాంగద
తారాగణం: అంజలి, అర్జున్ బజ్వా,
దీపక్, రాజారవీంద్ర, సప్తగిరి, సుడిగాలి సుధీర్, స్వాతిదీక్షిత్, సాక్షిగులాటి, సింధుతులానీ, జయప్రకాష్ తదితరులు
సంగీతం: సెల్విగణేష్
నిర్మాతలు:
రహమాన్, శ్రీ్ధర్ గంగపట్నం
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్
*
ఆధునికత విస్తరణకు అభిముఖంగా ఆలోచనలు ‘ఆత్మల’ చుట్టూ తిరుగుతున్నాయనడానికి తాజా తార్కాణం ‘చిత్రాంగద’. అయితే ‘గత’ ఆత్మలకి, ‘చిత్రాంగద’కు చిన్న వైవిధ్యముంది. అదేమిటంటే పురుషుడి ఆత్మ స్ర్తిని ఆవహించటం. అమెరికా ఆత్మ భారత మహిళను ఆవహించటం మరో ట్విస్ట్. గందరగోళం అనిపిస్తున్న పై రెండు వాక్యాలు చాలు -రెండు గంటల ఇరవై అయిదు నిమిషాలు ‘చిత్రాంగద’లో ఇంకెంత గందరగోళం ఉందో అర్థం చేసుకోడానికి.
వైజాగ్‌లోని ఓ కళాశాల్లో సైకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చిత్రాంగద (అంజలి). ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ అక్కడి విద్యార్థినుల్ని లైంగికంగా వేధించే చర్యలకు పాల్పడుతుంటుంది. ఇది గమనించిన కళాశాల యాజమాన్యం ఆమెని హాస్టల్‌నుంచి పంపించేస్తుంది. దీంతో తనలో వస్తున్న అసాధారణ మార్పులకు కారణాన్ని అనే్వషించే పనిలో పడుతుంది చిత్ర. ఆ అనే్వషణ ఫలితమేంటి? అసలేం జరిగితే చిత్ర అలా ప్రవర్తించింది? అన్న వాటికి సమాధానాలే మిగిలిన సినిమా.
చాలా చిత్రాల మాదిరిగానే కొన్ని కల్పనలు, మరికొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమంటూ ఆరంభంలోనే చెప్పారు. నిజానికి రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు. దానికితోడు కొన్ని ఊహాతీత సంఘటనలు జరుగుతాయి. వాటిపై ఆరాతీయడం సాధ్యంకాదన్న పరోక్ష హెచ్చరికా చేశారు. పోనీ వీటి మూలాల ఆరా వదిలేసినా, అతి సాధారణ అంశాలు కూడా ఎలాంటి తర్కానికీ నిలవకపోవడం చిత్రాంగదలోని విచిత్రం. చిత్రకు ఇరవై అయిదేళ్ల వయసు వచ్చేవరకూ ఆమెలో ఆ తరహా మార్పులు వచ్చినట్టు ప్రస్తావించలేదు. ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాతే వచ్చిందా? అన్న దానిపైనా స్పష్టత లేదు. అలాగే అలాంటి (స్ర్తిలను వేధింపు) చర్యలు అమెరికాకు వెళ్లిన తర్వాత పక్కనే ఉన్న సువర్ణ (స్వాతీదీక్షిత్)పై చేయకపోవడం విచిత్రం. ఇక చిత్ర బాధ్యులు చెప్పినట్టు ఆరాలు తీయడం పక్కనబెడితే సినిమా ఆఖరి ఇరవై నిమిషాలు దర్శకుడు కుదురుగా తీసినట్టు అనిపించింది. అది శాలినీదేవి (సింధుతులానీ) తానెందుకు రవివర్మ (దీపక్)ను చంపిందీ చెప్పిన సన్నివేశం, అదేవిధంగా రవివర్మ హత్య ఎవరు చేశారన్న అనే్వషణా తతంగం కూడా పాక్షికంగా అలరించింది. పెర్‌ఫార్మెన్స్ పరంగా చిత్రాంగద పాత్రధారిణి అంజలి తన స్థాయికి మించే చేసింది. స్ర్తియైవుండి స్ర్తిని సెడ్యూస్ చేయడంలో ఆత్మ ప్రవేశానంతరం మిగతా వారిని భయపెట్టడంలోను, అసలెందుకు తనలో ఇలాంటి మార్పు అన్న ఆత్మపరిశోధన చేసుకోడంలోనూ వైవిధ్యత ప్రదర్శించింది. అయితే సన్నివేశాల్లో పరిపక్వత కనిపించలేదు. అదేరీతిలో సింధుతులానీ ఉన్న వ్యవధి తక్కువైనా గుర్తింపతగ్గ నటన ప్రదర్శించింది. కుంజకోబొబ్బన్ పాత్రలో సప్తగిరి అలవాటైన ఫాస్ట్ డైలాగ్ డెలివరీ కామెడీని మరోసారి పండించారు. కొన్ని సన్నివేశాల్లో కనకాంబరం పాత్రలో సుడిగాలి సుధీర్ (జబర్దస్త్ ఫేం) సప్తగిరికి తోడయ్యాడు. అయితే ఇదంత ప్రభావశీలంగా లేదు. నీలకంఠగా జయప్రకాష్ స్టైలిష్ నటనని ప్రదర్శించినా, ఆ పాత్ర అసలెందుకు అలా ప్రవర్తిస్తోందన్న దానికి సరైన కారణాలు దర్శకుడు చూపకపోవడంతో అదీ పండలేదు. అటాచ్‌మెంట్స్‌కంటే అగ్రిమెంట్స్‌కే ఇక్కడ విలువిస్తారని అమెరికాను ఉద్దేశించిన ఈ చిత్ర సంభాషణ ప్రస్తుత అమెరికా వాటికీ విలువిస్తున్నట్టు కన్పడకపోవడం గమనార్హం. ‘నిన్ను చూస్తూంటే బాత్రూంకి పోతున్నట్టు లేదు, బర్మామీదికి యుద్ధానికి పోతున్నట్టుంది’, ‘నీ కంటి చూపుకి కడుపులో ఉన్నది కరిగిపోయేలా ఉంది’, ‘మటన్ షాపులో మిఠాయి అడిగేవాడిలా ఉన్నావు’ వంటి సరదా డైలాగులతోపాటు, ‘ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప విషయం మోసంచేసిన వాణ్ణి సైతం వదిలేయడం’, ‘అవసరం ఉంటే మాట్లాడే ఫ్రెండ్స్ తప్ప ఆప్యాయంగా మాట్లాడే ఫ్రెండ్స్ తక్కువ’ వంటి మననం చేసుకోతగ్గ సంభాషణలూ ఇందులో ఉన్నాయి. ఉన్న పాటల్లో ఏదీ గొప్పగా చెప్పుకోతగ్గది లేదు. అయితే అంజలి బృందంపై చిత్రీకరించిన ‘్ఢంగ్ చిక ఢంగ్ చిక’ పాటలో మనిషి జీవితంలో మైమరపుకి గురయ్యే అంశాల్ని సరదాగా చెప్పడం బాగుంది. చిత్రం కథాపరంగా అమెరికాలో తీసినా, కొన్ని సన్నివేశాల్లో లోకల్ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. చిత్రంలో ఓ సందర్భంలో చర్చించినట్టు న్యాయం కావాలా, ప్రతీకారం కావాలా, న్యాయమైన ప్రతీకారం (?) కావాలా? అన్న సంగతి ఎలా ఉన్నా, హేతుబద్ధత ఉన్న సన్నివేశాల సమాహార చిత్రాలే బావుంటాయి అన్నది ‘చిత్రాంగద’లాంటి చిత్రాలు తెలుసుకోవాలి.

-అనే్వషి