రివ్యూ

అందమైన డిస్నీ ఊహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** బ్యూటీ అండ్ ది బీస్ట్
**

తారాగణం:
ఎమ్మా వాట్సన్, డాన్ స్టీవెన్స్, లూక్ ఇవాన్స్, జోష్ గాడ్, కెవిన్ క్లిన్ తదితరులు
దర్శకత్వం:
బిల్ కాన్‌డన్
**

1991- డిస్నీ యానిమేటెడ్ ఫిల్మ్‌కి యాక్షన్ రీమేక్ సినిమా ఇది. చందమామ కథల్లోకి జొరబడని బాల్యం ఉండదు. ఆ కథలన్నీ ప్రాణం పోసుకొని కళ్ల తెరపై కనిపించటం చిన్ననాటి ముచ్చట. కత్తి ఝళిపిస్తూ -ఊహాలోకంలో విహరిస్తూ అందమైన రాకుమారి మనసు దోచుకోవటం.. అప్పటి కల. ఈ ఊహలకూ.. ఆ కలలకూ -ఏనాటికీ మరణం లేదు. అభూత కల్పనలు -వెండితెరపై గ్రాఫిక్స్‌గా తారట్లాడితే.. చిన్ననాటి ఆలోచనలకూ మరింత ఊతం దొరికినట్టే. ఆలోచనల్ని పక్కనబెట్టి -మంచు తెరలన్నీ విడిపోయి కళ్ల ముందు ‘బ్యూటీ’పొరలు కనిపిస్తే? ఆ ఊహకు రెక్కలొస్తే?.. ఆ కలలకు మాటలొస్తే?.. అచ్చంగా ‘డిస్నీ’ బ్యూటీలా ఉంటుంది.
* * *
తెలిసిన కథే. కాబట్టి- ప్రస్తావన అవసరం లేదేమో?! అందమైన రాకుమారి హృదయాన్ని దోచుకోవాలనుకొనే ఓ భారీ ఆకారం. రాక్షసత్వం తప్ప సౌకుమార్యం తెలీని ఆ ‘్భరీ’ కఠిన మనసుని సైతం కరిగించిన వెన్నలాంటి అమ్మాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న దోబూచులాట. నికార్సయిన ప్రేమ భావనలు. హృదయ స్పందనలు -మరోవైపు కత్తి యుద్ధాలూ.. ఇతరత్రా పాత్రల ప్రవేశం. వీటన్నింటినీ గుదిగుచ్చి.. ఒక రొమాంటిక్ ఫాంటసీని సృష్టించిన ‘డిస్నీ’ కళ్లల్లో మెదిలి.. ఊహల్లో మారాం చేస్తుంది.
* * *
ఇంతకు మించి కథ చెబితే.. ఊహకు అన్యాయం చేసినట్టవుతుంది. కల్పనల్ని తెగ్గొట్టినట్టవుతుంది. ఆలోచనల్ని ఆమడ దూరంలో ఆపేసినట్టవుతుంది. ‘విల్లేనేవ్’ గ్రామంలో ఓ పుస్తకాల పురుగు. ఆ పురుగు పేరు బెల్లే. తండ్రి మారైస్‌తోపాటు జీవిస్తూంటుంది. ఆమెకి తండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఓ రోజు మారైస్ .. ఫిలిప్పె అనే ఆయన పెంపుడు గుర్రం అడవిలో తప్పిపోతారు ఒక దాడి సందర్భంగా. ‘బీస్ట్’ బంధనంలో చిక్కుకొంటాడు. అతడు ఉన్నచోటుకి బెల్లేని తీసుకెళ్తుంది ఫిలిప్పె. తండ్రి స్థానంలో తాను బందీగా ఉంటానని బీస్ట్‌ని వేడుకొంటుంది. బీస్ట్ అందుకు అంగీకరిస్తాడు. ఆ గుహలో ఆమెకి మేజర్ డోమో, కాగ్స్‌వర్త్, క్లాక్, మిసెస్ పోట్స్, టీ పాట్, టీ కప్, కోర్ట్ కంపోజర్, మేస్ట్రో కాడెన్‌జా.. తదితరులు ఆమెకి పరిచయమవుతారు. ఒకానొక సందర్భంలో ఆమెకి ‘గులాబీ’ పువ్వు కనిపిస్తుంది. కథంతా దాని చుట్టూ తిరుగుతోందని అర్థం చేసుకొంటుంది బెల్లే. ఓ యుద్ధంలో ‘బీస్ట్’ గాయపడతాడు. అతడికి దగ్గరుండి సపర్యలు చేస్తుందామె. దీంతో వారిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
కథకి కళ్లుండవు. కాళ్లుండవు.. అంటారు. ఇక్కడ ప్రేక్షకులకు ప్రత్యక్షమయ్యే పాత్రలన్నీ చిత్రాతిచిత్రంగా ఉన్నప్పటికీ.. ఊహకి ప్రాణం జోడించినట్టు కలిసిపోతాయి. రెక్కలొచ్చి ఎగురుతాయి. తెలీని లోకాల్లో విహరింపజేస్తాయి. సాంకేతికత అభివృద్ధి చెందటంతో.. ప్రేక్షకుల ఆలోచనల్ని ‘క్యాచ్’ చేసి తెరపై చూపించటంలో నిపుణులు మార్కులు కొట్టేశారు. పిట్టలాఉండే ఎమ్మా వాట్సన్.. ఈ భారీ కథని తన భుజస్కంధాలపై మోసింది, ‘బీస్ట్’తో పాటు. ఈ వేసవిలో చక్కటి వినోదాన్ని అందించింది డిస్నీ ప్రపంచం.

-బిఎనే్క