రివ్యూ

ఈ అబ్బాయిదీ పాత కథే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* మా అబ్బాయి
*
తారాగణం: శ్రీవిష్ణు, చిత్ర శుక్లా, కాశీ విశ్వనాథ్, సన తదితరులు
నిర్మాతలు: బలగ ప్రకాశ్‌రావ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ: థమశ్యామ్
దర్శకత్వం: కుమార్ వట్టి
*
ఈమధ్యే వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో నటుడిగా ప్రశంసలు అందుకున్న యువ హీరో శ్రీవిష్ణు. అంతకుముందు ప్రేమ ఇష్క్ కాదల్, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలు చేసిన అనుభవం. అయితే, ఇద్దరు ముగ్గురు హీరోల చిత్రాల్లో భాగమయ్యే శ్రీవిష్ణు -ఈసారి సోలో హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి చేసిన చిత్రమే -మా అబ్మాయి. కొత్త దర్శకుడు కుమార్ వట్టి దర్శకత్వంలో రూపొందిన ‘మా అబ్బాయి’తో సోలో హీరోగా శ్రీవిష్ణు ఎన్ని మార్కులు సాధించాడో చూద్దాం.
అందమైన కుటుంబంతో సంతోషంగా జీవితం గడిపే కుర్రాడు (శ్రీవిష్ణు). అమ్మ, నాన్న, అక్కలతో కలిసి హైదరాబాద్‌లోని ఓ కాలనీలో ఉండే సరదా కుర్రాడు. ఆ పక్కనే కాస్త పోష్ కాలనీలో ఉండే అమ్మాయి (చిత్ర శుక్ల)ని ప్రేమిస్తూ ఆమెతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో ఒకరోజు అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో జీవితమే తలకిందులవుతుంది. ఆ పరిస్థితికి కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలని నిర్ణయించుకుంటాడు. అతని జీవితాన్ని తలకిందులు చేసిన సంఘటన ఏమిటి? ఆ సంఘటనతో హీరో ఏంకోల్పోయాడు? దానికి కారణమైనవారు ఎవరు? వాళ్లను అతను ఎలా పట్టుకున్నాడు? అతని ప్రేమ కథ ఏమైంది? అనేదే మిగతా సినిమా.
దర్శకుడు కుమార్ వట్టి తీసుకున్న పాయింట్ కాస్త రెగ్యులర్‌దే అయినా దాన్ని ఒక కుటుంబానికి ఎమోషనల్‌గా లింక్ చేసి సినిమాను నడపడం, హీరో చుట్టూ కుటుంబపరమైన భావోద్వేగాలు అల్లడం బాగున్నాయి. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ ఓకే. ఫస్ట్ఫాలో హీరో హీరోయిన్‌ల లవ్ ట్రాక్ ఆరంభమయ్యే విధానం కాస్త ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. శ్రీవిష్ణు, చిత్ర శుక్లల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరోయిన్ చిత్ర శుక్ల ఫస్ట్ఫా నుంచి సినిమా చివరి వరకు చాలా సన్నివేశాల్లో కనిపిస్తూ తన నటన, గ్లామర్‌తో మెప్పించిందపి. ‘గుచ్చి గుచ్చి చూడొద్దంటే..’ బీచ్ సాంగ్‌లో అందాలతో ఆకట్టుకుంది. హీరో శ్రీవిష్ణు వీలైనంత వరకు మాస్ ఎక్స్‌పోజర్ కోసం ప్రయత్నించాడు. హీరో శత్రువుల్ని వెతకటం, పట్టుకునే ప్రయత్నాల సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా సాగిపోతాయి. హీరో సమస్యను మొదట్లో వ్యక్తిగతంగా తీసుకుని, తర్వాత దాన్ని సొసైటీపరంగా చూస్తూ పరిష్కరించడం ఆకట్టుకుంది. శ్రీవిష్ణులోని మాస్ యాంగిల్‌ను ఆవిష్కరిస్తూ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు కొన్ని ఓకే.
అయితే బరువైన కథ కావడంతో, హీరో స్టామినా సరిపోలేదు. అనేక సన్నివేశాల్లో కథను క్యారీ చేయలేక ఇబ్బందిపడ్డాడు. ముఖ్యంగా కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. హీరో తన శత్రువుల్ని వెతికే సందర్భంలో చేసే కొన్ని వ్యూహాలు చూడ్డానికి బాగానే అనిపించినా, లాజిక్‌కు దూరంగా ఉండటంతో ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. హీరో కష్టపడాల్సిన పనిలేకుండా ప్రతికూల అంశాలన్నీ ఎక్కడికక్కడ చక్కబడిపోతూ అతనికి దారివ్వడం అతిశయోక్తి అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌వున్న క్రిమినల్స్ హీరోకి సులభంగా దొరికిపోతూ పలుమార్లు ఓడిపోతుండటం సీనియర్ హీరోలు చేసే వన్‌మ్యాన్ షోను తలపిస్తుంది. ఆ సన్నివేశాల్లో శ్రీవిష్ణు తేలిపోయాడు. పాటలు బాగున్నా, కథ మధ్యలోకి బలవంతంగా వచ్చేస్తూ కథనానికి అడ్డుతగలటం సినిమాకు పెద్ద మైనస్. హీరో సీరియస్ సిట్యుయేషన్‌ను చూపిస్తూ, అకస్మాత్తుగా కుటుంబానికి సంబంధించి సరదా సీన్లు రాసుకోవడం ఆడియన్స్ మూడ్‌ను డిస్ట్రర్బ్ చేసినట్టయ్యింది.
దర్శకుడు, రచయిత అయినా కుమార్ వట్టి తీసుకున్నది రొటీన్ పాయింటే అయినప్పటికీ దానికి ఒక కుటుంబాన్ని లింక్‌చేసి సినిమా నడపాలనే ఆలోచన బాగుంది. సంభాషణలు కొన్నిచోట్ల ఆకట్టుకున్నాయి. కుమార్ రూపొందించిన ఫస్ట్ఫా ఫర్లేదనిపించినా, సెకండాఫ్‌లో కథ సీరియస్ మూడ్‌లోకి వెళ్లిన కాసేపటికి కొన్ని ఓవర్ అనిపించే అసందర్భ సన్నివేశాలు, పాటలతో కథనాన్ని నెమ్మదించేలా చేయడం, హీరో మోయలేనంత కథను గుదిగుచ్చడం లాంటి అంశాలు వికటించి సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. థమశ్యామ్ సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి సంగీతం ఓకే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తిస్థాయి మాస్ హీరోగా కనపడాలని శ్రీవిష్ణు చేసిన ప్రయత్నమే ‘మా అబ్బాయి’. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్, ఆకట్టుకునే లవ్ ట్రాక్, కొన్ని మైండ్ గేమ్ ఎపిసోడ్స్, హీరోయిన్ గ్లామరస్ పెర్ఫార్మెన్స్ వంటి బలాలు వున్నా, హీరో స్థాయికి మించిన బరువైన సబ్జెక్ట్, ఓవర్ ఎగ్జయిట్‌మెంట్ మూలంగా దర్శకుడు బలవంతంగా కథనంలోకి జొప్పించిన అనవసరమైన సన్నివేశాలు, కొన్ని పాటలు, అసహజంగా అనిపించే కొన్ని కీలక సన్నివేశాలు వంటివి సినిమా గ్రాఫ్‌ను తిరోగమనానికి తీసుకెళ్లాయి.

-త్రివేది