రివ్యూ

మెడికల్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** నోటుకు పోటు
**
తారాగణం: అర్జున్, శ్యాం, మనీషాకొయిరాలా, అక్షాభట్, సీత, ఎ.ఎం.ఆర్.రమేష్, నేహా సక్సేనా కెమెరా: కృష్ణ శ్రీరామ్
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:ఎస్.కె.బషీద్
**
నిజం నిద్రపోదు. చేసిన తప్పు ఎప్పటికైనా మన వెనుక నీడలా తిరుగుతూనే వుంటుంది. ఎప్పుడైతే దానికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయో చాలా నింపాదిగా చేసిన తప్పుకు తగిన శిక్ష వేస్తుంది. ఎవరూ చూడలేదులే, మనం చేసిన తప్పు మాసిపోయింది అనుకుంటే పొరపాటు. నిజం నిప్పులాంటిది గనుక ముందుగా సన్నటి పొగ కనిపించినా, తరువాత భగ భగమంటలతో నిలువునా దహించివేస్తుంది. ఈ సందేశంతోనే ‘నోటుకు పోటు’ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. అయితే కథకు, టైటిల్‌కి ఎటువంటి సంబంధం లేకపోవడం వెనుక అంతరార్థం మాత్రం ఆడియన్స్‌కి అర్థంకాదు.
వయసులో పెద్దదైన మాయ (మనీషా కొయిరాలా) తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అక్షయ్ (శ్యామ్)ను వివాహమాడుతుంది. మిలియనీర్ అయిన మాయ తన ఆస్తులన్నీ అక్షయ్‌కే చెందేలా వీలునామా రాస్తుంది. కానీ తనకన్నా చిన్నవాడైన భర్తపై ఎక్కడో ఆమెకు అనుమానం వుంది. మరొక స్ర్తితో అతనికి సంబంధాలున్నాయని పసిగడుతుంది. అందుకోసం ఓ డిటెక్టివ్‌ని నియమిస్తుంది. అతని నిరంతర కార్యకలాపాలపై ఓ కన్ను వేస్తుంది. ఆమె ఊహించిన విధంగానే అతని జీవితంలో భూమిక (అక్షాభట్) వుంది. ముదురు భార్యను వదిలించుకుని, ఆమె ఆస్థిని అనుభవించాలని భర్త ఎత్తువేస్తాడు. ఆ ఎత్తును నిరంతరం గమనిస్తూనే వుంటుంది మాయ. పోస్ట్‌మార్టంలో కూడా గుర్తించలేని కేటాలాప్సి కెమికల్‌ను వైన్‌లో కలిపి భార్యకు అందిస్తాడు అక్షయ్. అది తాగిన 8 గంటల తరువాత గుండెపోటు వస్తుంది. కానీ పోస్టుమార్టంలో కెమికల్ కనపడదు. ఆఫీసుకు వెళ్లిన అతనికి భార్య చనిపోయిందన్న వార్త తెలుస్తుంది. భార్య శవాన్ని చూద్దామని వస్తే శవం మాయమైందని పోలీసు అధికారి శక్తి (అర్జున్) చెబుతాడు. శక్తి ఇంటరాగేషన్‌లో అక్షయ్ అనుమానస్థుడిగా తేలుతాడు. అప్పటినుంచి ఫోరెన్సిక్ లాబ్‌లోనే అతన్ని అరెస్టు చేసి విచారణ జరుపుతుంటారు. సినిమా కథంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. ఓవైపు అక్షయ్ ప్రియురాలు భూమిక ఫోన్లు చేసి ఎప్పటి సమాచారం అప్పుడు అందజేస్తుంటుంది. చివరికి అసలు మాయ చనిపోయిందా? లేక బ్రతికే వుందా? ఆమె మృతదేహాన్ని మాయం చేసింది ఎవరు? దీనంతటికీ కారణమేంటి? అనే కథనం సినిమాలోనే చూడాలి.
మెడికల్ థ్రిల్లర్ జోనర్‌లో సరికొత్త కథ, కథనంతో చిత్రాన్ని రూపొందించారు. 2012లో స్పానిష్ భాషలో వచ్చిన ‘ది బాడి’ చిత్రానికి అనుసరణగా వచ్చిన ఈ చిత్రంలో చివరివరకు సస్పెన్స్‌ను కొనసాగించిన విధానం బావుంది. మాయ దెయ్యంగా మారిందా? అన్న కోణంలో ఆడియన్స్ ఆలోచనలు పరిగెత్తేలా దర్శకుడు కథను అల్లుకున్నాడు. ప్రీ క్లైమాక్స్‌లో అసలు భూమికే దెయ్యమా? అన్న అనుమానమూ వస్తుంది. కేవలం ఫోరెన్సిక్ లాబ్‌లోనే సినిమా అంతా సాగినా ఉత్కంఠభరితంగా వుంది. అక్షయ్ తనకన్నా వయసులో పెద్దదైన మాయను పెళ్లిచేసుకోవడానికి కారణమేంటి? ఆమెను వదిలించుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు? అసలు మాయకు, అక్షయ్‌కు విరోధలు ఇంకెవరైనా ఇలాంటి డ్రామా నడిపించారా? అనే అంశంతో ముడిపెట్టి కథ కథనాలు ఎక్కడా పట్టు జారకుండా చిత్రీకరించిన విధానం థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి నచ్చుతుంది. నటీనటుల్లో మనీషా కొయిరాలా, అర్జున్ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. శ్యామ్ సినిమా మొత్తాన్ని తన నటనపైనే నడిపించాడు. నేహా సక్సేనా, ఇక్షాభట్ వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడా కామెడీ ట్రాక్ కానీ, అశ్లీల సంభాషణలు కానీ, అనవసరమైన పాటలు కానీ ఉండవు. సినిమా అంతా సీరియస్‌గా పరిశోధనాత్మకంగా సాగిపోతుంది. థ్రిల్లింగ్ కథనం కనుక నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా సాగింది. కథ, కథనానికి తగినవిధంగా టైటిల్ పెట్టివుంటే ఫలితం మరోలా ఉండేదే.
*
-సరయు

-సరయు