రివ్యూ

లేలేత ప్రేమలోని ఆత్మ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఫిలౌరీ
**
తారాగణం: అనుష్క శర్మ, దిల్జిత్ దోసాంజ్, సూరజ్ శర్మ, మెహ్రీన్ పీర్జాదా తదితరులు
సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్
నిర్మాతలు: అనుష్క శర్మ, కర్నేష్ శర్మ
దర్శకత్వం: ఆన్షాయ్ లాల్
**
ఒక ఐడియా జీవితానే్న కాదు.. కథని కూడా అనుకోని మలుపు తిప్పొచ్చు. ‘ఆత్మ’ భయపెట్టడం తెలుసు. ‘తెల్లటి’ కాస్ట్యూమ్స్‌లో ప్రత్యక్షమై.. భయోత్పాతాన్ని సృష్టించటం మన ఎరుకలోనిదే. స్మశానాల్లోనో - పాడుబడ్డ భవంతుల్లోనో, రాజప్రసాదాల్లోనో.. స్థిర నివాసం ఏర్పరచుకొని.. కొన్ని దశాబ్దాలుగా వౌనముద్ర వహించి... ఆనక ‘పగ’ తీర్చుకోటానికి ‘ఆత్మ’ కాస్తా అందమైన అమ్మాయిగా మారిపోవటం తెలిసిందే. కానీ- ఈ ఆత్మ కొత్త పుంతలు తొక్కింది. వెరైటీ దారులు వెతుక్కొంది. లొకేషన్ ఛేంజ్ చేసి.. చెట్టు తొర్రలో సెటిలైంది. ‘ఆత్మ’ తాలూకు పాత జ్ఞాపకాల్ని చెరిపేసి - సరికొత్త కాస్ట్యూమ్స్‌లోకి దిగి.. అందమైన నవ్వుల్ని చిలకరించింది. అదెలా అంటే...?
కనన్ (సూరజ్ శర్మ) కెనడా నుంచీ ఇండియాకి తన చిరకాల స్నేహితురాలు అను (మెహ్రీన్ పిర్జాదా)ని పెళ్లి చేసుకొనేందుకు వస్తాడు. ఒకానొక నక్షత్రంలో పుట్టడంవల్ల వచ్చిన దోషం కారణంగా -పెళ్లికి ముందు ఓ చెట్టుకి తాళి కట్టాల్సి వస్తుందని చెప్పటంతో.. ఆ తంతుని ముగిస్తాడు కనన్. ఇక్కడే అసలు తంతు మొదలవుతుంది. ఆ చెట్టు తొర్రలో కొనే్నళ్లుగా కాపురం ఉంటున్న ‘శశి’ (అనుష్క శర్మ)ని పెళ్లి చేసుకున్నట్టవుతుంది. కనన్ కథలోకి ‘ఆత్మ’ జొరబడి.. తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పనారంభిస్తుంది. కథకి కాలం తెలీదు. ‘్ఫలౌరీ’ పేరిట రోజువారీ పత్రికలో వస్తూన్న కవితలు జనావళిని విశేషంగా ఆకట్టుకొంటూంటాయి. ఆ ఊళ్లో ‘్ఫలౌరీ’ని ప్రేమించే అమ్మాయిల జాబితా కూడా ఎక్కువే. ఒకానొక సందర్భంలో గాయకుడు రూప్‌లాల్‌తో పరిచయం.. శశి జీవితాన్ని మార్చేస్తుంది. సమాజాన్ని తన గానం ద్వారా చైతన్యవంతం చేయాలన్న శశి మాటని బట్టి రూప్‌లాల్‌లో మార్పు వస్తుంది. ‘రూప్’ ప్రేమలో పడుతుంది శశి. ఈ ప్రేమ కథ ‘శశి’ సోదరుడికి ఇష్టం ఉండదు. ఓ ప్రోగ్రామ్ ఇవ్వడానికి అమృత్‌సర్ బయల్దేరిన ‘రూప్’ తిరిగి వచ్చింత్తర్వాత ‘శశి’ని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకొంటాడు. ‘్ఫలౌరీ’ కవితల్ని గానం చేస్తాడు. ఒక గ్రామ్‌ఫోన్ రికార్డుని కూడా సమర్పిస్తాడు. వచ్చిన సొమ్ముని శశి సహోదరుడికి పంపిస్తాడు.
పెళ్లికి అంతా సిద్ధమవుతూండగా.. శశి గర్భవతి అని తెలుస్తుంది. ఆమె సన్నిహితుడు అమ్రిత్ (నిధి భి) దీనికి కారణమని ప్రతి ఒక్కరూ అనుమానిస్తారు. అమృత్‌సర్ నుంచీ రూప్ ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకోలేక ‘శశి’ ఓ చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంటుంది.
ఫ్లాష్‌బ్యాక్ నుంచీ ప్రస్తుతానికి వస్తే.. కనన్‌తో శశి ఉండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. కాబోయే భార్య ‘అను’ కనన్‌ని శంకిస్తుంది. ‘శశి’ ఆత్మ గురించి కనన్ చెప్పినప్పటికీ.. ఎవరూ నమ్మరు. ఎట్టకేలకు ఈ తతంగాన్ని గమనించిన అను ‘గ్రాండ్ మదర్’ రూప్‌లాల్ రికార్డ్‌ని ప్లే చేయటం.. ‘శశి’ ఆత్మవేదనని ‘అను’ అర్థం చేసుకోవటం.. ఆ రికార్డు 1919, ఏప్రిల్ 13ని తెలియటం.. ఇత్యాది అంశాలతో కథ ఒక్కసారిగా 98 సంవత్సరాలు వెనక్కి వెళ్లి.. క్లైమాక్స్‌కి చేరుతుంది.
ఓ లేత ప్రేమకథని ‘ఆత్మ’ రూపంలో చెప్పటానికి కథకుడు చేసిన ప్రయత్నం ఆద్యంతం నవ్వుతోపాటు.. ఏడుపూ తెప్పిస్తుంది.
1919 నాటికీ.. 2017 నాటికీ సమాజంలో వచ్చిన మార్పులనూ.. ఆచార వ్యవహారాల్లో వచ్చిన తీరుతెన్నులనూ.. సంస్కృతీ సంప్రదాయాల్లోనూ.. కుటుంబ వ్యవస్థలోని మార్పులను చెప్పిన తీరు బాగుంది. స్కూల్‌లోని ‘రొమాన్స్’నీ.. నేటి తరం ‘ప్రేమ’కథల్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ కథకి అనుష్క ప్రాణం పోసింది అనటం చిన్నమాట. అంతా తానై.. ‘ఆత్మ’రూపంలో కనిపిస్తూ.. కథని నడిపించింది. ఆయా పాత్రధారులంతా పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడి ప్రతిభను మరోసారి మెచ్చుకుని తీరాలి. సంగీతం ఫర్వాలేదు.
*
-బిఎనే్క

-బిఎనే్క