రివ్యూ

కలిసిరాని నయన‘డోర’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * డోర
*
తారాగణం: నయనతార, తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: వివేక్ శివ- మెర్విన్ సోలోమన్
కెమెరా: దినేశ్ కృష్ణన్
ఎడిటింగ్: గోపీకృష్ణ
నిర్మాత: మల్కాపురం శివకుమార్
దర్శకత్వం: దాస్ రామస్వామి
*
సినిమా అంటేనే పెద్ద ‘మేక్ బిలీవ్ ఆర్ట్’ అనుకుంటే.. ‘ఆత్మలు’ వగైరా తాళింపుచేసిన చిత్రాల్లో ఆ డోస్ డబులవుతుంది. అక్షరాలా అదే పంధాలో సాగిన చిత్రం ‘డోర’. ఇదివరకూ వచ్చిన ఆత్మల మేళవింపులకీ, ‘డోర’లో చూపిన అతీతశక్తుల జోడింపుకీ చిన్న తేడా ఉంది. వాటిల్లో నేరుగా అసంతృప్తుల లేదా పగతో రగిలిపోతున్న వారి ఆత్మలు ప్రస్తుతం ఉన్న వ్యక్తుల్లో ఆవహిస్తే, ఇందులో తన యజమాని మనవరాలికి జరిగిన అఘాయిత్యం, దరిమిలా చేకూరిన మరణం తదితరాలకి కోపోద్రిక్తురాలైన ‘కుక్క’ (డోర’ అన్నది కుక్క పేరు) వారి కారులో ఆవహించి దుండగుల్ని దునుమాడటం. దానికి వాహికగా ఆ కారుని కొనుక్కున్న కథానాయిక (నయనతార) కావడం కథాసూత్రానికి మరో మలుపు.
పారిజాతం (నయనతార) విశ్రాంత ఉద్యోగి వైకుంఠం రామయ్య (తంబు రామయ్య) కుమార్తె. కూతురికి వయసు పెరుగుతున్నా వివాహం కావడంలేదన్న దిగులుతో కులదైవం ఉన్న ప్రాంతానికి వెళ్లి ప్రార్థిస్తే కల్యాణం అవుతుందన్న తలంపులో అక్కడికి వెళ్దామని, అందుకు కాబ్ సర్వీస్ నడుపుతున్న చెల్లెలు నాగమణి వద్దకు వెళ్లి కారు అడుగుతాడు. అక్కడ నాగమణి కారు ఇవ్వకపోవడం సరికదా, తీవ్ర అవమానం చేసి పంపుతుంది. అప్పుడు పారిజాతం, ‘నేను కూడా కాబ్ సర్వీస్ నడిపి, నీ కళ్లు దించేలా చేస్తానని’ ప్రతిన పూనుతుంది. ఆ ప్రక్రియలో తన బడ్జెట్‌కు సరిపడా వచ్చిన ‘ఆస్టిన్ కేంబ్రిడ్జ్’ సెకెండ్ హ్యాండ్ కారు కొంటుంది. ఆ కారు ద్వారా ఆమెకు ఎదురైన సంఘటనలూ, వాటిని ఎదుర్కొన్న తీరు తదితరాలతో ‘డోర’ ఫిల్మ్ క్లోజవుతుంది. ఇలాంటి సినిమాల్లో ‘ఇది అవుతుందా?’ ‘అలా ఎలా కుదురుతుంది?’ ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని వ్యవస్థలకీ- (ప్రత్యేకించి పోలీసు శాఖకు) సంప్రాప్తించిన ఈ కాలంలో (కథ కూడా 2015లో జరిగినట్టు చూపారు) కూడా ఇలా ఎలా? అని ముక్కుమీద వేలేసుకుని ఆలోచిస్తే సినిమా ముందుకు కదలదు. కనుక ఆ ప్రయత్నం సినిమా దర్శకుడు దాస్ రామస్వామితోపాటు మనంకూడా పక్కకుపెట్టి చూస్తేనే ఓకే. అయినా ఉదాహరణకు ఓ విషయం- ముగ్గురు దుండగుల్ని టార్గెట్ చేసి కారులో ఆవహించిన ‘కుక్క’ చంపేస్తుంది. కానీ ఉన్న అవకాశాలు ద్వారా ఓ ఫ్లాట్‌లో యువతిని మర్డర్ చేసిన వారిని పట్టుకోడం పెద్ద కష్టమేంకాదు. అందులోని నేరానికి పాల్పడిన వ్యక్తులు అంతర్జాతీయ టెర్రరిస్టులో, ప్రథమస్థాయి నేరస్థులో కాదు. అందులోనూ వాళ్లు జనంమధ్యలో ‘పానీ పూరీ’ తదితర వ్యాపారాలు చేస్తున్న వారిగానూ చూపారు. ఈ సదుపాయాల్లో కూడా నిర్దేశిత వ్యవవ్థలు నిర్వీర్యమైనట్టు చూపడం ఏవిధంగానూ ప్రోత్సహించతగ్గ అంశంకాదు. అయితే బ్రెయిన్‌డెడ్ అయిన మనవరాలి గుండె దానం పొందిన పారిజాతం ఆ విషయం తెలుసుకుని తగినట్టు స్పందించడం చిన్న టచింగ్ అంశం. పాత్రధారుల నటనాపాటవాల విషయానికొస్తే, సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ పారిజాతం పాత్రధారిణి నయనతారే! ఆ పాత్రలో సరిగ్గా అతికినట్టుంది. ఆమెకిచ్చిన కాస్ట్యూమ్స్, చూపిన హావభావాలూ దాదాపు అన్నీ ఎన్నతగ్గవే. అయితే పాత్రకు ఏర్పరిచిన పరిధులూ, కథలోని అపసవ్యతలూ పూర్తిస్థాయిలో ఆమెచేసిన ప్రయత్నాన్ని ఆవిష్కరించలేకపోయాయి. తర్వాత చెప్పుకోతగ్గ నటనను ప్రదర్శించింది తండ్రిగా వైకుంఠం రామయ్య పాత్ర పోషించిన తంబి రామయ్య. ఈ నటుడికి గాత్రధారణ చేసిన కళాకారుడూ చక్కటి డిక్షన్‌తో పాత్రను రక్తికట్టించాడు. చిత్రం అంతా ఓ స్కీంతో (జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోడం) నడిచింది కనుక ఆ ధోరణికి ఎంతవరకూ ఉపకరిస్తాయి అంతవరకే సంభాషణల్నీ, పాటల్నీ ప్రవేశపెట్టారు. ‘నేను యాక్టివ్‌గా వుండగా ఇంకోడు ఏక్టింగ్ డ్రైవర్ ఎందుకు?’ ‘ఏక్టింగ్’ అంటే ఎవరిలా ఏక్ట్ చేస్తావ్? అంటూ సన్నివేశానికి తగ్గట్లు రాసిన సంభాషణలు అలరించాయి. అలాగే పాటలకి చిత్రంలో అంతగా అవకాశం లేకపోయినా సంగీత దర్శకద్వయం (వివేక్- మెర్విన్) అందించిన పాటల్లో ‘వెళ్ళ మాకే, నన్నిడిచి యెళ్లమాకే...’ అన్నది బాగుంది. సాధారణంగా చిత్రంలోని పాత్రలు ఎస్టాబ్లిష్ చేసి కథ నడపడం అన్నది సినిమా మొదటి అరగంటలోపే జరిగిపోతుంది. దీంట్లో అందుకు విరుద్ధంగా ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేవరకూ కథలోని ప్రధాన కేంద్రం, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయన్న తంతు అర్ధంకాదు. దీనివల్ల ప్రేక్షకుడు కొంత విసుగు చెందుతాడు. దినేష్ కృష్ణన్ (్ఛయాగ్రాహకుడు) చేసిన కృషి కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
*
-అనే్వషి

-అనే్వషి