రివ్యూ

దేవుడు రక్షించేశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** రక్షకభటుడు
**
తారాగణం: రిచా పనయ్, నందు, బ్రహ్మాజీ, జ్యోతి, ధన్‌రాజ్, చిత్రం శ్రీను, కాట్రాజు, బాహుబలి ప్రభాకర్, సంపూర్ణేష్‌బాబు తదితరులు
కెమెరా: మల్‌హర్‌భట్ జోషి
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: ఎ.గురురాజ్
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
**

దేవుడు అంతటా ఉంటాడు. అయితే అవసరమైనప్పుడే కనిపిస్తాడు. చుట్టూ ఎవరూ లేరని అన్యాయాలు చేస్తే, అంతటా వున్న దేవుడు ఓ కంట కనిపెడుతూనే వుంటాడు. సమయం వచ్చినపుడు శిక్షిస్తాడు. అది తెలుసుకోలేని అజ్ఞానులు అన్యాయాలు, అఘాయిత్యాలు చేస్తూనే వుంటారు. దేవుడు మూడో కన్ను తెరిచినపుడు ఏ శక్తీ ఆపలేదు. అటువంటి ఓ పాయింట్ తీసుకుని దర్శకుడు తనకిష్టమైన రక్ష అన్న టైటిల్‌తో ఇంకొంచెం ముందుకువెళ్లి రక్షకభటుడు అన్న పేరుతో చిత్రీకరించిన సినిమా ఇది. కథ, కథనాలు వైవిధ్యంగానే తయారుచేసుకున్నా, సినిమాలో గ్రిప్ తక్కువై ప్రేక్షకులు ఆశించిన స్థాయలో అందలేదు.
అరకు పరిసర ప్రాంతాల్లో ఓ ఊరు అనంతగిరి. అక్కడ నో క్రైమ్. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎవరూ ఫిర్యాదు చేయరు. అసలు అటువైపు ఎవరూ కనిపించరు కూడా. అటువంటి ఓ పోలీస్ స్టేషన్‌లో ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ళు, ఓ మహిళా కానిస్టేబుల్ కలిసి ఉద్యోగాలు చేస్తుంటారు. రాత్రి అయితే ఎవరో ఒకరు డ్యూటీ చేయాలి కనుక గణపతి (్ధన్‌రాజ్)ని నియమిస్తారు. చీకటి అంటే భయపడే గణపతి, తనకు తోడుగా ముగ్గురు చిల్లర దొంగలను తెచ్చి సెల్‌లో బంధిస్తాడు. వారి కోరికలు తీర్చడం అతనికి ఇబ్బంది అవుతుంది. మందు, విందు, పొందు మూడు కావాలనే ఆ ముగ్గురు పెట్టే ఇబ్బందులను గణపతి తట్టుకోలేకపోతాడు. ఒక రోజు అతని వెనుక వచ్చిన మైథిలి (రిచా పనయ్)ని చూసి తమకోసమే గణపతి తీసుకొచ్చాడనుకుంటారు. ఆమెపై అఘాయిత్యం చేయాలనుకుంటే ఏదో అదృశ్యశక్తి కాపాడుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో అనేక సన్నివేశాలు నవ్వులతో జరిగిపోతాయి. ఇంతకూ మైథిలి ఎవరు? ఆమె వెనుక అదృశ్యశక్తి ఎందుకు ఆమెను రక్షిస్తోంది? అన్న కథనమే సినిమా ముగింపు.
రక్షకభటుడు అన్న ఓ మంచి టైటిల్‌ను బేస్ చేసుకొని దర్శకుడు కథనాన్ని అల్లుకునే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టడంతో కథనం అక్కడక్కడా ట్రాక్ తప్పింది. పోలీస్ స్టేషన్‌లో బ్రహ్మాజీ సరసాలు, బ్రహ్మానందం షూటింగ్ గోల తదితర అంశాలతో కామెడీ సృష్టించాలనుకున్నా పండలేదు. అయితే, షూటింగ్ హడావుడి అంతా కథనాన్ని నడిపించడానికి ఉపయోగపడింది. శవం నటించడం, హారర్ చిత్రాల దర్శకుడికి పరాకాష్టగా శవం చేతే నటింపచేయడం, శవం యుద్ధం చేయడం, అదృశ్యక్తిగా కనిపించే రక్షకభటుడిపై చిత్రీకరించిన సన్నివేశాలు కొత్తగానే అనిపిస్తాయి. అయితే, సినిమా మొత్తం ఒక్క పోలీస్ స్టేషన్‌లోనే చిత్రీకరించడం దర్శకుడికి సవాల్‌లాంటిదే. దాన్ని దర్శకుడు అధిగమించి తన వంతు కృషిచేశాడు. సినిమాలో ఒక్క పాట కూడా లేదు. చాలాచోట్ల డైలాగులు పేలాయి. ‘ఆడు పోలీస్ అయితే నేను పిన్నీస్’, ‘పెన్షన్ తీసుకునే వయసులో ఈ టెన్షన్ అవసరమా’?, ‘కేసులు బుక్ చేసే చేత్తో కేసును బుక్‌చేసి తీసుకురావాలా?’, ‘అత్తారింటికి వచ్చిన కొత్తల్లుళ్ళులా ఉన్నారు’ లాంటి ప్రాస డైలాగులు సినిమాలో ఆకర్షిస్తాయి. పాటలు లేకపోయనా డైలాగులే రిలీఫ్ అనిపిస్తుంది. నటీనటుల్లో రిచా పనయ్ ఫర్వాలేదనిపించేలా చేసింది. నందు పాత్ర చిన్నది. ఇక పోలీస్ స్టేషన్‌లో కనిపించే బ్రహ్మాజీ, జ్యోతి, కృష్ణేశ్వరరావు, రఘులకు మంచి స్పాన్ వున్న పాత్రలు దొరికాయి. ఆ పాత్రల్లో వాళ్ళు బానే చేశారు. సంపూర్ణేష్‌బాబు మరణానికి ముందు ఓ వ్యక్తిత్వంతో కన్పిస్తే, తరువాత మరో కోణంలో చూపటం ఇబ్బందికరం. కథలోవున్న పాయింట్లను తరచి తరచి ఆలోచిస్తే ఒక్కొక్కసారి మింగుడుపడదు. కొన్ని సన్నివేశాలతో ఆ బోరింగ్‌ను దర్శకుడు అధిగమించగలిగాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా కెమెరా పనితనం సినిమాకు హైలెట్.

-శేఖర్