రివ్యూ

ఈ ఆత్మా అలాంటిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * అవంతిక
*
తారాగణం: పూర్ణ, శ్రీరాజ్ బల్లా, గీతాంజలి, అజయ్ ఘోష్, షాయాజీ షిండే, షకలక శంకర్, ధన్‌రాజ్ తదితరులు
సంగీతం: రవిరాజ్
నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
దర్శకత్వం: శ్రీరాజ్ బల్లా
*
‘ఆత్మ’ కథలన్నీ ఒకే పంథాలో ఉండాలన్న రూలేం లేదు. కానీ- ఎందుకో? ఏ ‘ఆత్మ’ ఫ్లాష్‌బ్యాక్ చూసినా ఇంతే సంగతులు. చిత్తగించవలెను. ఒక పాడుబడిన బంగ్లా. లేదూ.. ఓ అపార్ట్‌మెంట్. లేక -్ఫంహౌస్. వచ్చి పోతూండేందుకు అనువుగా కొద్ది క్రోసుల దూరంలో స్మశానం. అర్ధరాత్రి. అమావాస్య.. నగరంలో మధ్యలో నక్కల ఊళలు.. గుడ్లగూబల మిటకరింపులు.. ఆత్మలు నిర్భయంగా సంచరించేందుకు అనువైన ప్రాంతం -ఏనాడో ఎవరో ఒకరు మట్టుబెడితే.. పగ తీర్చుకొనేందుకు ‘ఆత్మ’ ఏళ్ల తరబడి వెయిటింగ్ -ఇలా సాగుతూ పోతూంటుంది ‘ఆత్మ’కథ. కొనే్నళ్లుగా ఇటువంటి దెయ్యాల కథల్ని చూసిచూసీ ఉన్న జనానికే అలవాటైన ‘ఆత్మ’ని వేరే డైరెక్షన్‌లో చూపించాలన్న ఆలోచన సినీ కథల్లో కనిపించదు ఎందువల్లనో? పోస్టర్లలో ఎంతో భారీగా హారర్‌గా కనిపించిన ‘అవంతిక’ -రొటీన్‌కి భిన్నంగా ఏమైనా ఉందేమో చూద్దాం.
పల్లెటూరి అమ్మాయి అవంతిక (పూర్ణ). అమాయకత్వం మూర్త్భీవించిన ఆమెకి ఎన్నో కోరికలు. కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలనీ.. రాజభోగాల్లో తులతూగాలనీ.. ఇలా ఎనె్నన్నో. లక్ష్మీపూజ చేస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని ఆమె అక్క, బావ నమ్మబలికి.. ఓ రాజకీయ నాయకుడి (అజయ్ ఘోష్) దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రాజకీయ నాయకుడికి ఉన్నపళంగా అదృష్టం కలిసి రావాలన్న కోరిక. నరబలి ఇస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందన్న బాబా (షాయాజీ షిండే) ఆదేశానుసారం -లక్ష్మీపూజ చేయిస్తున్నట్టు ప్లాన్ వేసి అవంతికని ఓ ఫ్లాట్‌లో నరబలి ఇస్తాడు.
అవంతిక ఆత్మ అదే ఫ్లాట్‌లో తిరుగాడుతూ ఉంటుంది. పల్లెటూరి నుంచి వచ్చిన శ్రీను (శ్రీరాజ్) ఆ ఫ్లాట్‌ని కొనుక్కుని గృహప్రవేశం చేస్తాడు. ఫ్లాట్‌లో ప్రవేశించింది మొదలు శ్రీనుకి కష్టాలు ఆరంభం. తనతో పాటు ఎవరో ఉంటున్నారనీ.. నీడలేవో వెంటాడుతూన్నట్టు అనిపిస్తుంది. అవంతిక ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లిందా? శ్రీను ప్రేమాయణం ముగింపునకు వచ్చిందా? అన్నది క్లైమాక్స్.
ఈ సినిమా పూర్తిగా మూఢ నమ్మకాలూ.. నరబలి అన్న అంశాలు చుట్టూ మొదలైనప్పటికీ -కథ తిరిగితిరిగి మళ్లీ.. అదే రొటీన్ ‘ఆత్మ’ కథలోకి వస్తుంది. ఎంచుకున్న అంశం ఒకటి.. చెప్పాలనుకున్నది ఒకటి.. వెరసి చెప్పింది మరొకటి అన్నట్టుగా ‘అవంతిక’ తయారైంది. అన్ని ఆత్మకథల్లో మాదిరిగానే.. ఈ హారర్ కామెడీ జోనర్‌లో కూడా కథ అక్కడక్కడ ‘గ్రాఫిక్స్’ సాయంతో తిరుగాడింది. కథాపరంగా చెప్పుకోటానికేం లేదు.
ఈ సినిమా గురించి చెప్పాలంటే.. పూర్ణ నటన గురించి చెప్పాలి. పల్లెటూరి అమ్మాయిగా.. ఆత్మగా పరి‘పూర్ణం’గా నటించి మెప్పించింది. దర్శకుడు శ్రీరాజ్.. హీరోగా కథని కొంత భాగం నడిపించాడు. వీరిద్దరే సినిమాకి ప్లస్ పాయింట్. ఐతే -చిత్రంలో భయపెట్టే అంశాలు గానీ.. ఫీల్ అవ్వాల్సిన సన్నివేశాలు గానీ.. ఏవీ లేకండా ఎంతో చప్పగా సాగిపోయింది. ఏదో ఒక ఫీలింగ్‌ని మిగల్చని సినిమాగా మిగిలింది. ‘ఆత్మ’పరంగా భయపెట్టిందా అంటే అదీ లేదు. శ్రీను -గీతాంజలిల ప్రేమ ఫీలింగ్‌ని తెచ్చిందా అంటే ఏదీ లేదు.
షకలక శంకర్, ధన్‌రాజ్ కామెడీ కాస్తంత పండింది. ఫస్ట్ హాఫ్‌లో పల్లెటూరి అందాలను చూపించటంలోనూ.. పల్లెటూరి అమ్మాయి అవంతికని అందంగా తీర్చిదిద్దటంలోనూ.. కెమెరా పనితనం బయటపడింది. స్క్రీన్‌ప్లే బాగుంది. పాటల చిత్రీకరణ మరింత బాగుంది. దర్శకుడిగా శ్రీరాజ్ తన కృషి పెట్టినప్పటికీ.. పాత ‘ఆత్మ’కథల ప్రభావం అతన్ని వెంటాడటంతో.. ‘అవంతిక’ ఆత్మ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టదు.

-బిఎనే్క