రివ్యూ

అసలుదే మిస్సయ్యంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * పెళ్లికిముందు ప్రేమకథ
*
నటీనటులు:
చేతన్ చీను, సునయన
సంగీతం:
వినోద్ యాజమాన్య
నిర్మాతలు:
సుధాకర్ పట్నం, అవినాష్ సలాండ్ర
దర్శకత్వం:
మధు గోపు
*
ప్రేమకథలన్నీ పెళ్లిముందే ఉంటాయి. తాను ప్రేమించినవారిని పెళ్లిచేసుకున్నవారికంటే విడిపోయినవారే ఎక్కువ. ఇక ప్రేమ అనే ఫీలింగ్‌లో ఎలాంటి మధుర భావాలు ఉన్నాయో దాదాపుగా ప్రతి మనిషికి అనుభవంలోకి వచ్చింది. అందుకే సినిమాలకు ప్రేమకథలే బలం. ఎన్నిరకాల ప్రేమలనైనా ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కారణం, ఎక్కడో మనకు కలిగిన అనుభవాలు కనిపించకపోతాయా అని. ఇప్పుడు అదే కథతో మరో ప్రేమకథను తెరకెక్కించాడు నూతన దర్శకుడు మధు గోపు. చేతన్ చీను, సునయన జంటగా నటించిన ఈ చిత్రం విడుదలైంది. మరి పెళ్లి ముందు జరిగిన ఈ ప్రేమకథ ఎలాగుందో తెలుసుకోవాలనుకుంటే కథలోకి వెళ్లాల్సిందే.
సంతోష్ (చేతన్ చీను) తనకు కలలో కనిపించి ఫోన్ నెంబరిచ్చిన డ్రీమ్ గరల్‌ను ఎలాగైనా కలవాలని ప్రయత్నించి చివరకు అను (సునయన)ను కలుస్తాడు. కానీ ఆమె మాత్రం కలిసేటప్పుడు తన ముఖం చూపించను అనే కండిషన్‌మీద అతన్ని కలుస్తుంది. సంతోష్ కూడా తన మొఖం చూపించకుండానే కలుస్తాడు. అలా మొఖాలు చూపించుకోకుండానే ఒకరికొరు దగ్గరయ్యే ప్రయత్నంలో సంతోష్ చేసిన ఓ పొరపాటు కారణంగా ఆమెతో విడిపోతాడు. అలా మొఖం కూడా చూడకుండా అనుతో విడిపోయిన సంతోష్, ఆమెనే ఓ ఫ్రెండ్ పెళ్లిలో చూసి ప్రేమించి, ఆ తరువాత ఇద్దరూ ఒకటవుతారు. అలా పెళ్లికి ముందు తాము ప్రేమించిన వ్యక్తితోనే ఇప్పుడు తమ పెళ్లి అయిందన్న విషయం తెలియని ఆ ఇద్దరి వైవాహిక జీవితం ఎలా సాగింది? పెళ్లికి ముందు వారి ప్రేమకథ, పెళ్లి తరువాత ఎలాంటి సమస్యలు తెచ్చింది? చివరికి అన్నీ వాళ్ళు ఒక్కటయ్యారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.
కథలో పెద్దగా ట్విస్టు లేకుండా ఇలాంటి చాలా కథలు చూసేశాం అన్న ఫీలింగ్ కలిగించే కథ ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం ఏదైనా వుందా అంటే, అది హీరోయిన్ అని చెప్పాలి. మొదటి ఫ్రేమ్‌నుండి ఆమెను అందంగా చూపించడానికి ప్రయత్నించారు. ఇక హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూపించుకోకుండా ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉండి కలుసుకోవడం వంటి భిన్నమైన సన్నివేశాలు ఓకె అనిపించాయి. ఇక కథతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా మధ్యలో వచ్చే తా.రమేష్, సత్య కామెడీ బోర్ కొట్టించింది. అలాగే హీరో హీరోయిన్లమధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హీరో చేతన్ చీను లుక్స్ పరంగా బాగానే ఉన్నా, నటన విషయంలో ఆకట్టుకోలేకపోయాడు. సినిమాలో ప్రధాన బలహీనత స్క్రీన్‌ప్లే. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా, దానికి తయారుచేసుకున్న కథనం బాగోలేదు. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి మధ్య సంబంధమే కనిపించలేదు. తెరమీద నడిచే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. అసలు హీరో హీరోయిన్ల పాత్రల స్వభావం ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేయలేదు. కామెడీ అనేది ఖచ్చితంగా ఉండాలనే బలవంతంగా అనవసరమైన కామెడీ పాత్రలను ఇరికించి చిరాకు తెప్పించాడు. దానికితోడు ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేని పాటలు కూడా మరింత నీరసం తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ హీరోయిన్‌మీద ఫోకస్ చేయడంతో ఏదో గడిచిపోయింది అని అనుకునేసరికి, సెకెండాఫ్ మరీ దారుణంగా తయారై బాబోయ్ అనేలా చేసింది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, పి.సి.ఖన్నా సినిమాటోగ్రఫి కాస్త బెటర్. వినోద్ యాజమాన్య అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ, పాటల సంగీతం కానీ ఏమంత ఆకట్టుకోలేదు. అమర్‌రెడ్డి ఎడిటింగ్ ఉపయోగపడలేదు. అనవసరమైన కామెడీ సన్నివేశాల్ని కొన్ని తొలగించి వుంటే బావుండేది. ఇక దర్శకుడు మధు గోపు విషయానికి వస్తే, ఆయన చెప్పాలనుకున్న కథాంశం బాగున్నా, రాసుకున్న కథనం, తెరకెక్కించిన తీరు పూర్తిగా విఫలమయ్యాయి. నిర్మాణ విలువలు ఓకె.
చివరగా పెళ్లి ముందు నడిపిన ప్రేమకథలో అసలు విషయం కరువైంది. అసలు ప్రేమకథ అనేది ఖచ్చితంగా చూపించకుండానే దాన్ని రెండో భాగానికి షిప్టు చేశాడు దర్శకుడు. పెళ్లి తరువాత ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టిందో చూపాలనే ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. సునయన స్క్రీన్ ప్రెజెంటేషన్, అక్కడక్కడా నవ్వించే కామెడీ ఆకట్టుకోగా, ఏ మాత్రం ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే, అనవసరమైన ఒకదానితో ఒకటి సంబంధంలేని సన్నివేశాలు సినిమాను నీరుగార్చాయి.

-త్రివేది