రివ్యూ

ఔను.. మణి మెరవలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *మరకతమణి
*
తారాగణం: ఆది పినిశెట్టి, నిక్కీగల్రానీ, ఆనంద్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రామదాస్, డానియల్, మైమ్‌గోపీ, అరుణ్‌రాజ్ కామరాజ్, ఎం.ఎస్.్భస్కర్, కాళి వెంకట్, కె.పూర్ణేష్, సంగ్లీ మురుగన్
సంగీతం: ధిబు నినస్ థామస్
నిర్మాణం: శ్రీచక్ర ఇన్నోవేషన్స్, రుషి మీడియా, ఏక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ
రచన, దర్శకత్వం: ఎ.ఆర్.కె.శరవణన్
*
‘మరకతమణి’ చిత్ర ప్రచారంలో భాగంగా చిత్ర నాయకుడు ఆది పినిశెట్టి ఓ సందర్భంలో ‘ఏవో మూడు పాటలు, ఆరు ఫైట్లు తరహా చిత్రాన్ని చూసే ఉద్దేశ్యంతో ఉన్నవారు మాత్రం ఈ సినిమా చూడడానికి రాకండి’ అన్నాడు. అలా అంటూనే ‘ఇది అయిదు పాత్రలతో జరిగే ఆసక్తిదాయక కథనంతో తయారైంది’ అనీ చెప్పాడు. పైదాంట్లో ఆది అన్న ప్రథమ భాగం (మూడు పాటలు..) అన్నది ‘మరకతమణి’ విషయంలో వాస్తవమైంది కానీ, వారు అన్న ‘ఆసక్తికర కథనం..’ మాత్రం అవాస్తవం. ఇందులో ఉన్నది- ఈమధ్య తెలుగు చిత్రసీమ విపరీతంగా నమ్ముకున్న ‘ఆత్మ’ల ట్రెండుకు కాస్త కొనసాగింపు. అది- ఓ విషయంలో చనిపోయినవారి ఆత్మలు, ఇటీవల చనిపోయిన వారి శరీరాల్లో ప్రవేశించి (?) హంగామా చేయడం వంటి అత్యంత నమ్మశక్యంకాని తతంగం. ఒక్కమాటలో చెప్పాలంటే అవడానికి ఇది కామెడీ హారర్ జోనర్ అని ప్రచారం జరిగినా చివరకు ఇది కామెడీకి కాస్తంత ఎక్కువగా హర్రర్‌కి కొంత తక్కువగానూ ఉన్న పిక్చర్‌గా సెటిలయ్యింది.
తనకు ఊళ్లో ఉన్న అప్పులను తీర్చడానికి ఉన్నఫళాన అధిక మొత్తాలు వచ్చేసే మార్గం ఉన్న ‘స్మగ్లింగ్’ పనిచేసి డబ్బు సంపాదించేయాలన్న తత్వంతో రఘునందన్ (ఆది పినిశెట్టి) పట్నానికొస్తాడు. అక్కడ చిన్నా చితకా స్మగ్లింగ్ కార్యక్రమాలు చేస్తూ విసుగు చెందిన అతనికి ఓ సందర్భంలో విక్రమాదిత్యుని కాలంనాటి అపురూపమైన ‘మరకతమణి’ని తెచ్చి ఇస్తే పదికోట్లు ప్రతిగా ఇస్తామన్న డీల్ ఎదురౌతుంది. అలా అంతకుముందు ‘మరకతమణి’ కోసం ప్రయత్నించిన 132మంది మరణించారన్న విషయం తెలిసినా రిస్కుకు సిద్ధపడతాడు రఘు. మరి ఇలాంటి ప్రమాదకర ప్రయత్నానికి పూనుకున్న రఘునందన్ ఏవిధంగా ‘మరకతమణి’ని సాధించాడన్నది మిగతా కథ.. ఇలా వజ్రపు వేట కీలక కథాంశంగా హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో తెలుగులోనూ గతంలో చిత్రాలొచ్చాయి. అయితే వాటికీ, దీనికీ ఉన్న తేడా- అవన్నీ ఆ తరహా వేటలో ప్రయాణంలో ఏర్పడ్డ మలుపులతో చిత్రకథ నడుస్తాయి. ఇందులో అందుకు విరుద్ధంగా, ఆత్మలు ప్రవేశాలు తదితరాలతో నిండిపోయింది. అయితే ఈమొత్తం వ్యవహారంలో జరిగే పలు సన్నివేశాల్లో దర్శకుడు శరవణన్ ఏ సందర్భంలోనూ తర్కానికి తావివ్వకుండా రెండు గంటల పది నిమిషాలూ నడిపేశారు. దీంతో ఎంత ‘్ఫంటసీ’ కథాంశమైనా ప్రాథమిక విషయాలకు కూడా వాస్తవకోణం లేకపోతే ఎలా అన్న తీవ్ర అసంతృప్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. కథానాయిక అలేఖ్య (నిక్కీ గల్రాని)ను పెట్టినా ఎక్కడా నాయికా, నాయకులమధ్య డ్యూయెట్ కానీ, డ్రీమ్‌సాంగ్ కానీ పెట్టకుండా చిత్ర వస్తువు (అది ఎంత వాస్తవదూరంగా ఉన్నా సరే!) పైనే దృష్టి పెట్టడం అభినందనీయం. అయితే అలా నూట ముప్ఫై రెండుమంది ఒకే తరహాలో (డ్రైవర్ లేని లారీ తరుముకురావడం ద్వారా) చనిపోవడాలు తటస్థించినా పోలీసుపరంగా ఎలాంటి అనే్వషణా జరుగుతున్నట్లు కూడా చూపకపోవడం ద్వారా డైరెక్టర్ తీసుకున్న ‘అతి స్వాతంత్య్రం’ మాత్రం అన్నివిధాలా గర్హనీయం. పోనీ ఆసక్తికర కథనం ఉందా అంటే ప్రథమార్థం అంతా చాలా నెమ్మదిగా ప్రేక్షకుల సహన పరీక్షకు ప్రతీకగా నిలుస్తుంది. ఒక్క రాందాసు పాత్ర చేసే హడావిడే చిత్రాన్ని అక్కడక్కడా కాస్తంత ఉత్సాహభరితం చేసింది. ఎంతో క్రూరంగా మొదట్లో చూపిన ట్వింకిల్ రామనాథం (ఆనంద్‌రాజ్) పాత్రకు తర్వాత సందర్భాలలో కామెడీ రూపునిచ్చేయడం ద్వారా దర్శకునిలో మోతాదు మించిన కామెడీ టింజ్‌ని తెలుపుతోంది. పాత్రధారుల నటనా విషయాలకొస్తే ఆది పినిశెట్టి తన ‘మార్కు’ నటన ప్రదర్శించాడు. నాయికగా నిక్కీ గల్రానీ పరిధి తక్కువైనా రౌడీ మంగరాజు ఆత్మ ఆవహించిన సీన్లలో ఆ పాత్రకు అవసరమైన కరుకుదనాన్ని హావభావాల్లో చూపించింది. హీరో స్నేహితుడు బుచ్చి (డానియల్) చక్కటి కామెడీ టైమింగ్‌ను పాటించి ఆకట్టుకున్నాడు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాత్రల నిడివి మరీ తక్కువ. రాందాసు పాత్రతో ఓ సందర్భంలో వైన్ షాపు ముందు గుమిగూడిన జనాన్ని ఉద్దేశించి ‘వీళ్లందరూ కూడా త్వరలో మా దగ్గరికి వచ్చేస్తారు’ (చనిపోతారు) అనిపించిన సెటైర్ పండింది. ముందే అనుకున్నట్లు పాటలూ తదితర రొటీన్ వాణిజ్య అంశాలకు స్థానం లేదు. థామస్ అందించిన స్వరాల్లో థీమ్‌సాంగ్‌గా డిజైన్ చేసిన ‘స్వార్థం కమ్మే..’ పాట సిట్యుయేషన్ సింక్ అయింది. ఆ పాటలో వాడిన ‘ఎదిరించి నిలబడ్డావు, మృత్యువువై వెంటే రానీ, శత్రువునైన హతమార్చేయనా?’ పదాలు సీన్‌కు తగినట్లు సరిగ్గా సరిపోయాయి. ఇలాంటి చిత్రాల్లో కావాల్సిన ఛాయాగ్రాహక నైపుణ్యం శంకర్ పుష్కలంగా అందించాడు.

-అనే్వషి