రివ్యూ

‘ఆత్మ’లోపించిన కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * హసీనా పార్కర్
*
తారాగణం:
శ్రద్ధాకపూర్, సిద్ధాంత్ కపూర్,
సునీల్ ఉపాధ్యాయ్,
అంకుర్ భాటియా,
ప్రియాంకా సేథియా తదితరులు
సంగీతం: సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ: ఫసాహత్ ఖాన్
కథ: సురేష్ నాయర్
నిర్మాత: నాహిద్ ఖాన్
దర్శకత్వం: అపూర్వ లాఖియా
*
ముందుగా ఈ కథకి పెట్టిన పేరు ‘హసీ నా: క్వీన్ ఆఫ్ ముంబై’. కారణాంతరాల వల్ల ‘హసీనా పార్కర్’ అన్న టైటిల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరీ హసీనా? ముంబై అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహోదరిగా మాత్రమే కొంతమందికి తెలుసు. అంతకు మించి ఆమె గురించిన విశేషాలేవీ తెలీవు. ముంబై పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈమె తాలూకు ‘అండర్‌వరల్డ్’ చరిత్రని తెర కెక్కించే ప్రయత్నం చేశారు అపూర్వ లాఖియా. ‘ఆత్మకథ’లో ఉత్కంఠతని రగిలించే అంశాలుంటాయి. ఏం జరిగిందన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అక్కడక్కడ ప్రేక్షకుడికి తెలిసిన సంఘటనలను బేరీజు వేసుకొనే అవకాశం ఉంటుం ది. ఇదంతా కూడా కేవలం ఆ ‘ఆత్మకథ’ని మెలోడ్రామాతో మేళవించి అందించినప్పుడు మాత్రమే. లేకుంటే అదొక డాక్యుమెంటరీలా మారుతుంది. బోర్ కొట్టిస్తుంది. విసుగు తెప్పిస్తుంది.. ‘హసీనా’ కథలో ఆసక్తికరమైన అంశాలెన్నో ఉన్నప్పటికీ ఎందుకో ఆ ‘్ఫల్’ని తేవటంలో సఫలీకృతం కాకపోవటంవల్ల ఈ కథ చతికిలపడింది.
హసీనా అసలు కథ ఏమిటో చూద్దాం. ఈమె అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు. దావూద్ తండ్రి 12 మంది సంతానంలో 7వ అమ్మాయి. 1991లో డాన్ అరుణ్ గాలీ చేతిలో హసీనా భర్త హతం కావటంతో కుటుంబ నేపథ్యం నుంచీ అండర్ వరల్డ్‌లోకి ప్రవేశించింది. అప్పట్లో నాగ్‌పడలోని గోర్డన్ హాల్ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవాళ్లు. అక్కడ్నుంచీ ఆమె షిప్ట్ అయి ముంబై చేరుకొంది. పోలీసు రికార్డుల ప్రకారం సహోదరుడు దావూద్ ఇబ్రహీంతో హసీనాకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. కానీ ముంబై వ్యాపార వ్యవహారాల్లోనూ.. చీకటి కోణాల్లోనూ దూ సుకెళ్లటానికి దావూద్ పేరు ఉపయోగించుకొందన్న ఆరోపణలు ఉన్నాయి. దావూద్ పేరిట అనేకానేక బెదిరింపులు సైతం చేసిన దాఖలాలున్నాయిట. పోలీసు లెక్కల ప్రకారమే - ముంబై పరిసర ప్రాంతాల్లో దేశ విదేశాల్లోనూ ఆమెకున్న ఆస్తుల విలువ 5వేల కోట్లు. మిడిల్ ఈస్ట్ నుంచి ఇండియాకీ.. అనేక దేశాలకు ‘మనీ ట్రాన్స్‌ఫర్’ రాకెట్‌తో సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక భూదందాల సంగతి చెప్పనక్కర్లేదు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయటం.. భూములను ఆక్రమించుకోవటం.. అక్రమ ధనార్జన - ఇలా ఎనె్నన్నో. అనేక బాలీవుడ్ సినిమాల రైట్స్‌ని సైతం అక్రమంగా తీసుకుంటుంది. 2006లో ముంబై నుంచీ గోవాకి వస్తూండగా ఆమె కొడుకు ధనిష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. హసీనా 2014లో కార్డియాక్ అరెస్ట్‌తో మరణించటంతో ఆమె ‘చీకటి’ చరిత్ర ముగిసింది.
గ్యాంగ్‌స్టర్ సినిమాలకి మల్లేనే ఈ సినిమా కూడా అలాగే మొదలయింది. ఐతే- పైన చెప్పిన కథలోని ఉత్కంఠత తెరపై కనిపించక పోవటంతో.. ఒక మామూలు క్రైం స్టోరీని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. పైపెచ్చు హసీనా గురించి ప్రేక్షకులకు తెలిసింది అతి కొద్ది. ముంబై మాఫియాలో ఆడవాళ్ల మూలాలేమిటో అంతగా తెలీదు. దీన్ని ఆధారం చేసుకొని చిత్రాన్ని రూపొందించినప్పటికీ.. ‘దావూద్’ కథతో కనెక్ట్ అవటం కష్టమైంది.
మాఫియా గురించిన విశేషాల్తో.. అండర్ వరల్డ్ అంశాల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ‘హసీనా’ కథలా చూట్టానికి మనసొప్పదు. ఇక -నటనాపరంగా శ్రద్ధని ఇంతకు మునుపు ఈ తరహా పాత్రల్లో చూడకపోవటంవల్ల కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోసింది. దావూద్ ఇబ్రహీంగా శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ నటించటం విశేషం. ఆయా పాత్రధారులంతా తమ పరిధి మేరకు నటించారు. సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ప్లే జస్ట్ ఓకే.

-బిఎనే్క