రివ్యూ

వినోదాల విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మహానుభావుడు
**
తారాగణం:
శర్వానంద్, మెహరీన్,
నాజర్, వెనె్నల కిశోర్,
భద్రం, నల్లవేణు,
రామరాజు తదితరులు
సినిమాటో గ్రఫీ: నిజార్ షఫి
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాణం: యు.వి క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
రచన, దర్శకత్వం: మారుతి
**
మాస్ సినిమాలకంటే కూడా ఫ్యామిలీ ప్రేక్షకులపై దృష్టిపెట్టిన హీరో శర్వానంద్ వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా మారుతితో కలిసి ‘మహానుభావుడు’గా మన ముందుకు వచ్చాడు. ఇక మొదట్లో బోల్డ్ కంటెంట్‌తో ఆకట్టుకున్న దర్శకుడు మారుతి.. తన పంథాను మార్చుకుని ఫ్యామిలీ ప్రేక్షకుల వైపునకు తన ఫోకస్ మార్చాడు. నానితో చేసిన ‘్భలే భలే మగాడివోయ్’తో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న మారుతి.. ఆ తరహాలోనే మరో లోపంతో కథను రాసుకున్నాడు. అందులో మతిమరుపు యువకుడి కథను పరిచయం చేస్తే, ఈసారి ఓసిడి లోపాన్ని ఎంచుకున్నాడు. ఏదైనా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి కథ.. దానికి తగ్గ ట్రీట్‌మెంట్ అవసరం. పైగా సగటు ప్రేక్షకులు కోరుకునేది వినోదం. అది ఏ రూపంలో అందించినా సినిమా ని విజయవంతం చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీ. అలా వినోద ప్రధానంగా, కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే రూపొందించిన సినిమా ఇది. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. మరి ఈ మహానుభావుడు ఎలా మారాడు? అసలు ఆయన కథ ఏమిటి? అతనికి వున్న వింత జబ్బు ఏమిటి? అన్నది తెలయాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనగా ‘అతి శుభ్రత’ అనే లక్షణాలు ఉన్న యువకుడు ఆనంద్ (శర్వానంద్) తనతోపాటు తన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు, వ్యక్తులు కూడా శుభ్రంగా వుండాలని అనుకుంటాడు. అలా కాకుండా ఎవరైనా చిన్న అశుభ్రతతో కనిపించినా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాడు. జబ్బుతో వుంటే కనీసం కన్నతల్లిని కూడా దగ్గరికి రానివ్వనంతటి శుభ్రత అతనిది.
అలాంటి లక్షణం కలిగిన ఆనంద్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. ఎందుకంటే అక్కడ ఎక్కువ శుభ్రత ఉంటుంది కాబట్టి.. ఇక తన కొలీగ్ మేఘనను ప్రేమిస్తాడు. మేఘన కూడా అతన్ని ఇష్టపడి ఆరంభంలో అతని ఓసిడి లక్షణాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత తర్వాత కొన్ని సందర్భాలవలన తట్టుకోలేక బ్రేకప్ చెబుతుంది. అలా ఓసిడి వలన ప్రేమను కోల్పోయిన ఆనంద్ తిరిగి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? ఓసిడికి-ప్రేమకి మధ్య ఎలా నలిగిపోయాడు, చివరికి అతని ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
మారుతి చేసిన ‘్భలే భలే మగాడివోయ్’ చిత్రానికి ఈ చిత్రానికి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఆ సినిమాలో హీరో మతిమరుపు అనే డిజార్డర్ కలిగివుంటాడు. ఈ సినిమాలో ఓసిడితో బాధపడుతుంటాడు. ఓసిడిలో చాలా రకాలు వున్నా, మన హీరో మాత్రం అతిశుభ్రత అనే డిజార్డర్ కలిగి వుంటాడు. అతి శుభ్రతతో తన చుట్టూ వున్నవారిని ఇబ్బంది పెడతాడు. వారి కోపానికి కారణమవుతాడు. ఓసిడితో తను ఇబ్బంది పడడమే కాకుండా అందర్నీ ఇబ్బంది పెట్టే క్యారెక్టర్‌లో శర్వానంద్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆద్యం తం ప్రేక్షకుల్ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే కొన్ని ఎమోషనల్, సెంటిమెంట్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇక మెహరీన్ గ్లామర్ సినిమాకి ప్లస్ అయింది. నటనకు స్కోప్ వున్న ఆ క్యారెక్టర్‌కి మెహరీన్ పూర్తి న్యాయం చేసింది. వెనె్నల కిశోర్ బాగా నవ్వించాడు. నల్లవేణు, భద్రం కూడా నవ్వించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు.
టెక్నికల్ హైలెట్స్ గురించి చెప్పాలంటే.. నిజార్ షఫి ఫొటోగ్రఫీ బాగుంది. భలే భలే మగాడివోయ్ తరువాత మారుతి కాంబినేషన్‌లో నిజార్ చేసిన సినిమా ఇది. అలాగే పాటల్ని కూడా ఎంతో అందంగా చిత్రీకరించాడు. మెహరీన్‌ను మరింత అందంగా చూపించాడు. తమన్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కోటగిరి ఎడిటింగ్ ఓకె. కానీ సెకెండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ని తొలగించే అవకాశం వున్నా ఆ ప్రయత్నం చేయలేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చిత్రాన్ని రిచ్‌గా నిర్మించారు నిర్మాతలు. ఇక దర్శకుడు మారుతి భలే భలే మగాడివోయ్ విజయం తరువాత ‘బాబు బంగారం’తో పరాజయాన్ని చవిచూశాడు. తాజాగా వచ్చిన ‘మహానుభావుడు’ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని ఓసిడి అనే పాయింట్‌ని తీసుకొని దాన్ని మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో మారుతి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ ఫస్ట్‌హాఫ్ నడిపించినంత గ్రిప్పింగ్‌గా సెకెండాఫ్‌ని నడిపించలేదు. సినిమాలో తర్వాత ఏం జరగబోతుందనేది ముందుగా ఊహించొచ్చు. సిటీలో సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్ నుంచి సెకెండాఫ్‌లో ఒక్కసారిగా పల్లెటూరికి వెళ్లిపోవడం వరకు బాగానే వున్నా.. అక్కడ తీసిన కొన్ని సీన్స్‌లో లాజిక్ అనేది కనిపించదు. పల్లెటూరులోని ఉన్నత కుటుంబానికి చెందినవారికి బాత్‌రూమ్‌లు కూ డా లేవని, ఆరుబయటే స్నా నం చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అలాగే కుస్తీ పోటీల్లో విజేతలైనవారిని గ్రామపెద్దని సర్పంచ్‌గా ఎన్నుకోవడం అనేది కాస్త వింతగా వుంది. కట్‌చేస్తే.. తన కొడుకు తన లా కాకూడదని భావించిన హీరో అందరు పిల్లల్లాగే వర్షంలో తడుస్తూ అందరితో కలిసిపోవాలని చేసిన ప్రయత్నం ఫైనల్‌గా ఆకట్టుకుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి ఫ్యామిలీ టచ్‌తో ఉన్న సినిమా ఇది. కొద్దిగా నెమ్మదించిన ఫస్ట్‌హాఫ్, ఊహించేయగల కథనం ఇందులో చిన్న చిన్న బలహీనతలు కాగా, ఆరంభంనుండి చివరివరకూ నవ్వించే ఫన్నీ సన్నివేశాలు, ఆసక్తికరమైన ఓసిడి కానె్సప్ట్, మంచి పాటలు, శర్వానంద్ నటన, సినిమా చివరిలో ఎలివేట్ అయ్యే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలు. మొత్తం మీద ఈ చిత్రం ప్రేక్షకుడికి వినోదాల విందే!

-త్రివేది