రివ్యూ

పేలని కిడ్నాప్ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను కిడ్నాప్ అయ్యాను * బాగోలేదు

*
తారాగణం:
పోసాని కృష్ణమురళి, బిందు,
బ్రహ్మానందం, కృష్ణ్భగవాన్
తదితరులు
సంగీతం: శ్రీకాంత్
బ్యానర్: మధురం మూవీస్
నిర్మాత: మాధవి
దర్శకత్వం: శ్రీకర్‌బాబు
*
క్రైమ్ సినిమాలంటే జనాలకు కాస్త ఆసక్తి ఎక్కువ. అయితే కథలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తే ఆ సినిమా హిట్టుకిందే లెక్క. కానీ ఈ విషయంలో ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు అనేక పొరపాట్లు చేస్తుంటారు. నిజానికి క్రైమ్ కథలో కావలిసినన్ని ట్విస్టులు, భారీ కమర్షియల్ సరంజామా సిద్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చిన మరో చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. నటుడు పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రను పోషించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఇందులో ఎవరు కిడ్నాప్ అయ్యారు? ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారు? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
కొత్తగా సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆశలు పడే స్నేహితుల కథ ఇది. ఆ స్నేహితులంతా తమ ప్రాజెక్ట్‌ని తీసుకుని ప్రముఖ ఐటి నిపుణుడు అయిన దూబే (పోసాని) అనే వ్యక్తి వద్దకు వెళతారు. స్నేహితులు వివరించిన ప్రాజెక్టుకు దూబే ఇంప్రెస్ అవుతాడు. ఈ ప్రాజెక్టుని మరింత పెద్దగా చేసి విజయవంతం చేద్దామని దూబే వాళ్లకు చెబుతాడు. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యాక పోసాని తన స్వార్థం కోసం ఆ ప్రాజెక్ట్‌ని భారీ మొత్తానికి మరొకరికి అమ్మేస్తాడు. దూబే చేతిలో మోసపోయిన స్నేహితులు అతడికి ఎలా బుద్ధి చెప్పారనేదే మిగతా కథ.
నటుడు పోసాని ఎప్పుడు తన భిన్నమైన మేనరిజంతో ఆకట్టుకోవడం మనం చూస్తున్నదే. ఆ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఐటి నిపుణుడి పాత్రలో బాగా నటించాడు. అతడి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌లతో కొన్ని సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. అలాగే కొత్త నటీనటులు కూడా వారి వారి పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ రియాలిటీ అన్నది కనిపించకపోవడం విశేషం. ఇక కామెడీ విషయంలో పృథ్వీ, రఘుబాబులు చేసిన ప్రయత్నం పెద్దగా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో పృథ్వీ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఇక కథని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయాడు. స్నేహితులంతా కలిసి పోసానిని బోల్తా కొట్టించే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేవు. ఏదో కథ కోసం కావాలని అల్లుకున్న సన్నివేశాల తరహాలో సాగింది. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన బ్రహ్మానందం పాత్ర కూడా నిరాశపరిచింది. అనవసరమైన పంచ్ డైలాగ్స్‌తో విసుగు తెప్పించాడు. ఇక సాంకేతిక పరంగా చూస్తే.. కిడ్నాప్ క్రైమ్ డ్రామాని కలగలిపిన ఐడియా బాగానే వుంది కానీ, ఆ రెండింటినీ కలిపిన విధానం అంతంగా ఆకట్టుకోలేదు. దానిని అలా తీర్చిదిద్దడంలో దర్శకుడు ప్రయత్నం చేయలేకపోయాడు. టెక్నాలజీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా మిగిలినవి ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం జస్ట్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టివుంటే బావుండేది. సంగీతం విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఓ పాట బాగున్నా, రీ రికార్డింగ్ మాత్రం ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు మాత్రం ఫర్వాలేదనిపించాయి.
మొత్తానికి కిడ్నాప్ డ్రామాతో నడిచే ఈ సినిమా పాయింట్ బాగున్నా కూడా దర్శకుడు దానిని సరిగా డీల్ చేయలేక చతికిలపడ్డాడు. అటు పాత్రల నుంచి సరైన నటన రాబట్టక పోవడంతో సినిమా చూసే ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్రైం కథలంటే ఓ రేంజ్‌లో ఊహించుకునే ప్రేక్షకుడికి ఈ సినిమాతో కాస్త నిరాశే కలుగకమానదు.

-ఎస్.ఆర్.రావ్