రివ్యూ

రాజా ది గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజా ది గ్రేట్ ** ఫర్వాలేదు

** ** ***

తారాగణం:
రవితేజ, మెహరీన్
రాధిక, రాజేంద్రప్రసాద్, వివాస్ బాట్నే, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, పోసాని
శ్రీనివాసరెడ్డి, సన, సంపత్‌రాజ్, హరితేజ
అన్నపూర్ణ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
కెమెరా : మోహనకృష్ణ
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత : శిరీష్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి

** **

రవితేజ అంటే ఎవ్వరికైనా ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, ‘కిక్’లాంటి చిత్రాలు బాగా గుర్తుకొస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే అలాంటి మాస్ హీరో నుండి రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. ‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ నుండి చిత్రం రావడం.. అది కూడా అంధుడి పాత్రలో నటించడం.. దిల్ రాజుతో పదమూడేళ్ల తర్వాత సినిమా చేయడం.. అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రెకెత్తించింది. ఒకప్పుడు వరస విజయాలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన రవితేజ నుండి సినిమా వస్తోందంటే వినోదానికి ఏ మాత్రం ఢోకా వుండదని, కచ్చితంగా అందరి మనసుల్ని దోచుకుంటుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. నిర్మాతల్లో కూడా మినిమం గ్యారం టీ నమ్మకాన్ని కలిగించిన హీరో గత కొంతకాలంగా ఎందుకనో బాక్సాఫీస్ సందడికి దూరంగానే వున్నాడు. విజయాలు లేక ఆయనే కాదు, అతడిని నమ్ముకున్న నిర్మాతలూ నీరుగారిపోయారు. ఇలాం టి పరిస్థితులో ‘పటాస్’, ‘సుప్రీమ్’ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’తో ముందుకొచ్చాడు. మరి రవితేజ అంధుడిగా చేసిన ప్రయోగం ఫలించిందా? తన నటనతో మళ్లీ ఇరగదీశాడా? దర్శకుడు అనిల్ హ్యాట్రిక్ సాధించాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
చూపులేని రాజా (రవితేజ)ను వాళ్ల అమ్మ (రాధిక) పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకుంటుంది. అయితే రాజా అంధుడు కావడంతో అది సాధ్యం కాదు. కానీ పోలీసులకు సాయం చేసే అవకాశం వస్తుంది. అది ఎలాగంటే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్‌రాజ్) ఓ కేసు విషయంలో విలన్ దేవరాజ్ (వివాన్ బాట్నే) సోదరుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. దాంతో దేవరాజ్‌లో కసి పెరుగుతుంది. ప్రాణంగా చూసుకునే తమ్ముడిని చంపడంతో పగ పెంచుకున్న దేవ, ప్రకాష్‌రాజ్‌ను చంపేసి, అతడి కూతురు లక్కీ (మెహరీన్)ను హతమార్చాలని చూస్తా డు. లక్కీ కళ్ల ముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. లక్కీ మాత్రం విలన్ బారినుంచి తప్పించుకుని దూరంగా డార్జిలింగ్‌కు వెళ్లిపోతుంది. అదే సమయంలో చూపులేని రాజా పోలీస్ అవ్వాలనే యాంబిషన్‌తో పోలీసులతో కలిసి లక్కీని కాపాడే మిషన్‌లో ఎంటరవుతాడు. ఈ విషయంలో ఐజి (సంపత్) రాజాను లక్కీని కాపాడే టీమ్‌లో భాగం చేస్తాడు. లక్కీ డార్జిలింగ్‌లో వుందని తెలుసుకున్న దేవరాజ్ అతడి మనసుల్ని పంపుతాడు. కానీ రాజా వారిని ఎదిరించి లక్కీని కాపాడతాడు. లక్కీకి ధైర్యం చెబుతాడు. రాజా ఇచ్చిన ధైర్యంతో లక్కీ తన సొంత వూరికి వస్తుంది. అప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఆమెను చంపడానికి దేవ ఏం చేస్తాడు? రాజా వారి బారినుండి లక్కీని ఎలా కాపాడాడు? దేవను ఎలా ఎదిరించాడు? అనేదే సినిమా.
ఒక రకంగా ఇది ఒక ప్రయోగమే అని చెప్పాలి. ఇప్పటి వరకు హీరో సినిమా మొత్తం చూపులేకుండా వుండటమనేది కొత్తదే. పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి పట్టుదలతో అన్నింటిలోనూ శిక్షణ తీసుకుని పెరిగి పెద్దయితే ఎలా వుంటాడో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ కథలో హీరో రవితేజకు చూపులేకపోవడమే. అయితే హీరో పాత్రలో కాన్ఫిడెన్స్ తప్ప బాధ అనేదే కనిపించలేదు. దర్శకుడు అనిల్ మొదటి నుండి నమ్ముకున్న వినోదానే్న ఈ సినిమాలో చూపిస్తే, హీరో రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిక్ బాడీ లాంగ్వేజ్‌తో, మాస్ మేనరిజంతో తెరమీద అల్లరి చేసేశాడు. అసలే రావిపూడి కామెడీ వ్యవహారం.. రవితేజ కామెడీ దాంతో నీరసంగా హీరోయిన్ కనపడే సన్నివేశాలు, పాటల్లో తప్ప సినిమా అంతటా ఫైట్స్‌తో సహా కామెడీని ట్రై చేశారు. కానీ కథను మాత్రం గాలికొదిలేశారు. హీరో రంగ ప్రవేశం చేసేటంత వరకూ రెచ్చిపోయిన విలన్ దేవరాజ్.. అదేంటో ఆ తర్వాత పాసివ్‌గా మారిపోయి దెబ్బ లు తినివచ్చిన తన గ్యాంగ్‌ను చూసుకోవడం, హీరో గొప్ప తనాన్ని ఒప్పుకుంటూ భజన చేస్తుంటాడు. దాంతో హీరో విలన్ మధ్య పోరు అనుకున్నంత ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక కథనం విషయానికొస్తే ఫస్ట్ఫా మొత్తాన్ని తీసుకున్న కొద్దిగా కథతో, హీరో పాత్రతో దాని చుట్టూ వినోదాన్ని నడిపిన దర్శకుడు సెకండాఫ్‌లో సైతం దానే్న కొనసాగించడంతో కాస్త లాగినట్లు కనిపించింది. హీరోకి మంచి సీన్స్, ఫైట్స్‌తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మదర్ సెంటిమెంట్ బాగానే పండింది. అయితే కథ రోటీన్‌దే కావడంతో కాస్త నిరాశే కలిగించింది. కావాలనే కొన్ని సన్నివేశాలను పెట్టి క్లైమాక్స్‌ను పొడిగించారు. పాటలు కూడా సోసోనే. అలాగే ప్రీ క్లైమాక్స్ దగ్గరలో ఓ పెద్ద ఫైట్ జరుగుతుంది. అది అయిపోగానే సినిమా అయిపోయిందనుకుంటాం అంతా. అయితే ఇంకా ఉంది అని మళ్లీ మొదలెడతాడు దర్శకుడు. ఇక్కడే ఎడిటర్, దర్శకుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. అంధుల పాత్రని ఒక రీతిన ‘పాసివ్’గా చూపించాలనే పద్ధతులని కాదని ‘రాజా ది గ్రేట్’ని చాలా యాక్టివ్‌గా చూపించాడు దర్శకుడు. అయితే సగటు మాస్ కథానాయకుడి పాత్రలా కాకుండా సమ్‌థింగ్ గ్రేట్ అనిపించేలా ఈ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. మామూలుగా అన్నీ సవ్యంగా వుండే వారికన్నా అంధులకి జాపశక్తితో సహా చాలా విషయాల్లో ఎక్కువ నేర్పు వుంటుంది. అలాంటివి వాడుకుంటూ విలన్‌ని హీరో దెబ్బ కొడుతుంటే బాగానే వుంటుంది. కానీ, పరుగెత్తే రైళ్లు, ఎగిరే విమానాలు ఏదైనా ఎక్కేయగలరు అని చూపిస్తే ఎలా? యాక్షన్ పార్ట్ దాదాపు అంతా ఎన్నో అసంబద్ధమైన, అసహజమైన సన్నివేశాలతో నిండిపోయింది.
రవితేజ ఎప్పటిలాగే తన మార్కుతో రాణించాడు. అంధుడిగా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. మామూలు డైలాగులని కూడా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో చెప్పి మరింత నవ్వించాడు. ‘ఏమో సార్ నాకు కనపడదు’ అనే సింగిల్ డైలాగ్‌తో బ్యాంక్ రాబరీ సీన్‌లో రవితేజ పుట్టించిన హాస్యం సూపర్. ‘ఐయామ్ బ్లైండ్.. బట్ వెల్ ట్రైన్డ్’ అని హీరో చెప్పుకునేట్టు యాక్షన్ సీన్స్‌ను బాగానే ప్లాన్ చేశారు. రవితేజ ఎంట్రీ, కబడ్డీ సీన్ము ఆకట్టుకుంటాయి. రవితేజ తనయుడు మహాధన్ రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆకట్టుకోగా, రవితేజ తల్లి పాత్రలో రాధిక పండించిన సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. హీరోయిన్ మెహరీన్ ఎక్కువగా గ్లామర్‌కే అంకితం అయిపోయింది. ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ప్రకాష్‌రాజ్, శ్రీనివాసరెడ్డి, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, సంపత్‌రాజ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విలన్‌గా వివాన్ బాట్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పోసాని కృష్ణమురళి, హరితేజ తదితరులపై తీసిన ఎపిసోడ్ నవ్వుల్లో ముంచెత్తుతుంది. ‘గున్నా గున్నా మావిడి’ సాంగ్ ప్లేస్‌మెంట్ భలే కుదిరింది.
సాంకేతిక విషయానికొస్తే.. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు సంగీతం అంతలా మెప్పించలేదు. మోహ న కృష్ణ సినిమాటోగ్రఫీ ఓకె. డార్జిలింగ్ అందాలను బాగానే చూపించాడు. వెంకట్ ఫైట్స్ సోసోగానే వున్నాయి. అయితే కబడ్డీ ఫైట్‌తో పాటు మరో రెండు ఫైట్స్ మాస్‌ని మెప్పిస్తాయి. ఎడిటింగ్ విషయంలో తమ్మిరాజు సెకండాఫ్ చివరను కాస్త ట్రిమ్ చేసుండాల్సింది. నిర్మాత దిల్ రాజు ఎప్పటిలాగే తన నిర్మాణ విలువల్ని చాటుకున్నారు.
మొత్తం మీద మరోసారి రవితేజ తన మాస్ మార్కుతో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. అంధుడిగా రవితేజ నటన బావున్నప్పటికీ, కథ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడివుంటే అన్ని విభాగాల్లో ఈ ‘రాజా’ నిజంగానే గ్రేట్ అనిపించి వుండేది!

-ఎం.డి అబ్దుల్