రివ్యూ

డాన్స్ మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మి * బాగోలేదు

తారాగణం:

ప్రభుదేవా, దిత్యా, ఐశ్వర్యా రాజేష్, సత్యం రాజేష్ తదితరులు.
ఎడిటర్: ఆంథోనీ
సంగీతం: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
నిర్మాణం: ప్రమోద్ ఫిలిమ్స్ ట్రైడెంట్ ఆర్ట్స్
నిర్మాత: ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్
దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్

** *** *** **** *** *********

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్ అందరికీ ఇష్టమే. పైగా ఆయన డాన్స్ నేపథ్యంలో సినిమా చేస్తే అది ఎలా ఉంటుందో కదా. అందుకే ఈసారి చిన్న పిల్లలతో డాన్స్ నేపథ్యంలో సినిమా చేసాడు. దేశవ్యాప్తంగా మంచి డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పిల్లలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లక్ష్మి చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ లక్ష్మి ఎవరు...? అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే?
లక్ష్మి (దిత్యా)కి డాన్స్ అంటే ప్రాణం. కానీ వాళ్ళ అమ్మ నందిని (ఐశ్వర్య రాజేష్) లక్ష్మి డాన్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. దాంతో లక్ష్మి, నందినికి తెలియకుండా వీలుదొరికినప్పుడల్లా ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా జూనియర్స్ అనే కాంటెస్ట్ మొదలుకానుందని తెలుసుకుని, ఆ షోలో ఎలాగైనా పాల్గొనాలి అనుకుంటున్న క్రమంలో ఆమెకు కృష్ణ (ప్రభుదేవా) సాయం చేస్తాడు. అసలు కృష్ణ ఎవరు? ఆయనకు లక్ష్మికి వున్న సంబంధం ఏమిటి? లక్ష్మికోసం కృష్ణ ఏం చేశాడు? ఫ్రైడ్ ఆఫ్ ఇండియా కాంటెస్ట్‌లో లక్ష్మి గెలుస్తుందా? అనేదే మిగతా కథ.
ఈ సినిమా మొత్తం డాన్స్ నేపథ్యంలోనే ఉంటుంది. దిత్య అనే అమ్మాయి సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా నటనతోను మెప్పించింది. ఇక కోచ్ పాత్రలో ప్రభుదేవా పాత్ర ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఈ వయసులో కూడా అదిరిపోయే స్టెప్స్‌తో ప్రేక్షకులను మరోసారి ఫిదా చేశారు. ఇక కొరియోగ్రాఫర్స్ రుయల్, పరేష్ రూపొందించిన నృత్యాలు ప్రేక్షకులను అలరిస్తాయి. లక్ష్మి అమ్మ పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ తన పాత్ర మేర చక్కగా నటించారు. ముఖ్యంగా 5 నిమిషాల పాటు సాంగ్, మ్యూజిక్ లేకుండా కంపోజ్ చేసిన డాన్స్ ఆకట్టుకుంటాయి. ఈ కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. చాలా సింపుల్ కావడంతో ఎక్కడ ఆసక్తికర ట్విస్ట్‌లు కనపడవు. సినిమా ఆద్యంతం డాన్స్‌లు తప్ప వేరే కమర్షియల్ అంశాలు ఎక్కువగా లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. సినిమాలో కోవై సరళ, సత్యం రాజేష్ లాంటి కమెడియన్స్ వున్నా వారిని సరిగ్గా వాడుకోలేదు. ఇక ఫస్ట్ఫా సాగినంత స్పీడ్‌గా సెకండ్ హాఫ్ ఉండదు. సెకండ్ హాఫ్‌లో వచ్చ సన్నివేశాలు కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తాయి. దర్శకుడు విజయ్ సింపుల్ కథను తీసుకొని దానికి కొన్ని ట్విస్టులు జోడించి తెరకెక్కించాడు. కానీ సినిమాలో కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి. కథలోని ట్విస్టులు ముందే ప్రేక్షకుడికి తెలసిపోతాయి. కేవలం డాన్స్‌ని నమ్ముకుని చేసిన సినిమాగా అనిపిస్తుంది తప్ప ఎక్కడా కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. పైగా ఈమధ్య పలు టీవి షోలలో డాన్స్ కార్యక్రమాలు చూస్తున్నట్టే ఉంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన రిసామ్ సి ఎస్ పనితనం బాగుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు. లక్ష్మి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఆద్యంతం ఆకట్టుకునే డాన్స్‌లతో తెరకెక్కింది. లక్ష్మి అనే అమ్మాయి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవా, దిత్యాల నటన, డాన్స్‌లు చిత్రానికి హైలైట్ అవ్వగా ఎలాంటి ఆసక్తికరమైన మలుపులు లేకుండా సాగడం మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు.

-శ్రీనివాస్ ఆర్.రావ్