రివ్యూ

ఇగోల చుట్టూ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలజారెడ్డి అల్లుడు *** బాగుంది
***
తారాగణం:
నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ రమ్యకృష్ణ, నరేష్, మురళీశర్మ
వెనె్నల కిషోర్, రఘుబాబు పృథ్వీరాజ్, శరణ్య ప్రదీప్ తదితరులు.
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రవీందర్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
సంగీతం: గోపీ సుందర్
సమర్పణ: ఎస్.రాధాకృష్ణ
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. పీడీవీ ప్రసాద్
దర్శకత్వం: మారుతి
***
టాలీవుడ్‌లో వరుస విజయాలతో యమజోరును కొనసాగిస్తున్నాడు యువ దర్శకుడు మారుతి. హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న నాగ చైతన్య కమర్షియల్ హీరో కావాలని చేయని ప్రయత్నాలు లేవు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. తెలుగుతెరకు అత్తాఅల్లుళ్ల నేపథ్యంలో సాగేకథలతో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండించి విజయాలను అందుకున్నాయి. అయితే ఈ మధ్య ఈ హిట్‌ఫార్ములా జోరుకు కాస్త బ్రేక్‌పడింది. అలాంటి విజయవంతమైన జోనర్‌ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు మారుతి. మరి ఈ అత్తా, అల్లుడూ కలిసి ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచారు? దర్శకుడు మారుతి తన సక్సెస్‌ట్రాక్‌ను కంటిన్యూ చేశారా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
చైతన్య (నాగచైతన్య) గొప్ప వ్యాపారవేత్త రావు (మురళీశర్మ) కుమారుడు. తండ్రి రావు భయంకరమైన ఇగో వున్న వ్యక్తి. తన ఇగోని ప్రతి విషయంలోనూ అవసరమైన చోటల్లా ప్రదర్శిస్తూనే వుంటా డు. ఆ ఇగోతోనే కూతురు పెళ్లిని కూడా రద్దు చేసుకుంటాడు. మరోపక్క తన కాలనీలోకి కొత్తగా అడుగుపెట్టిన అను (అను ఇమ్మాన్యుయేల్)ని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతన్య. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఇగో ఉందని తెలుసుకుని ఆమెను ప్రేమలోపడేలా చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి రావు అనుతో చైతన్య పెళ్లి ఖాయం చేసేస్తాడు. అంతటితో ఆగకుండా అనుకోని పరిస్థితుల్లో ఓ ఫంక్షన్‌లో వీళ్లిద్దరికి రింగులతో నిశ్చితార్థం కూడా చేసేస్తాడు. అప్పుడే రావుకి అను ఎవరో తెలుస్తుంది. వరంగల్ జిల్లాను తన కనుసైగలతో శాసించే దిగ్రేట్ శైలజారెడ్డి కూతురు అను అంటే మాటలు కాదు. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడదు. అలాంటి శైలజారెడ్డి కూతురు అను, చైతన్యల పెళ్లికి అంగీకరించిందా? ఇటు ప్రేమించిన అను, అటు అత్త ఈ ఇద్దరి మధ్య అల్లుడు ఎలా నెట్టుకొచ్చాడు? వీళ్ల అహాన్ని ఎలా పోగొట్టాడు? అన్నదే మిగతా కథ.
సాధారణంగా మనిషికి ఇగో ఎక్కువైతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అనే విషయాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించిన విధానం బావుంది. ఫస్ట్ఫా హాయి హాయిగా సరదాగా సాగిపోతుంది. హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్‌ట్రాక్ వినోదాన్ని అందించింది. దర్శకుడు మారుతి మనుషుల మధ్య ఇగో లేకుండా ఉంటే ఎంత బావుంటుందో అనే కథను అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో దర్శకుడు తమ మార్కుని ప్రదర్శించాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ కూడా కథ తగ్గట్టుగానే వున్నాయి. అత్త, అల్లుడి నేపథ్యంలో సాగే కథ అనగానే ఆ ఇద్దరి మధ్య ఎత్తులు, పైఎత్తులు వేస్తూ వినోదాన్ని పండించే చిత్రాల్నే ఊహిస్తాం కానీ ఇది అలాంటి తరహా సినిమా కానేకాదు. సాదాసీదా ఓ ప్రేమకథకి అహంతో పాటు, అత్త, అల్లుడు బంధాన్ని జతకట్టాడు దర్శకుడు. ఇగోతో సతమతమయ్యే ముగ్గురు వ్యక్తుల్ని కథానాయకుడు సంతృప్తిపరుచుకుంటూ వెళ్లే విధానం చుట్టూనే ఈ కథని సాగించాడు. ఆ క్యారెక్టర్ల చుట్టూనే డ్రామాని నడిపే ప్రయత్నం చేశాడు. ఈ డ్రామాలో పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం కొత్తగా వుంటుంది. తొలి సగభాగం సినిమా దాదాపుగా ప్రేమ చుట్టూనే నడిచింది. తల్లి, కూతురు మధ్య మితిమీరిన అహం ద్వితీయార్థంలో చోటుచేసుకుంటుంది. అలాగే వెనె్నల కిషోర్, పృథ్వీ ఎపిసోడ్‌ని కామెడీ కోసం దర్శకుడు వాడుకున్న విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ పెద్దగా ఆసక్తిగా లేకపోయినా కథనంతో ఆ ఫీల్‌ను పోగొట్టే ప్రయత్నం చేశాడు.
సినిమాలో రావ్ అనే పాత్ర ఎంత ఇగోయిస్టిక్‌గా ఉంటుందనేదే దానిపై సినిమా ఓపెన్ అవుతుంది. హీరోను పాజిటివ్ కోణంలో ఎలివేట్ చేశారు. అలాగే హీరో తండ్రిని పోలిన మనస్తత్వంతో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమెతో ప్రేమలో పడటం..తన ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి హీరోయిన్ ఇగోనే అడ్డం పెట్టుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రమ్యకృష్ణ శైలజారెడ్డిగా ఎంటరవడంతో ఫస్ట్ఫా పూర్తవుతుంది. గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్స్‌కు కూడా డిఫెక్ట్‌ను యాడ్ చేశాడు. విపరీతమైన ఇగోతో అందర్నీ ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టిసారించిన మారుతి ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. సినిమాలో తెరనిండా నటులున్నా సినిమా అంతా ముఖ్యంగా నాగ చైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా ఎంతో పరిణతి కనబరిచాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావడంతో డ్యాన్సులు, ఫైట్స్‌కు కూడా మంచి అవకాశం దక్కింది. కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సినిమాకు ప్రధానం బలం నాగ చైతన్య క్యారెక్టరే. ఫ్రెష్‌లుక్‌తో కొత్తగా కనిపించాడు. రమ్యకృష్ణకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. శైలజారెడ్డిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినా అందర్నీ డామినేట్ చేసింది. ఎమోషన్ సీన్స్‌లోనూ తన ఎక్స్‌పీరియన్స్‌ను చూపించింది. హీరోయిన్ తండ్రిగా, శైలజారెడ్డి భర్తగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఇక ఇగో వున్న శైలజారెడ్డి కూతురు అను పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ ఒదిగిపోయింది. గ్లామర్‌తో ఆకట్టుకుంది. కథానాయకుడి తండ్రి గా మురళీశర్మ ఇగోయిస్ట్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశా డు. వెనె్నల కిషోర్, పృథ్వీలు కలిసి చేసిన కామెడీ అలరిస్తుంది. శరణ్య ప్రదీప్ తదితరులు పాత్రల పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగానే ఉన్నా యి. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్ సంగీతానికి మంచి మార్కులు పడతాయి. రీరికార్డింగ్ ఫర్వాలేదు. కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. మొత్తం మీద ఇగో చుట్టూ అల్లిన కథతో దర్శకుడు మారుతి మరోసారి తన మార్కునే ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాల విందునే అందించాడు.

-ఎం.డి అబ్దుల్