రివ్యూ

సస్పెన్స్ థ్రిల్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూ టర్న్ ** ఫర్వాలేదు
**
తారాగణం: సుమంత, భూమిక, ఆది పినిశెట్టి
సంగీతం: పూర్ణచంద్ర
సినిమాటోగ్రఫీ: నికెత్ బొమ్మిరెడ్డి
ఎడిటర్: సురేష్ ఆరుముగమ్
నిర్మాతలు: శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం: పవన్‌కుమార్
**
క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యూ టర్న్. పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినాయక చవితి రోజు సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ సినిమాకు ఇది రీమేక్. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో సమంత ఎలా ఆకట్టుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రచన (సమంత) ఓ ఇంగ్లీష్ డైలీలో రిపోర్టర్. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ కథ రాయాలనుకుంటుంది. ఆ ప్రక్రియలో ఆ ఫ్లైఓవర్‌పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూచేసే ప్రాసెస్‌లో వాళ్ళ వెహికిల్స్ నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది. అలా కలెక్ట్ చేసుకున్న వ్యక్తుల్లో సుందరం ఒకడు. అతన్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి అతని ఇంటికి వెళ్లి వస్తోంది. కానీ అప్పటికే సుందరం చనిపోయి ఉంటాడు. దీంతో రచనే సుందరాన్ని హత్య చేసిందని, పోలీసులు ఆమెను అనుమానించి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఎస్‌ఐ నాయక్ (ఆది)కి రచన ఏ తప్పుచెయ్యలేదని అర్థమవుతుంది. కానీ అంతలో రచన కలెక్ట్‌చేసిన ఆ ఫ్లైఓవర్‌పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులు అందరూ చనిపోయి ఉంటారు. అసలు ఫ్లైఓవర్‌పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులే ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా వారిని హత్య చేశారా? రచనకు ఈ కేసుకు సంబంధం ఏమిటి? రచన ప్రేమించిన రాహుల్ రవింద్రన్‌కి ఈ కేసులో ఏమైనా సంబంధం ఉందా? అసలు యూ టర్న్ తీసుకున్న వ్యక్తులు ఎందుకు చనిపోతున్నారన్నది మిగతా కథ.
రచన అనే జర్నలిస్టు పాత్రలో సమంత చక్కటి నటన కనబరిచి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక పక్క ఏం జరుగుతుందో, తాను డిటైల్స్ కలెక్ట్‌చేసిన వ్యక్తులే ఎందుకు వరుసగా చనిపోయారో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆమె అభినయంతో మరింతగా ఉత్సుకతను పెంచారు. వాళ్ళ చావుకి కారణం తెలిసాక, మిగిలిన వారిని కాపాడటానికి ప్రయత్నించే సన్నివేశాల్లో కూడా సమంత తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇక మొదటి భాగంలో సస్పెన్స్‌తో కూడుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే యూ టర్న్‌కి సంబంధించి చేసే ఇనె్వస్టిగేషన్ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఎస్‌ఐ నాయక్ పాత్రలో ఆది పినిశెట్టి ఎప్పటిలాగే బాగా నటించారు. సినిమాకే చాలా కీలకమైన పాత్రలో కనిపించిన భూమిక చావ్లా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్‌లో మెప్పించింది. అలాగే క్రైమ్ రిపోర్టర్‌గా నటించిన రాహుల్ రవీంద్రన్ కూడా ఉన్నంతలో ఓకే అనిపించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
దర్శకుడు పవన్ అంతర్లీనంగా చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కథనంలోకూడా ఆయన మెయింటైన్ చేసిన సస్పెన్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ ఒక మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆయన రాసుకున్న రెండో భాగంలోని కథనం ఫ్లాట్‌గా ఉంది. పవన్ స్క్రిప్ట్‌మీద ఇంకా శ్రద్ధపెట్టి ఉంటే ఈ చిత్రం ఇంకా బాగా వచ్చి ఉండేది.
నికెత్ బొమ్మిరెడ్డి కెమెరా పనితనం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ బాగా బాగున్నాయి. పూర్ణచంద్ర అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ప్లస్ అయింది. ఎడిటర్ సురేష్ కూడా ఫర్వాలేదనిపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
దర్శకుడు పవన్‌కుమార్ మంచి స్టోరీ తీసుకున్నారు. ఆ ఐడియాకి చక్కని మెసేజ్ జోడించడంవరకు బాగుంది. కానీ పవన్ తీసుకున్న పాయింట్‌కి సరైన ట్రీట్‌మెంట్ రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యాడు. సెకెండాఫ్‌లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగతీశారనిపిస్తోంది. ముఖ్యంగా సెకెండాఫ్‌లో స్లోగా సాగే కథనం, సినిమాపై ఆసక్తిని నీరుగారుస్తోంది. కొన్ని సన్నివేశాలను బాగానే చిత్రీకరించినప్పటికీ, సినిమాలో చాలాభాగం ఆసక్తికరంగా సాగకపోవడం, భూమిక చావ్లా క్యారెక్టర్ తాలూకు సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉండటం కొంత ఓవర్‌గా అనిపిస్తుంది. సమంత అండ్ రాహుల్ లవ్‌ట్రాక్ చాలా బోరింగ్‌గా సాగుతుంది.
సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో అక్కడక్కడ వచ్చే ఊహించని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. కానీ కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, సెకెండాఫ్‌లో కథనం చాలాచోట్ల స్లోగా సాగడం, ఎక్కడా నవ్వించే సన్నివేశాలు లేకపోవడం వంటి నెగిటివ్ అంశాల కారణంగా సినిమా స్థాయి తగ్గుతుంది. మొత్తంమీద భిన్నమైన, కొత్తతరహా చిత్రాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

- శ్రీ