రివ్యూ

ఆడియన్స్‌ని వదిలేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను దోచుకుందువటే ** ఫర్వాలేదు
**
తారాగణం: సుధీర్‌బాబు, నభ నటేష్, నాజర్ తదితరులు
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సంగీతం: బి.ఎ.లోక్‌నాథ్
నిర్మాత: సుధీర్‌బాబు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు
**
సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్రీకి పరిచయమైన సుధీర్‌బాబు.. ఆ ఇమేజ్‌ని వాడుకోకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేశాడు, చేస్తున్నాడు. ఒకరి ఇమేజ్ నీడలో కాకుండా తన ఐడెంటిటీ తనకుండాలని తాపత్రయపడే సుధీర్, అదే తన గోల్ అని అనేక సందర్భాల్లో చెప్పక చెప్పాడు కూడా. జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతగానూ మారాడు. ఆర్.ఎస్.నాయుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌పై తెరకెక్కించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. కన్నడ కథానాయిక నభ నటేష్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన చిత్రమిది. ఎన్టీఆర్ దాగుడు మూతలు చిత్రం కోసం డాక్టర్ సినారె రాసిన పాటలోని పొందికైన తొలి పదాలను టైటిల్ చేసుకున్న కథలో ఎవరి మనసు ఎవరు దోచుకున్నారో చూద్దాం.
వెరీ ప్రాక్టికల్, ఫోకస్డ్ పర్సన్ హీరో కార్తీక్ (సుధీర్‌బాబు). అమెరికా వెళ్లాలన్న గోల్ నెరవేర్చుకోడానికి తన కష్టం తను పడుతుంటాడు. అమెరికాలో సెటిలవ్వాలన్న హీరో ప్రయత్నాలకు ఆదిలోనే తల్లిదండ్రులు అడ్డుతగులుతారు. కొడుకుకి పెళ్లి చేయాలన్న తలంపుకొస్తారు. తన గోల్ కోసం పెళ్లినుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాళ్ ఫ్రెండ్‌ని సీన్‌లోకి తీసుకొస్తాడు. షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ మేఘన (నభ నటేష్)ను తన గర్ల్‌ఫ్రెండ్‌గా పేరెంట్స్‌కి పరిచయం చేస్తాడు. అలా కార్తీక్- మేఘనలమధ్య పరిచయం స్నేహంగా, తరువాత ప్రేమగా మారుతుంది. అసలు గోల్ నెరవేర్చుకోడానికి మధ్యలో వచ్చిన మేఘనను దూరం పెడతాడు. కార్తీక్, మేఘనను దూరం పెట్టడానికి కారణం అమెరికానేనా? కార్తీక్ తన లక్ష్యం నెరవేర్చుకున్నాడా? చివరికి కార్తీక్, మేఘన ఎలా కలిశారు?లాంటి విషయాలే మిగతా కథ.
తోటి హీరోలతో ఎప్పుడూ రేసులో ఉండని సుధీర్‌బాబు, ఇప్పటి వరకూ చేసిన సినిమాలతో తనకంటూ ఓ స్టయల్ క్రియేట్ చేసుకున్నాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికే ఇష్టపడే సుధీర్, కార్తీక్ పాత్రతో జోవియల్‌నెస్‌తోపాటు కామెడీని పలికించే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ అప్పియరెన్స్‌లో ఫ్రెష్‌నెస్ చూపించిన సుధీర్, పాత్రకు తగిన టైమింగ్‌తో తన వరకు న్యాయం చేశాడు. కన్నడ నుంచి వచ్చిన నభ నటేష్, తెలుగుదనానికి తగిన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ప్రాముఖ్యమున్న పాత్ర దొరకడంతో, పెర్ఫార్మెన్స్ చూపించగలిగే అవకాశం దక్కింది. అందం, ఆహార్యంతో ఆకట్టుకున్న నభకు మరిన్ని తెలుగు ప్రాజెక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయ. తండ్రిగా నాజర్ స్టయల్ రోటీనే. పాత్రల పరిధిమేరకు మిగిలిన వాళ్లూ ఆశించతగ్గ అభినయాన్ని చూపించారు.
దర్శకుడిగా ఆర్.ఎస్.నాయుడికి ఇది తొలి సినిమా. మొనాటినీ లాగ్ పాయంట్‌ను అద్భుతంగా నెరేట్ చేయగల అనుభవం కనిపించలేదు అందుకే. కథను రెండు భాగాలు చేసుకున్న దర్శకుడు, ఫస్టాఫ్‌ను సరదాగా నడిపేశాడు. ఎమోషన్ కోసం సెకెండాఫ్‌ను కేటాయంచుకున్నా, ఫ్లేవర్‌ను డిస్ట్రర్బ్ చేయకుండా సరదాగానే నడిపించే ప్రయత్నం చేయడం దర్శకుడిగా కసరత్తు కనిపించింది. హీరోను సెటిల్డ్ స్టేజ్‌లోనే ఉంచుతూ, ఆడియన్స్‌ను మెప్పించేలా కథను డిస్కస్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్‌కు రీచ్ కాలేకపోయాడు. తెలుగు ప్రేక్షకుడికి బాగా అలవాటైన మెలో డ్రామాకు దర్శకుడూ ప్రభావితం కావడంతో, కథలో సహజత్వం లోపించింది. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్‌ను అత్యంత సహజ ధోరణిలో చూపించిన సినిమాలు చాలా వచ్చేశాయ. ఇక్కడ దర్శకుడు మాత్రం మూస దాటలేకపోవడంతో రక్తికట్టలేదు. కంటెంట్‌ను డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు కచ్చితమైన నిర్ణయానికి రాలేక, ఊగిసలాటకు గురయ్యాడన్న భావన కలుగుతుంది.
సినిమాటోగ్రఫి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, అజనీష్ లోక్‌నాధ్ సంగీతం సినిమాను డిస్ట్రర్బ్ చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం, సుధీర్‌బాబు ప్రొడక్షన్ వాల్యూస్ ప్రాజెక్టుకు ప్లస్ పాయంట్లు.
నన్ను దోచుకుందువటే.. సింపుల్ అండ్ గుడ్ లవ్‌స్టోరీ. క్రియేటివిటీలో గొప్పగా ఉందని చెప్పకపోయనా, దర్శకుడు కర్తవ్యం మేరకు కథను నడిపించడంలో అడుగు ముందుకేసినట్టే. హీరో-్ఫదర్, హీరోయిన్-మదర్ మధ్య సాగే సెంటిమెంట్ సన్నివేశాలు మరింత కన్విన్సింగ్‌గా ఉంటే బావుండేది. షార్ట్ ఫిలిమ్స్ షాడోను వదిలి, ఫీచర్ ఫిల్మ్ అనుభవాన్ని, సన్నివేశాన్ని మరింత క్లుప్తంగా చెప్పగలిగే సత్తకు పదును పెట్టుకోక తప్పదు. టైటిల్‌ని మర్చిపోయ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సుధీర్ బాబు సినిమా అనుకుంటే ఓకే. చివరిమాట -రెండు గంటల సినిమాకంటే, నాలుగు నిమిషాల సినారె పాటే హాయ అనిపిస్తుంది.

-త్రివేది