రివ్యూ

వెతికినా.. దొరకలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాయ పేరేమిటో * బాగోలేదు
*
తారాగణం: రాహుల్ విజయ్, కావ్య థాపర్, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ తదితరులు
ఎడిటర్:నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కె నాయుడు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: దివ్య విజయ్
దర్శకత్వం: రాము కొప్పుల
*
రాజకీయ నాయకుల వారసులు రాజకీయ నాయకులు అవుతారు. హీరోల వారసులు హీరోలే అవుతారు. మరి టెక్నీషియన్ వారసులు టెక్నీషియన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా హీరోలుగా మారొచ్చు. ఈ నిజాన్ని ఇప్పటికే చాలామంది హీరోలుగా మారి చూపించారు కూడా. తాజాగా ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా ఫైట్ మాస్టర్‌గా విశేషమైన అనుభవం, పరిచయాలున్న విజయ్ తన తనయుడు రాహుల్ విజయ్‌ని కథానాయకుడిగా పరిశ్రమకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రంతో రాము కొప్పుల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ప్రేమలో ఎలాంటి మాయ ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన చందు (రాహుల్ విజయ్) ఫ్రెండ్స్‌తో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. అయితే అందరికీ సహాయపడే గుణంవున్న మంచి కుర్రాడు. ఆ గుణమే సీతల్ (కావ్య థాపర్)ను అట్రాక్ట్ చేస్తుంది. ప్రేమలో పడి అతని కోసం కాలనీలో అనే్వషణ సాగిస్తుంది. ఫైనల్‌గా అతగాడిని కనుక్కుని ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈవిషయం తెలిసిన సీతల్ తండ్రి (మురళీశర్మ)- ఏ తండ్రి అయినా తన కూతురికి ఎలాంటి భర్త రావాలని కోరుకుంటాడో.. ఆ విషయం గురించి చందుకి అర్థమయ్యేలా తెలివిగా ఎమోషనల్‌గా చెబుతాడు. అలా నువ్వు మారితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. దాంతో చందు, సీతల్ కోసం తన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటాడు. తనని తాను మార్చుకుంటున్న క్రమంలో సీతల్‌కి చందు నచ్చడు. ఇద్దరిమధ్యా దూరం పెరుగుతుంది. సీతల్‌కి వేరే పెళ్లి ఫిక్సవుతుంది. తాను కావాలని అనే్వషించి మరీ ప్రేమించిన చందు ఎందుకు సీతల్‌కి నచ్చలేదు? సీతల్ తండ్రి చందుకి ఏం చెప్పాడు? చివరికి సీతల్ చందుని అర్థం చేసుకుంటుందా? తిరిగి ప్రేమిస్తుందా? అన్నది మిగతా కథ.
హీరో రాహుల్ విజయ్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. ఓకే అనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్‌తో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే హీరో తల్లితో ఉంటే సన్నివేశాలలో చక్కగా నటించాడు. హీరోయిన్ కావ్య థాపర్ అందం, నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాలతోపాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించే పెర్‌ఫార్మెన్స్ చూపించింది. హీరోయిన్ తండ్రి మురళీశర్మది గుర్తుపెట్టుకునే పాత్ర. అలాగే కొడుకుని అమితంగా ప్రేమించే తండ్రిగా రాజేంద్రప్రసాద్ తన నటనతో నవ్విస్తూనే, ఇటు ఎమోషన్ సీన్స్‌ని పండించాడు. సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ కామెడీ టైమింగ్స్, మ్యానరిజమ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. అక్కడక్కడా సరదాగా సాగినప్పటికీ కథ మొత్తం స్లో డ్రైవ్, ఈజీ నేరేషన్‌తో ఆసక్తి కలిగించలేకపోయంది. ఫస్ట్‌హాఫ్‌లో ఒక్క ఇంటర్వెల్ సీన్ వినా మిగతా సన్నివేశాలన్నీ ఎక్కడెక్కడో ఏరితెచ్చుకుని గుదిగుచ్చినట్టే అనిపిస్తాయ. సెకెండాఫ్‌లో ఎమోషనల్ పార్ట్‌ని బేస్‌చేసుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ, తొలిసారి దర్శకత్వంతో అతని అనుభవం సరిపోయనట్టు అనిపించదు. శృతిమించిన మెలో డ్రామా సినిమాలోని ప్లస్‌లను మింగేసింది. బలహీనమైన పాత్రలతో రెగ్యులర్‌గా లవ్ స్టోరీ భావోద్వేగ సన్నివేశాలు పండించే ప్రయత్నంలో అనవసర సన్నివేశాలు జోడించడం విసుగు పుట్టిస్తుంది.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మాయ పేరేమిటో? టైటిల్ ఆకట్టుకున్నా, అందుకు తగిన ప్రేమకథ మిస్సయ్యంది. ప్రేమ కథపై ఆసక్తిని పెంచే సరైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం, స్లో నేరేషన్, రొమాంటిక్ మూడ్‌ని క్రియేట్ చేసే సన్నివేశాలను స్క్రీన్‌మీద సరైన ప్రజెంటేషన్ లేకపోవడం.. వగైరా వగైరాల కారణంగా ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించలేకపోయంది. సంగీత దర్శకుడు మణిశర్మ గుర్తుపెట్టుకోదగ్గ ట్యూన్ ఒక్కటీ ఇవ్వలేకపోయాడు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ సాంగ్ ఓకే అనుకోవడం తప్ప, సినిమాకు ఏమాత్రం ప్లస్ కాదు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మార్క్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కోన్ని సన్నివేశాల్లో బ్యూటీని విజువల్ ప్రజెంటేషన్ చేయగలిగాడు. సబ్జెక్ట్‌ను ట్రిమ్ చేస్తే లెంగ్త్ సరిపోదనో ఏమో.. నవీన్ నూలి ఎడిటింగ్‌లో కొన్ని అనవసర బిట్లు వదిలేసినట్టే అనిపిస్తుంది. దివ్య విజయ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అరంగేట్ర ప్రాజెక్టులో అడుగులు తడబడినా, రాహుల్ విజయ్ హీరోయక్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రేమకథ, ప్రధాన పాత్రల మధ్య సాగే సన్నివేశాల్లో గాఢత లేకపోవడం, వీటికితోడు నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సన్నివేశాలు కన్విన్స్ చేయలేకపోవడం లాంటి కారణాలు సినిమాను మొదటి మెట్టుపైనే ఉంచేశాయ. ప్రేమకథలో టైటిల్‌కు తగిన ఫీల్‌ను ప్రజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ మాయ పేరేమిటో అన్న ప్రశ్న బావుందిగానీ, జవాబే దొరకలేదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్