రివ్యూ

ఆట తక్కువ.. ముద్దులెక్కువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
ఇమ్రాన్ హష్మి, ప్రచీ దేశాయ్, నర్గీస్ ఫక్రి,, లారాదత్తా
సంగీతం:
అమాల్ మాలిక్ -ప్రీతమ్
కథ: రజత్ అరోరా
నిర్మాతలు:
శోభాకపూర్ -ఏక్తాకపూర్
దర్శకత్వం: టోనీ డి’సౌజా
***
ఏ క్రికెటర్ గురించీ ‘సినీ కథ’లు రాకపోవడానికి కారణం ఏమిటీ? అన్న ప్రశ్నకీ.. ‘అజర్’ గురించిన ‘బయోపిక్’కీ ఒక్కటే సూత్రప్రాయం కనిపిస్తుంది. అజర్ భాయ్ తాతగారికి ఓ కల ఉండేదిట. 100 టెస్ట్‌మ్యాచ్‌లు ‘అజర్’ చేస్తాడని. అయితే- ఆ కల 99 టెస్ట్‌ల వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యం చాలు ‘ఆత్మకథ’కి కావల్సినంత సబ్జెక్ట్. కానీ- ఇదో ఆత్మకథ అనటానికి లేదు. ‘కాల్పనిక చిత్ర’మంటూ దర్శకుడు చెప్పేశాడు. ఓ వ్యక్తి జీవితంలోని ‘విభిన్న సంఘటనల’ సమాహారం అని ఓ మాటలో తేల్చేశాడు. కాబట్టి -ఏతావతా ఈ కథని ఏ కోణంలో చూడాలన్నది ప్రేక్షకుడికి నిర్ణయానికి వదిలేశారు. ఈ కథావస్తువు క్రికెట్ అభిమానులకూ ‘అజర్’ని ప్రేమించే వారికి క్లుప్తంగా తెలిసిందే.
ఓ క్రికెటర్.. అతని క్రీడా జీవితం. ఆ జీవితంలో ఎదురైన సమస్యలు.. ఎదుర్కొన్న సవాళ్లు.. క్రికెట్ పరంగా ఎంచుకొన్న లక్ష్యాలు.. ఆల్‌రౌండర్‌గా క్రికెట్ అభిమానులను అలరించిన తీరు -ఇద్దరు భార్యల మధ్య నెలకొన్న వివాహ బంధం -అన్నిటికీ మించి బుకీస్‌తో.. గోల్డ్ లాడెన్ గ్యాంగ్‌స్టర్స్‌తో అతడి ‘రహస్య’ ఒప్పందాలతో ఈ కథ కొంత ‘ఊహాజనితంగా’ నడుస్తుంది.
‘అజర్’ (?) కథని బయోపిక్‌గా మలచటం వెనుక రజత్ అరోరా శ్రమ కనిపిస్తున్నప్పటికీ.. ఫిక్షనల్ ఫీల్‌గా మారింది. ఐతే -ఎక్కడా నిజ జీవితంలోని వ్యక్తుల జోలికి వెళ్లనట్టు.. మొదటి పేరుతో పాత్రల్ని పరిచయం చేశారు. ఆయా సంఘటనలకు సంబంధించిన తేదీలు.. ఆయా ప్రాంతాలూ.. సమయాల్ని స్పష్టంగా పేర్కొనటంతో.. వొకింత సందిగ్ధత ఏర్పడినప్పటికీ.. ఈ చిత్రాన్ని బయోపిక్‌గా కాకండా.. ఓ క్రీడాకారుడి జీవితంగా చూస్తే మాత్రం దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే -అజర్ లైఫ్‌ని బేరీజు వేసుకోకండా ఉంటే. అజర్ జీవితంలోని ‘వివాదాస్పద’ మ్యాచ్ ఫిక్సింగ్‌లనూ.. ఇండియన్ క్రికెట్ కెప్టెన్‌గా కొనసాగిన జీవితాన్నీ.. క్రికెట్ నుంచీ వైదొలగిన సంఘటనలనూ చక్కటి స్క్రీన్‌ప్లేతో చూపగలిగాడు దర్శకుడు. నటనాపరంగా -ఇమ్రాన్ హష్మి.. ‘అజర్’ని జ్ఞాపకం పెట్టుకొనేట్టు చేశాడు. ప్రచీ దేశాయ్, నర్గీస్ ఫక్రి.. తమ పరిధిలో నటించారు. ఆయా పాత్రధారులంతా ఫర్వాలేదు. సంగీతం.. మాటలు.. మిగతా శాఖలన్నీ ఓకే. ఇమ్రాన్ హష్మి అంటేనే ‘ముద్దుల’ ప్రపంచం కాబట్టి.. వాటితో అక్కడక్కడ అలరించాడు.

-ప్రనీల్