రివ్యూ

అతీంద్రియ కల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరభ * బాగోలేదు
*
తారాగణం: ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, పృధ్వీ, ఎల్‌బి శ్రీరాం, నాజర్, షాయాజీషిండే, అనంత్, పునీత్ ఇస్సార్ తదితరులు
సంగీతం: కోటి
నిర్మాత: అశ్వనీకుమార్, సహదేవ్
దర్శకత్వం: ఎల్ నరసింహారావు
*
కథా కేంద్రం -అతీంద్రియ శక్తుల సమాహారం. ఇంకనేం గ్రాఫిక్స్ వినియోగానికి కావాల్సినంత అవకాశం. మరి ఈ రెండూవుంటే చిత్ర దర్శకుడికి (ఎల్ నరసింహారావు) సన్నివేశాల కల్పనలో అపరిమిత స్వేచ్ఛ. అయినా ‘శరభ’ విజయ భరోసా పెంచలేదు. దానికి కారణం కల్పించిన సన్నివేశాలు క్రమపద్ధతిలో లేకపోవడం. వాటిమధ్య సమన్వయ లోపం. వెరశి నిరుత్సాహ నీరసం. ఇదీ స్థూలంగా ‘శరభ’.
కథ:
మహాశక్తులు కావాలని క్షుద్రపూజలు చేసే మాంత్రికుడు అప్పటివరకూ విజయవంతంగా 17మంది మానవుల్ని బలిస్తాడు. చివరిది, పద్ధెనిమిదొవది పూర్తిచేస్తే అతననుకొన్న (దుష్ట) లక్ష్యం పూర్తవుతుంది. అది కేంద్రమంత్రి (షాయాజీ షిండే) కుమార్తె దివ్య (మిస్తీ చక్రవర్తి) బలితో పూర్తి చేద్దామని ప్రయత్నిస్తాడు. ఆ ప్రక్రియకు అడ్డుతగులుతాడు శరభ (ఆకాష్ కుమార్). ఎందుకు అడ్డుతగిలాడు? మాంత్రికుడి అడ్డు తొలగించడంలో దైవశక్తి ఎలా సహాయపడింది? అన్న దానితో శరభ ముగుస్తుంది. దుష్టశక్తిపై దైవశక్తి గెలవడమన్నది -కమర్షియల్ కథా చిత్రాల్లో ముప్పాతిక భాగం కనిపించేదే. దానికి నవ్యత్వం చేకూర్చడానికి గ్రాఫిక్స్ సాయం తీసుకున్నారు. వెరైటీ కొనసాగింపు కోసం అది తప్పదనుకున్నా, మొదటి సగమంతా కథానాయకుని గాలి తిరుగుళ్లు, అతని మామ (నాజర్)తో కలిసి గంతులు, వగైరాలతో నడవడంతో చిరాకు పుట్టింది. ఇక చనిపోయిన తండ్రి చంద్రాక్షునిని ఖననం చేయకుండా ఆశయ సిద్ధికోసం కొడుకు ఉంచడం, అది మళ్లీ పునర్జీవితమవడం మొదలైన సన్నివేశాలు సంపూర్తిగా ప్రేక్షకుణ్ణి కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. దీంతో బావుందనుకున్న సినిమాలోని కొన్ని భాగాలూ గుర్తింపునకు నోచుకోలేదు. ఉదాహరణకు కధానాయకుని తల్లి పార్వతమ్మ పాత్రలో జయప్రద చాలా గ్యాప్ తర్వాత తెరమీద కనిపించారు. పరిణితి చెందిన ప్రదర్శనను కనపర్చారు కానీ, పేలవ సన్నివేశాలతో ఆ కష్టం రాణించలేదు. పైగా చిత్రంలో వచ్చిన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో మేకప్ ఎక్కువైంది. శరభగా ఆకాష్‌కుమార్‌కిది తొలి ప్రయత్నమైనా శక్తికొలదీ నటించాడు. అదే పైన చెప్పుకున్న పసలేని సన్నివేశాల దృష్ట్యా సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. దివ్యగా మిస్తీ చక్రవర్తి పాత్ర పరిధి తక్కువ. అయినా చివర్లో దెయ్యంగా, మామూలుగా మారే సన్నివేశాల్లో చక్కటి వేరియేషన్ చూపించారు. అయితే నాయకా నాయికలమధ్య సినీ పరిభాషలో తరచూ అనే కెమిస్ట్రీ అసలు కలవలేదు. దానివల్ల యుగళగీతాల్లో వీరి తీరు తీర్థానికి తీర్థం.. మాదిరి అయిపోయింది. ‘నేను ఇపుడు చేస్తున్నది కామెడీ అయినా బేసిక్‌గా విలన్ని..’ అనే డైలాగు చెప్పిన మామ పాత్రధారి నాజర్ తనకిచ్చిన హాస్య పాత్రలో ఒదిగిపోయాడు. జయప్రదలాగే చాలా విరామం తర్వాత ఎల్‌బి శ్రీరాం నారాయణ పాత్రలో కనిపించారు. పార్వతమ్మ భర్త కార్తవరాయుడిగా నెపోలియన్ నటించాడు. సంభాషణలు సాయిమాధవ్ బుర్రా అనగానే ఒక్కసారిగా కొన్ని కొన్ని చురుకైన చురుక్కుమనే మాటల్ని ఆశిస్తారు ఆడియన్స్. ఆ అంచనాలకు తగ్గకుండా ఆయన ఇందులో తన కలాన్ని పదునుపెట్టి సంధించారు. ‘మంచి చేసేటపుడు వచ్చే చావు కూడా బ్రతుకుతో సమానం’, ‘ఆశ చచ్చిపోయినా ఆశయం చావకూడదు’, ‘మనం వెళ్లే దారి మంచిదైతే దేవుడు సాయం చేస్తాడు. గమ్యం చేరేవరకూ మనతోనే ఉంటాడు’, ‘కష్టాల్లో ఉన్నపుడు దేవుడు కళ్లముందు రావాలి తప్ప కలలోకి కాదు..’ వంటి స్ఫూర్తివంతమైన సంభాషణలతోపాటు, ‘చీర కట్టుకోవడం రాని లేడీ ఆర్టిస్టుతోటి కూడా చీరల షాపు ఓపెనింగ్ చేయిస్తారు, సెలబ్రిటీస్ కనుక’, ‘నువ్వెవరురా? భూతానికీ, ప్రేతానికీ ఇల్లీగల్‌గా పుట్టినవాడిలా ఉన్నావ్’ వంటి సరదా డైలాగులూ అలరించాయి. అయితే ఓ స్ర్తి పాత్రనుద్దేశించి, ‘నేను సంతకం చేసినామె కూడా..’ వంటి డైలాగ్స్ బుర్రా బాణీలో లేవు. కానీ శ్మశానంలో కోటీశ్వరుడి శవం కాలుతున్నపుడు వీక్షించే వ్యక్తితో ఇంతకాలం బీపీ బాధతో బువ్వ తినలేదు, ‘కొవ్వు’ అని చెప్పి ఆయిల్ వదిలేశావు.. ఇపుడు చూడు.. అంటూ చెప్పించిన మాటలు అశాశ్వతమైన జీవిత గమనాన్ని బాగా చూపించాయి. ఇంకోచోట ‘కూచిపూడో, గోచిపూడో’ అనిపించడం అస్సలు బావులేదు. చాలాకాలానికి వినిపించిన కోటి రాగాల్లో తనబాణీ ‘స్వామి వెలిసెనురా..’ పాటలో బాగా ప్రస్ఫుటమైంది. ఈ పాటలో చటుక్కున ప్రజా రచయిత, గాయకుడు గోరెటి వెంకన్న బాగా మెరిశారు. టైటిల్ సాంగ్ శరభ, శరభ (నరసింహుని మరో నామం శరభుడు)లో సత్య నరసింహ, సత్య నరసింహ.. అంటూ చేసిన వర్ణనా అలరించింది. అలాగే ఆఖర్లో నరసింహ విన్యాసంలోనూ రమణ (కెమెరామెన్) రమణీయంగా పనిచేసింది. భారీ వ్యయంతో గ్రాఫిక్స్‌మీద పెట్టిన కాన్‌సన్‌ట్రేషన్ కథాక్రమంపైన దర్శకుడు నిలిపివుంటే ‘శరభ’ అన్నివిధాలుగా అందర్నీ అలరించి ఉండేది.

అన్వేషి