రివ్యూ

ఏముందీ... వీర నస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్స్ట్ ఏంటి * బాగోలేదు
*
నటీనటులు:తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, లారిసా, శరత్‌కుమార్, పూనమ్ కౌర్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: మహేష్ చంద్రభట్
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్‌పూరి
రచన, దర్శకత్వం: కునాల్ కోహ్లి
*
మోడరన్ ప్రేమకథలు.. సౌత్ జనాలకంటే బాలీవుడ్ జనాలకే ఎక్కువ ఆసక్తి. ఇప్పటికే ఆ తరహాలో ఎన్నో సినిమాలొచ్చాయి. తాజాగా ఇలాంటి కొత్త ప్రయోగం తెలుగులో నెక్స్ట్ ఏంటి అంటూ జరిగింది. హిందీలో ‘హమ్ తుమ్, ఫనా’ లాంటి సినిమాలు తీసిన కునాల్ కోహ్లి తెలుగులో తమన్నా, సందీప్‌కిషన్, నవదీప్‌లతో ఓ ప్రేమకథ చేయడం నిజంగా ఆశ్చర్యమే. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదో చూద్దాం!
తండ్రి పెంపకంలో స్వేచ్ఛగా పెరిగిన అమ్మాయి టామీ (తమన్నా). టీనేజీలోనే సంజు (సందీప్‌కిషన్) ప్రేమలో పడుతుంది. అయతే అమ్మాయిలతో ప్రేమకంటే సెక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సంజు అసలు ఆంతర్యం తెలుసుకుని విడిపోతుంది. తర్వాత కొనే్నళ్లకు క్రిష్ (నవదీప్) అనే పెద్ద వయస్కుడిని ఇష్టపడుతుంది. కానీ అప్పటికే పెళ్లయి డైవర్స్ తీసుకున్న అతడితో జీవితం పంచుకోలేక దూరమవుతుంది. మరోవైపు సంజు ఇంకో అమ్మాయితో పెళ్లిదాకా వెళ్లి వెనక్కి తగ్గుతాడు. ఈ ప్రయాణంలో ఇటు టామీకి.. అటుసంజుకు నిజమైన ప్రేమ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చాక మళ్లీ ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెడతారు. ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది.. తిరిగి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది అసలు సినిమా.
నిజానికి తమన్నానే సినిమాకు పెద్ద ఆకర్షణ. అందం, అభినయం రెంటితోనూ ఆమె ఆకట్టుకుంటుంది. కాస్త గ్లామర్ విషయంలో ఒక మెట్టుపైనే వుంది. 30ఏళ్ల వయసులో ఆమె ఇంత రిఫ్రెషింగ్‌గా కనిపించడం ఆశ్చర్యమే. సందీప్‌కిషన్ తమన్నా పక్కన అంతగా సెట్టవ్వకపోయినా, నటనతో బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నవదీప్ మరోసారి పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. లారిసాకు నటించే స్కోప్ లేకపోయింది. శరత్‌కుమార్, పూనమ్ కౌర్‌లు జస్ట్ ఓకె అనిపించారు.
నెక్స్ట్ ఏంటి సాంకేతికంగా మాత్రం ఉన్నంతగా కనిపిస్తుంది. లియోన్ జేమ్స్ పాటలు.. నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి. మహేష్ చంద్ర భట్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విదేశాల్లోని అందమైన లొకేషన్లను చక్కగా ఉపయోగించుకున్నారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమా అంతా కూడా రిచ్‌గా కనిపిస్తుంది. ఐతే ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుపుణులు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా.. దర్శకుడు కునాల్ కోహ్లి పేలవమైన పనితనం చూపించాడు. తెలుగులోనే కాదు.. హిందీలో అయినా ఇలాంటి సినిమాల్ని భరించడం కష్టం. ‘హమ్ తుమ్, ఫనా’ లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు కోహ్లి ప్రేమకథల్ని బాగా డీల్ చేస్తాడని పేరుంది. మధ్యలో కొనే్నళ్లపాటు కనిపించకుండాపోయిన కునాల్ ఆశ్చర్యకరంగా తెలుగులో సినిమా తీశాడు. రెండు గంటలపాటు నాన్‌స్టాప్‌గా సాగే ఈ కాన్వర్జేషన్లు బోర్ కొట్టించడం కాదు.. విపరీతమైన నస పెడతాయి. రెండుగంటలపాటు ఆపకుండా సంభాషణల మీద సంభాషణలు పెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు కునాల్. ఒకదశ దాటాక మనం సినిమాకు వచ్చామా అన్న అనుమానం కలుగుతుంది. లవ్‌స్టోరీలో ఉండాల్సిన ఫీల్ లేదు. పాత్రలతో ఎమోషనల్ కనెక్టివిటీలేదు. లొకేషన్లు.. నటీనటుల హావభావాలు.. నేపథ్య సంగీతం.. కెమెరా పనితనం.. ఇవన్నీ మంచి రొమాంటిక్ లవ్‌స్టోరీ చూస్తున్న భావన కలిగించే ప్రయత్నం చేస్తాయి కానీ.. కథా కథనాల్లో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో.. డైలాగుల్లో ఫీల్ అన్నదే లేకపోవడంతో అంతా వృధా అయిపోయింది.
అమ్మాయిలు -అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంకటారు. తర్వాత ఆ అమ్మాయి-ఆమె తండ్రి కలుస్తారు. వాళ్లు కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మరో అబ్బాయిని కలుస్తుంది. ఇదే తంతును తిప్పి తిప్పి తెరమీద చూపించి మరీ చిరాకు పుట్టేలా చేస్తారు. అసలు ఈ తరహా క్లారిటీ లేని ప్రేమకథలు సౌత్ ప్రేక్షకులకు ఏ కోశాన నచ్చవు.

-త్రివేది