రివ్యూ

ఆ రెండూ కలగలిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఫ్- 2 ** ఫర్వాలేదు
**
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌కౌర్, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి, నాజర్.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
**
ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. ఆయన బ్యానర్ నుండి వచ్చే సినిమాలు అన్ని ఎమోషన్స్‌తో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసేలా ఉంటాయి. అలాంటి సినిమాలను సంక్రాంతి సీజన్‌లో విడుదల కొట్టడం ఆయనకు కొత్తేమీ కాదు. వెంకటేష్ వరుణ్‌తేజ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ఎఫ్-2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది. మరి ఈ ఫన్ ఎవరికీ ఫ్రస్ట్రేషన్ ఎవరికీ అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ:
వెంకీ (వెంకటేష్) ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. ఎవరు లేని అనాధ. ఎం.ఎల్.ఏకు తెలిసిన వారిద్వారా వచ్చిన సంబంధం నచ్చి హారిక (తమన్నా)ను పెళ్లాడతాడు. పెళ్లయిన కొత్తలో ఇద్దరు బాగానే ఉంటారు.. కానీ రోజురోజుకు హారిక పెట్టే టార్చర్ తట్టుకోలేక పోతుంటాడు వెంకీ. ఆ సమయంలోనే హారిక చెల్లెలు హనీ (మెహ్రీన్)తో గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బోరబండ కుర్రాడు వరుణ్ (వరుణ్‌తేజ్)తో పెళ్లి సెట్ అవుతుంది. పెళ్లి విషయంలో హాని ఫ్యామిలి, హాని వరుణ్‌ని టార్చర్ పెడుతుంటారు... పెళ్లికాక ముందే హానీ నుంచి వేధింపులు మొదలవడంతో తన తోడల్లుడు వెంకీతో తన బాధలు చెప్పుకుంటాడు.. ఇద్దరు కలిసి వీరి బాధలను భరించడం వద్దని.. మరో గంటలో పెళ్లి ఉందనగా యూరప్ వెళ్లిపోతారు. ఇలా అర్ధాంతరంగా తమను విడిచి వెళ్లిపోయిన వెంకీ.. వరుణ్‌లను వెదికే క్రమంలో హాని, హారిక యూరప్ వస్తారు.. అక్కడ వాళ్ళను కలిసినప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటి? హారిక, హాని వీరిద్దరిని కాదని వేరే వాళ్లను పెళ్లిచేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు..? మరి ఈ పెళ్లి ఆపి వెంకీ, వరుణ్ వాళ్ళను తెచ్చుకున్నారా? లేదా అన్నది మిగతా కథ.
ఈ సంక్రాంతికి ఫుల్‌గా నవ్వించడానికి వచ్చిన సంక్రాంతి అల్లుళ్లు సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వెంకటేష్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి కామెడీ కోరుకుంటున్నారో ఈ సినిమాలో ఆ టైపు కామెడీ బాగానే వర్కౌట్ అయింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచారు. మళ్లీ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుచేసాడు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్‌కి గురిఅయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్‌తేజ్‌తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్‌లో కూడా తనలోని కామెడీ యాంగిల్‌తో మరియు తన మాడ్యులేషన్‌తో వెంకీ బాగా అలరిస్తారు. ఈ చిత్రానికి వెంకీ నటన ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో వెంకీ లుక్ కూడా బాగుంది. వరుణ్‌తేజ్ పర్వాలేదు. హైదరాబాదీ కుర్రాడిగ తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు. తమన్నా.. మెహ్రీన్ కౌర్ నటన పరంగా యావరేజ్‌గా ఉన్నా.. తమ గ్లామర్ షోతో ఇద్దరూ బాగానే మెప్పించారు. అందులోను ఇద్దరూ కలిసి కనిపించిన ఒక పాటలో పోటీపడి అందాల ప్రదర్శన చేశారు. ప్రకాష్‌రాజ్ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్ కూడా యావరేజ్ పాత్రే. ఫ్రెండు పాత్రలో ప్రియదర్శి బాగానే నవ్వించాడు. వెనె్నల కిషోర్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రకు తగ్గట్టు బాగానే చేసారు.
టెక్నికల్ అంశాల గురించి చెప్పాలంటే దేవిశ్రీప్రసాద్.. ఇందులో కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు. సంగీతానికి పెద్దగా ప్రాధాన్యమున్న సినిమా కాదు కానీ ఉన్నంతలో మంచి సాంగ్స్ ఒక్కటి కూడా లేదు. నేపథ్య సంగీతం కూడా రొటీన్‌గా సాగిపోతుంది. సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి విషయానికి వస్తే.. ఈ తరంలో క్లాస్-మాస్ అని తేడా లేకుండా అందరినీ అలరించేలా కామెడీ పండించడంలో తాను ముందుంటానని అతను మరోసారి చాటి చెప్పాడు. భార్యాబాధితుల కష్టాల్ని వినోదాత్మకంగా చెప్పడంలో అనిల్ విజయవంతమయ్యాడు. అతడు రాసుకున్న మాటలు భలేగా పేలాయి. కానీ కామెడీ మీద దృష్టిపెట్టి కథను సరిగ్గా తీర్చిదిద్దుకోకపోవడం. ద్వితీయార్థాన్ని కాస్త బోర్ కొట్టించాడు.
ఈ సినిమాకు ప్రధాన బలం వెంకటేష్. కామెడీ విషయంలో వెంకీకి తిరుగులేదన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘మల్లీశ్వరి’ తర్వాత ఆ స్థాయిలో వెంకీ అలరించిన సినిమా ఏదీ రాలేదు. ‘ఎఫ్-2’లో వెంకీ క్యారెక్టర్ ఆ రోజుల్ని గుర్తుకు తెస్తుంది. భార్యాబాధితుడిగా అతను చెలరేగిపోయి నటించాడు. ప్రథమార్థంలో ఇలా ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసే సీన్లు చాలానే ఉన్నాయి. పెళ్లిచూపుల టైంలో వెంకీ చూపించే అత్యుత్సాహం భలేగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇదే తరహాలో సాగే వరుణ్ పెళ్లిచూపుల సన్నివేశాన్ని మరింత హిలేరియస్‌గా డీల్ చేశాడు అనిల్. ద్వితీయార్థానికి వచ్చేసరికి ‘ఎఫ్-2’ మరీ సాధారణంగా తయారై ఫ్రస్ట్రేట్ చేస్తుంది. రెండో అర్థం ఓ మోస్తరుగా సాగినా కూడా ఒక స్థాయిలో నిలిచే అవకాశమున్న చిత్రాన్ని ఒక దశాదిశా లేకుండా మరీ సిల్లీగా నడిపించడం. ప్రథమార్థం చూసి ద్వితీయార్థం మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంటాం కానీ.. ‘ఎఫ్-2’ ఆ అంచనాలకు దరిదాపుల్లోనూ నిలవదు. కొంచెం కథ చెప్పాల్సిన చోట అనిల్ తేలిపోయాడు. కథను మలుపు తిప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు. అక్కడక్కడా కొన్ని సీన్లు నవ్వించినా కూడా.. కథ మరీ సిల్లీగా సాగడంతో ద్వితీయార్థం అంత ఎంగేజింగ్‌గా అనిపించదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ‘ఎఫ్-2’లో బోలెడంత ఫన్ ఉంది. కొంచెం ఫ్రస్టేషన్ తప్పదు మరి.

-శ్రీనివాస్ ఆర్ రావ్