రివ్యూ

ఆటలో మజా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులిజూదం * బాగోలేదు
*
నటీనటులు: మోహన్‌లాల్, విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీఖన్నా తదితరులు
ఎడిటర్: సమీర్ మహమ్మద్
స్క్రీన్‌ప్లే: ఉన్నికృష్ణన్
సంగీతం: సుషిన్ శ్యామ్
నిర్మాత: రాక్‌లైన్ వెంకటేశ్
దర్శకత్వం: ఉన్ని కృష్ణన్
*
ప్రజలకు జరిగిన అన్యాయాలను పట్టించుకోని అధికారులను.. అన్యాయాలు చేసేవాళ్లను చంపే కానె్సప్ట్‌తో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు కోలీవుడ్ కేరాఫ్ అడ్రెస్‌గా మారిందన్న విషయం తెలిసిందే. తాజాగా హీరో విశాల్ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పులిజూదం. రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పులిజూదం ఏమిటో తెల్సుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
ముగ్గురు ప్రముఖ వ్యక్తుల హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసినవాళ్ళను పట్టుకునేందుకు డిజిపి, ఏడిజిపిగా మంచి పేరు తెచ్చుకున్న మాథ్యూ (మోహన్‌లాల్)ను పిలిపిస్తాడు. అయితే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ఊటీ వెళ్లడానికి రెడీ యిన మాథ్యూ క్రైమ్, క్రైమ్ జరిగిన ప్లేస్‌ను చూసి.. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగి హంతకులను పసికట్టడంలో మంచి ఇంటిలిజెంట్. మాథ్యూ మాత్రమే ఈ కేసును డీల్ చేయగలరని డిజిపి మాథ్యూని రిక్వెస్ట్ చేయగా.. తన లీవ్ పక్కన పెట్టి ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరో తెలుసుకుంటాడు. ఆ హత్యలు మదనగోపాల్ అనే వ్యక్తి చేస్తున్నాడని తెలుసుకుంటాడు. అసలు దువ్వూరి మదనగోపాల్ (విశాల్)కి ఆ హత్యలకు వున్న సంబంధం ఏమిటి? చివరికి మాథ్యూ ఆ హత్యలు చేస్తోన్న వారిని పట్టుకున్నాడా? లేదా? లాంటి విషయాలు మిగతా కథ.
ఇప్పటికే ఎన్నో పోలీస్ తరహా పాత్రల్లో జీవించిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ఇందులో అసిస్టెంట్ డిజిపి మాథ్యూ పాత్రలో ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దాంతోపాటు కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో కూడా ఆయన తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. వైద్యుడిగా నటించిన విశాల్ సినిమాలో కనిపించేది తక్కువసేపే అయినా ఉన్నంతలో బాగానే చేశాడు. అలాగే విశాల్‌కు జోడీగా నటించిన హన్సిక తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పోలీస్ కానిస్టేబుల్‌గా నటించిన రాశీఖన్నా కూడా బాగానే నటించింది. ఇక ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్ ఉన్నంతలో బాగానే చేశాడు. కానీ ఆయన చేయాల్సిన పాత్ర మాత్రం కాదు. అలాగే మిగలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
టెక్నికల్ హైలెట్స్ గురించి చెప్పాలంటే దర్శకుడు ఉన్నికృష్ణన్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. అయితే కొన్ని సన్నివేశాల్లో చక్కని ప్రతిభ కనబర్చారు. ‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్‌లో ఒక హీరో ఉంటాడు’ అనే స్టోరీ థీమ్ బాగుంది. కానీ సినిమాలో ఏ మాత్రం కమర్షియల్ హంగులు లేవు. ఎంటర్‌టైన్‌మెంట్ పూర్. నిజానికి ఇలాంటి కథలు.. కథనాలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కానీ అది సినిమాటిక్‌గా మార్చేసి ముగించేశాడు దర్శకుడు. ఇక సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకె. కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. సమీర్ మహమ్మద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాణ విలువలు యావరేజ్.
చివరగా అన్యాయాలను పట్టించుకోని అధికారులను.. అన్యాయాలు చేసేవాళ్లను చంపే కానె్సప్ట్‌తో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు మంచి కథను తీసుకున్నప్పటికీ.. అదేమీ కొత్త కాదు కానీ దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ టిపికల్ నేరేషన్‌తో, పూర్తి ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. ముఖ్యంగా కథ, కథనం ఉండాల్సిన స్థాయిలో లేవు. ఆసక్తిని పెంచే పాయింట్‌తో మొదలుపెట్టినా దాని నిరాశగా ముగించేశాడు. మోహన్‌లాల్ గత జీవితానికి సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సినిమా చాలా చోట్ల బోర్‌గా సాగుతుంది. కానీ ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్ అయ్యే ఆసక్తిని మాత్రం దర్శకుడు క్రియేట్ చేయలేదు. దీనికితోడు సినిమా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా ఫలితాన్ని బాగా దెబ్బతీసింది. మొత్తంమీద ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాగా ఇష్టపడే ప్రేక్షకులను నిరుత్సాహపరడం ఖాయం.

-త్రివేది