రివ్యూ

భయపెట్టని చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *ప్రేమకథా చిత్రం 2
*
నటీనటులు: సుమంత్ అశ్విన్, నందిత శే్వత, సిద్ధి, ప్రభాస్ శ్రీను,
విద్యుల్లేఖ రామన్ తదితరులు
కెమెరా: రాంప్రసాద్.సి
సంగీతం: జె.బి
నిర్మాత: సుదర్శన్ రెడ్డి
దర్శకత్వం: హరికిషన్
*
ఆమధ్య వచ్చిన ప్రేమకథా చిత్రం సినిమా హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి సంచలన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను హర్రర్ సినిమాలవైపు మళ్లించింది. ఆ సినిమా సక్సెస్‌తో సౌత్‌లో పలు హారర్ సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేమకథా చిత్రం 2 తెరకెక్కింది. సుమంత్ అశ్విన్, నందితా శే్వత, సిద్ధి నటించిన ఈ సినిమా ఈ ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో దెయ్యం ఉందా, ఉంటే ఎలా భయపెట్టింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
స్టూడెంట్ అయిన సుధీర్ (సుమంత్ అశ్విన్) చాలా మంచి యువకుడు. అతని బిహేవియర్ చూసి అదే కాలేజీలో చదువుతున్న బిందు (సిద్ది) ఇష్టపడుతుంది. సుధీర్‌పై ప్రేమ పెంచుకున్న బిందు అతనితో తన ప్రేమను అతనికి ఓ సందర్భంగా చెపుతుంది. కానీ సుధీర్ అప్పటికే నందు (నందిత శే్వత) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. బిందు ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని పరిణామాల అనంతరం నందు.. సుధీర్‌తో ఏకాంతంగా గడిపేందుకు ఓ ఫామ్‌హౌస్‌కి తీసుకుపోతుంది. ఆ తరువాత జరిగే సంఘటనలతో నందుకు దెయ్యం పట్టిందని తెలుసుకుంటాడు సుధీర్. అసలు నందుకు పట్టిన దెయ్యం ఎవరు? మధ్యలో చిత్ర అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది? ఇంతకీ చిత్ర ఎవరు? ఆ దెయ్యం నుండి నందును సుధీర్ కాపాడాడా అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారు:
హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కెన ఈ సినిమాలో సుధీర్ పాత్రలో సుమంత్ అశ్విన్ చక్కగా నటించాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌లో సుమంత్ అశ్విన్ నటన బాగుంది. ఇక నందు పాత్రలో.. నందిత శే్వత అదరగొట్టింది. ముఖ్యంగా దెయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె జీవించేసిందని చెప్పాలి. మొదటినుండి భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న నందితకు మరోనటనకు స్కోప్ వున్న చిత్రమిది. ఇక సిద్ధి గ్లామర్ పాత్రలో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో బాగా చేసింది. ఇక మిగతా పాత్రల్లో మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో చేశారు. ప్రభాస్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక విలువలు:
హర్రర్ సినిమలకు రీ రికార్డింగ్ కీలకం అని చెప్పాలి. ఈ విషయంలో జెబి పనితనం ఫర్వాలేదనిపిస్తుంది. ఇక పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకె, సినిమాటోగ్రఫీ బాగుంది. డార్క్ సైడ్ సన్నివేశాలు, సాంగ్స్‌బాగా చిత్రీకరించారు. ఇక దర్శకుడు హరికిషన్ రాసుకున్న స్క్రిప్ట్ ఆకట్టుకునేలా లేదు. పాతరొటీన్ ఫార్ములా తీసుకుని దాన్ని అంతకంటే రొటీన్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాప్ విషయంలో కేర్ తీసుకున్న దర్శకుడు సెకెండ్ హాప్‌పై ఫోకస్ పెట్టలేదు. కథ నెమ్మదిగా సాగడం, రొటీన్ సన్నివేశాలు, బలమైన అంశాలు లేకపోవడంతో సినిమా చాలా నీరసంగా సాగుతుంది. కనీసం ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. డజన్లకొద్ది హర్రర్ సినిమాలు సౌత్‌లో రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఎలాంటి కొత్తదనం లేని కథను చెప్పాలనుకున్నాడు దర్శకుడు. పైగా ఎక్కడా ఆసక్తి కలిగించే అంశాలు కనిపించవు. అనవసర సన్నివేశాలు నీరసం తెప్పిస్తాయి.
విశే్లషణ:
హర్రర్ సినిమాలపై ఆసక్తి వున్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా చాలా నీరసంగా ఉంది. కథలో, కథనంలో ఎక్కడా కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకునే దృశ్యాలు లేకపోవడం లాంటి అంశాలు విసుగు పుట్టిస్తాయి. ప్రేమకథా చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించి హర్రర్ సినిమాలవైపు మళ్లేలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆ టైటిల్ తప్ప మిగతాదంతా జీరో. నటిగా నందిత శే్వత నటన బాగుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో హర్రర్ పండించడంలో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. సుమంత్ నటన యావరేజ్. సిద్ది గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఇక దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోని హర్రర్ కథతో తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో విఫలమైంది. కథనం బోరింగ్‌గా సాగుతూ.. సినిమాపై వున్న కాస్త ఆసక్తిని దెబ్బతీసేలా మారింది పరిస్థితి.