రివ్యూ

సాదా సీదా రుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * రుణం
*
తారాగణం: గోపీకృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియాంక అగస్త్య, నాగమహేష్‌వడ్డి తదితరులు
సంగీతం: ఎస్‌వి మల్లిక్ తేజ
సినిమాటోగ్రఫీ: ఎ వెంకట్
ఎడిటింగ్: కె రాఘవేంద్రరెడ్డి
బ్యానర్: బెస్ట్‌విన్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: భీమనేని సురేష్, జి కృష్ణారావు
దర్శకత్వం: ఎస్ గుండ్రెడ్డి
*
కొత్తనటులు గోపీకృష్ణ, మహేంద్ర, శిల్పా, ప్రియాంక అగస్త్యలతో ఎస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రుణం. మెసేజ్ ఒరియంటేషన్‌తో తెరకెక్కిన సినిమాను బెస్ట్‌విన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అన్నిరకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎవరు ఎవరికి రుణపడ్డారు? ఎవరి రుణం ఎవరు తీర్చుకోవాలి? అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాలి.
సుధీర్ (గోపీకృష్ణ) జీవితంపై ఎన్నో ఆశలు, సాధించాల్సిన ఆశయాలతో హైదరాబాద్ వస్తాడు. మంచి ఉద్యోగం సంపాదించి తాను కలలుగన్న జీవితం గడపాలని అనుకుంటాడు. నిజానికి అతనో అనాథ. ఆ సమయంలో లత పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. తనకిక లతే జీవితం అనుకుంటాడు. తల్లిదండ్రులు లేనిలోటు ఆమె తన జీవితంలోకి వస్తే తీరిపోతుందని అనుకుంటాడు. కానీ ఆమె అవకాశవాది అని, తనలాగే చాలామంది యువతను బుట్టలో వేసుకుని మోసం చేసిందని తెలుస్తుంది. ఆశలు నీరుగారిపోతాయి. ప్రియురాలు కొట్టిన దెబ్బ మనసుకు బలంగా తగులుతుంది. డబ్బుకోసమే లత తనను మోసం చేసిందని, అందుకే ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. డబ్బు సంపాదించే సులువైన మార్గంలో భాగంగా ఓ చిప్ తయారు చేస్తాడు. అతని రూమ్మేట్ శ్రీను (మహేంద్ర)తో కలిసి హైదరాబాద్‌లో బాగా డబ్బున్న వారి అకౌంట్‌ను హ్యాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రయత్నంలో హైదరాబాద్‌లోనే పేరుమోసిన రౌడీ వెట్రి అకౌంట్ హ్యాక్ చేస్తాడు. ఆ ప్రక్రియకు పాల్పడుతుండగా విషయం తెలుసుకున్న వెట్రి అతన్ని పసిగట్టి చంపే ప్రయత్నం చేస్తుంటాడు. వారినుంచి తప్పించుకునే క్రమంలో తన ఫ్రెండ్ శ్రీను చనిపోతాడు. ఊళ్లోని శీను తల్లిదండ్రుల గురించి తెలుసుకున్న సుధీర్, వాళ్ల ఊరికి వెళ్తాడు. శ్రీను అమ్మానాన్నలు గుడ్డివాళ్లు కావడంతో తనే కొడుకు అన్నట్టు సేవ చేస్తుంటాడు. అంధులైన తల్లిదండ్రులు అతను శీను కాదని తెలుసుకుంటారా? చంపడానికి వెంటపడుతున్న వెట్రి నుంచి సుధీర్ ఎలా తప్పించుకున్నాడు? అసలు సుధీర్ ఎవరికి రుణపడ్డాడు? అన్నది మిగతా కథ.
కొత్త హీరో అయిన గోపీకృష్ణ సుధీర్ పాత్రలో బాగానే నటించాడు. నేటి యువతరం మనోభావాలకు ధీటుగా తన పాత్రను పోషించే ప్రయత్నం చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్న యువకుడిగా, తనవల్ల స్నేహితుడికి జరిగిన అన్యాయానికి రుణం తీర్చుకోవాలన్న సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగానే పండించాడు. ఆర్టిస్ట్‌గా కొద్దికాలం ఇండస్ట్రీలో నిలబడాలంటే -మరింత మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. శీను పాత్రలో మహేంద్ర ఉన్నంతలో చక్కగా నటించాడు. ముఖ్యంగా అతనితో చెప్పించిన సంభాషణలు బావున్నాయి. సీత పాత్ర పోషించిన ప్రియాంక అగస్త్య సినిమాకు ప్లస్ పాయింట్. పల్లెటూరి అమ్మాయిలా.. మాడ్రన్ గెటప్స్‌లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. సీత.. సీతిక్కడ -అంటూ ఆమె చెప్పే మేనరిజం బావుంది. మరో హీరోయిన్ శిల్పాను తక్కువ చేయలేం. పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులూ వారి పరిధిమేరకు బాగానే చేశారు.
సినిమాకు సంగీతం ఓ ఆకర్షణ. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ బావుంది. కానీ, కొన్ని సమయాల్లో సంగీతం అసలు విషయాన్ని మింగేసింది. సంగీతం మరీ డామినేట్ చేసిందనే చెప్పాలి. ఆర్‌ఆర్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బావుండేదేమో. ఎడిటింగ్ ఫరవాలేదు. సినిమా వేగం విషయంలో బాగానే ఉంది. ప్రొటోగ్రఫీ కూడా బావుంది. కోసనీమ అందాలు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ, కొత్తతరహా ట్రీట్మెంట్‌కు ట్రైచేశాడు. తల్లిదండ్రులను మించిన వారు లేరంటూ నేటి తరానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాంతోపాటు ఆయన అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
చివరిగా.. ఊరికే డబ్బు సంపాదించాలనుకుంటే కష్టాలు కూడా వస్తాయన్న ఆసక్తికర కథనంతో దర్శకుడు చేసిన ప్రయత్నం ఓకే. ముఖ్యంగా కొత్తవాళ్లైన హీరో హీరోయిన్లు బాగానే చేశారు. కానీ కమెడియన్‌తో వేయించిన వేషం నవ్వించకపోగా.. వెగటు పుట్టించింది. దాన్ని మరీ సాగదీసి విసుగు పుట్టించాడు దర్శకుడు. మ్యూజిక్, ఆర్‌ఆర్ ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకున్న దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బావుండేది. మొత్తానికి ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వచ్చిన రుణం ఓ మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

-శ్రీ