రివ్యూ

ముందుకా.. వెనక్కా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతా.. చలో * బాగోలేదు
*
తారాగణం: గణేశ్, రష్మికా మండన్న, అక్షయ్ నాయక్ తదితరులు
సంగీతం: జూదా సంధ్య
సినిమాటోగ్రఫర్: సంతోష్‌రాజ్
నిర్మాత: మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుని
*
చలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మండన్న తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత విజయ్‌దేవరకొండ సరసన నటించిన గీత గోవిందంతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ సినిమా తరువాత పలు వరుస అవకాశాలతో బిజీ అయింది రష్మిక మండన్న. దాంతో రష్మికకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఆమె నటించిన కన్నడ సినిమాలను ఇక్కడ విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక కన్నడ స్టార్ గణేష్ జంటగా నటించిన చమక్ చిత్రాన్ని గీత..చలో పేరుతో తెలుగులోకి విడుదల చేసారు నిర్మాతలు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్. మరి గీత చలో అంటూ ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ:
వీకెండ్ పార్టీలు, పబ్బులంటూ పెళ్లిచేసుకోకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు కృష్ణ (గణేశ్). ఇంట్లోవాళ్ళ ఒత్తిడి కారణంగా ఒక అమాయకమైన అమ్మాయిని పెళ్లిచేసుకుంటే తన ఎంజాయ్‌కి ఎలాంటి అడ్డురాదని, ప్లాన్ చేసి అలాంటి అమ్మాయికోసం అనే్వషణ సాగిస్తాడు. ఆ అనే్వషణలో అమాయకురాలైన ఖుషి (రష్మికా మండన్న)ని ఎంచుకుంటాడు. తనకు ఏ అలవాట్లులేవని మాయచేసి పెళ్లిచేసుకుంటాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఖుషి కూడా తన లాంటిదే అని, ఆమె అమాయకురాలు కాదని కృష్ణకు తెలుస్తోంది. అలాగే కృష్ణ గురించి కూడా ఖుషికి నిజం తెలుస్తోంది. ఆ తరువాత వారి జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలు ఏమిటి? చివరికి ఇద్దరూ అన్ని అభిప్రాయ భేదాలను మర్చిపోయి ఒకటయ్యారా? లేదా? అన్నది మిగతా కథ..
‘్ఛలో, గీత గోవిందం’ విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది రష్మికా మండన్న. హీరోయిన్‌గా రష్మికా మాత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఖుషి అనే అమ్మాయిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి షాకిచ్చింది. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్‌తోపాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. హీరోతో సాగే ప్రేమ సన్నివేశాల్లో.. అలాగే హీరోమీద కోపం చూపించే సందర్భాల్లో రష్మిక పలికించిన హావభావాలు బాగున్నాయి. ఇక హీరోగా నటించిన గణేశ్ చక్కని నటనను కనబరిచాడు. తాను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నంచేసాడు. అక్కడక్కడా నవ్విస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరో పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. అలాగే హీరోయిన్‌తో సాగే ప్రేమ అండ్ ఫ్యామిలీ సన్నివేశాల్లో వారిమధ్య కెమిస్ట్రీకూడా బాగా అలరిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు బాగా నటించారు.
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే... దర్శకుడు సుని మంచి కానె్సప్ట్‌ని తీసుకున్నారు. అయితే దాన్ని తెరమీద చూపెట్టడంలో తడబాటుకు గురయ్యాడు. సంతోష్‌రాజ్ కెమెరా పనితనం ఇంప్రెస్ చేసేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు సంధ్యా అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ పనితనం కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ సినిమాగా కేర్ తీసుకున్నారు.
అక్కడక్కడా ఎంటర్‌టైన్‌గా కథ సాగుతున్నాకూడా కథ చాలా సింపుల్‌గా ఉండటం, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రెగ్యులర్‌గా బోర్ కొట్టించడం విశేషం. ఒక్క హీరోయిన్ మినహా.. మిగిలిన నటీనటులు మొత్తం తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తకావడం, సినిమాలో బలమైన సన్నివేశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి పెద్ద బలహీనతలుగా నిలిచాయి. మొదటి భాగం సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ, రెండవ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. దీనికితోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. రష్మికా మండన్న క్రేజ్‌ను బేస్‌చేసుకుని తెలుగు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేదు. అయితే రష్మికా మండన్న మాత్రం ఆకట్టుకుంది. సినిమా అక్కడక్కడా ఎంటర్‌టైన్‌గా నడిచినప్పటికీ... కథ సింపుల్‌గా ఉండటం, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కీలకమైన సీన్స్‌కు లాజిక్స్ లేకపోవడం, ఒక్క హీరోయిన్ మినహా... మిగిలిన నటీనటులు మొత్తం తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తకావడం, సినిమాలో బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సాగే కీలక సన్నివేశాలకు ఎలాంటి లాజిక్ ఉండదు. ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలుకూడా పెద్దగా ఆకట్టుకోవు. వీటికితోడు హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్‌కి లోబడి... మరి నాటకీయంగా సాగుతాయి. మొత్తానికి ఓ మోస్తరు కథతో చేసిన ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.

-త్రివేది