రివ్యూ

కొత్త స్క్రీన్‌పై పాత కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 ** ఫర్వాలేదు
**
తారాగణం: టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, అనన్య పాండే, గుల్‌పనాంగ్, ఆదిత్య సీల్ తదితరులు
సంగీతం: విశాల్-శేఖర్
సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్
కూర్పు: రితేశ్ సోనీ
నిర్మాణ సంస్థలు: ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పునీత్ మల్హోత్రా
**
-2012లో కాలేజ్ లవ్ స్టోరీతో కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా -స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. స్క్రీన్‌కు పరిచయమైన వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా, ఆలియాభట్‌లను స్టార్లను చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ -స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2
బాఘి సినిమాతో హిట్టందుకున్నాడు టైగర్ ష్రాఫ్. దాని సీక్వెల్ భాఘి 2తో స్టార్ అయిపోయాడు. బాలీవుడ్‌లో యూత్ ఐకాన్ అనిపించుకున్న టైగర్ -సీక్వెల్‌లో లీడ్ రోల్ చేశాడు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో హీరోలిద్దరూ కొత్తవాళ్లు. సీక్వెల్ సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ కొత్తగా స్క్రీన్‌కు పరిచయమైన వాళ్లు. ఫస్ట్‌పార్ట్‌లో స్క్రీన్‌కు పరిచయమై స్టార్‌గా వెలుగుతున్న ఆలియా భట్ -సీక్వెల్ పార్ట్‌లో ‘స్పెయల్ అప్పియరెన్స్’లో చిందులేసి మెప్పించింది. ఈ పోలికలు, ప్రత్యేకతల మధ్య -దర్శకుడు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఎలావుందో చూద్దాం.
కథలోకి వెళ్తే..

ఓ చిన్న టౌన్ కుర్రాడు రోహన్ శర్మ (టైగర్ ష్రాఫ్). చిన్నప్పటి స్నేహితురాలు మృదుల (తారా సుతారియా)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. ఆమెను వెతుక్కుంటూ సిటీలోని ఓ టాప్ కాలేజ్‌లో చేరతాడు. సంపన్న కుటుంబానికి చెందిన అందగత్తె శ్రేయ సుఖాడియా (అనన్య పాండే) అదే కాలేజ్‌లో చదువుతుంటుంది. ఆమె అన్న మానవ్ మెహ్రా (ఆదిత్య సీల్). రోహన్‌పట్ల శ్రేయ, మృదుల ఇష్టం పెంచుకుంటే, రోహన్ మాత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కప్పును టార్గెట్ చేస్తాడు. ఎలాంటి పరిస్థితులను అధిగమించి రోహన్ కప్పును సొంతం చేసుకున్నాడు? శ్రేయ, మృదుల.. ఎవరు రోహన్‌ను గెలుచుకున్నారు? సింపుల్‌గా ఇదీ కథ.
బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్‌లాంటి యూత్ ఐకాన్‌కు సరిగ్గా సరిపోయే కథనే ఎంచుకున్నాడు దర్శకుడు పునీత్ మల్హోత్రా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కథను అందంగా నేరేట్ చేయడానికి స్పాన్‌వున్న లైన్ ఇది. కాకపోతే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌కు -దగ్గర పోలికలు ఈ కథలోనూ చోటుచేసుకున్నాయి. మొదటి చిత్రంలో హీరోయిన్, ఇద్దరు హీరోలతో కథ నడిపిస్తే, సీక్వెల్‌లో ఇద్దరు హీరోయిన్ల మధ్య హీరో కథను నడిపించారంతే. ఏడేళ్ల క్రితం వచ్చిన మొదటి చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ కోసం ఒకింత ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చూపించినట్టే అనిపిస్తుంది. సీక్వెల్ కనుక మొదటి చిత్రంలోని ఆంబియన్స్‌నే కొన్ని సన్నివేశాల్లో డిజైన్ చేయాల్సి వచ్చింది. దీంతో సీనే్స కాపీకొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ఫా మొత్తాన్ని దాదాపుగా రోహన్ కథతో నడిపేసిన దర్శకుడు, ద్వితీయార్థంలో అసలు కథలోకి తీసుకెళ్తాడు. చిన్నప్పటి స్నేహితురాలితో పీకల్లోతు ప్రేమలోవున్న రోహన్, ఆమె కోసం స్పోర్ట్స్ కోటాలో సీటు సంపాదించి సిటీలోని పేరున్న కాలేజ్‌లో చేరతాడు. అక్కడ రోహన్‌కు ఎదురయ్యే చేదు అనుభవాలు, ప్రేమలో విఫలమైన తీరు యూత్‌కి కనెక్టయ్యేలా సన్నివేశాలను డిజైన్ చేశాడు పునీత్. అవరోధాలకు కుంగిపోకుండా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ట్రోఫీని సాధించడానికి రోహన్ పడిన కష్టం, కఠోర శ్రమ, సాధన సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఈ సన్నివేశాలన్నీ కథానాయకుడు టైగర్ ష్రాప్‌ను దుష్టిలో పెట్టుకునే దర్శకుడు రాసుకున్నాడు. క్లాస్‌రూం స్టోరీలను వదిలిపెట్టి, క్లాస్‌రూం బయట కనిపించే స్పోర్ట్స్, డ్యాన్స్, రొమాన్స్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది ఇప్పటి యూత్‌కి కనెక్టయ్యే అంశమే. కామెడీకి మంచి స్కోప్‌వున్నా, అక్కడక్కడా తప్ప ఫోకస్ పెట్టలేదు.
సాంకేతికంగా విశాల్ -శేఖర్ అందించిన సంగీతం ఫరవాలేదు. రాధా, డిస్కో పాటలు మాత్రం వినసొంపుగా ఉన్నాయి. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. క్రిస్ప్‌గా చెప్పాల్సిన సన్నివేశాల్ని సాగదీయడంతో బోర్ ఫీలవుతాం. నిర్మాణంలో రిచ్‌నెస్‌తో -ప్రతి ఫ్రేమ్‌లో ఫ్రెష్‌నెస్ కనిపించింది.
టైగర్ ష్రాఫ్ వన్ మ్యాన్ షో ఇది. దేహదారుఢ్యం, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం, డాన్సింగ్ స్కిల్స్ -కథలో అతని పాత్రను సరిగ్గా ఎలివేట్ చేశాయి. కబడ్డీ గేమ్‌లో టైగర్ అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అనిపిస్తుంది. ఇక తారా సుతారియా, అనన్య పాండేల స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. డ్రెస్సింగ్ స్టయిల్ కనిపించినంత గొప్పగా వాళ్ల పాత్రల్ని పెర్ఫార్మెన్స్‌లో చూపించలేకపోయారు. తొలి సినిమా కావడంతో నటనపరంగా ఆశించడానికేమీ లేదు. మరింత పరిణితి సాధించాల్సి ఉంది. రోహన్ చైల్డ్‌హుడ్ లవర్‌గా తారా సుతారియా పాత్రకు స్కోప్‌వున్నా, ప్రాధాన్యత లేకుండా చేశారు. పొగరుబోతు అందగత్తెగా అనన్య పాత్ర ఒకవిధంగా ఆకట్టుకుంది. టైగర్ ష్రాఫ్‌తో తారా సుతారియా, అనన్య పాండేల కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తోటి విద్యార్థిగా, ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో మానవ్ మెహ్రా ఆకట్టుకున్నాడు. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ చూపించి హావభావాలతో సినిమాకు ప్లస్ అయ్యాడు. ప్రధానంగా ఈ నాలుగు పాత్రల మధ్యే కథ మొత్తం నడుస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో కథానాయిక పాత్ర పోషించిన ఆలియా భట్, సీక్వెల్‌లో ‘హుకప్’ గీతంతో మెప్పించింది. హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ కూడా ఓ పాటలో అలరించాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ -మొదటి చిత్రం ఛాయల్లోనే నడిచినా ఏమాత్రం కొత్త ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. ఎస్‌వోటీవై -ఓ సాధారణ ఫన్ రొమాంటిక్ సినిమా.