రివ్యూ

ప్యార్.. మహా బోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దే దే ప్యార్ దే ** ఫర్వాలేదు
**
తారాగణం: అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్‌సింగ్, టుబు, జావేద్ జాఫ్రీ, జిమీ షేర్గిల్, అలోక్‌నాథ్ తదితరులు
సంగీతం: అమాల్ మాలిక్
సినిమాటోగ్రఫీ: సుధీర్ కే చౌదరి
ఎడిటర్: అకీవ్ అలీ
కథ: లవ్ రంజన్
నిర్మాణ సంస్థ: లవ్ ఫిల్మ్స్, టి సిరీస్
స్క్రీన్‌ప్లే: లవ్ రంజన్, తరుణ్ జైన్, సురభి భట్నాగర్
దర్శకత్వం: అకీవ్ అలీ
**
హిట్లుమీద హిట్లందుకుంటూ మంచి ఊపుమీదున్నాడు అజయ్ దేవ్‌గణ్. గత ఏడాదిలో మూడు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెయిడ్, హెలికాఫ్టర్ ఈలా, టోటల్ ధమాల్ చిత్రాలు దేవ్‌గణ్ రేంజిని పదిలపర్చాయి. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ వస్తున్న దేవ్‌గణ్, ఈసారీ భిన్నమైన కథనే ఎంచుకున్నాడు. అదే -దే దే ప్యార్ దే. రొమాంటిక్ కామెడీ ఫ్లిక్‌గా తెరకెక్కిన చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, టబు హీరోయిన్లు. ఎన్నో హిట్ చిత్రాలకు ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తించిన అకీవ్ అలీ -తొలిసారి దే దే ప్యార్ దేతో దర్శకుడి అవతారమెత్తాడు. అయితే -సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో -వివాదాల్లో చిక్కుకుంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్‌ను సినిమాలోకి తీసుకోవడం దుమారం రేపింది. అలోక్‌ను తప్పించి ఆ పాత్రలో మరెవరినైనా తీసుకోవాలంటూ పలవురు ప్రముఖుల నుంచి సూచనలొచ్చాయి. మీ టూ బాధిత వర్గం నుంచి ఆగ్రహ జ్వాలలూ వినిపించాయి. ఆర్థికాంశాలను దృష్టిలో పెట్టుకుని అలోక్‌ను ప్రాజెక్టునుంచి మార్చేలేమంటూ దేవ్‌గణ్ సైతం స్పందించాడు. మరోపక్క సినిమా విడుదలకు ముందు -సెన్సార్‌నుంచి అభ్యంతరాలు తప్పలేదు. రకుల్ పాత్ర శృతిమించి ఉందని, కొన్ని సన్నివేశాలు తొలగించి, కొన్ని సంభాషణలు తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడి ముందుకొచ్చిన సినిమా -ఏమేరకు ఫలితం సాధించిందో చూద్దాం.
50ఏళ్ల ఆశిష్ మెహ్రా (అజయ్ దేవ్‌గణ్) పెళ్లయిన ఒంటరి. భార్య మంజు (టబు) నుంచి 20ఏళ్ల క్రితమే విడిపోయి ఒంటరిగా ఉంటుంటాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన కూతురు, టీనేజ్ కొడుకు ఉంటారు. లైఫ్ హ్యాపీగా నడిచిపోతున్న టైంలో -కూతురు వయసుండే అయేషా (రకుల్)పై మనసు పడతాడు. ఆమెను పెళ్లాడాలంటే -దూరంగావున్న కుటుంబం అనుమతి అవసరం. అందుకోసం కుటుంబానికి పరిచయం చేయడానికి అయేషాను ఇంటికి తీసుకొస్తాడు. మాజీ భార్య, పిల్లలు ఆమెను అంగీకరించరు. అలాంటి పరిస్థితుల్లో ఆయేషాతో పెళ్లి కోసం మంజు, పిల్లల్ని ఒప్పించేందుకు ఆశిష్ ఏం చేశాడు? ఇటు ప్రియురాలు అటు మాజీ భార్య మధ్య ఎలా నలిగిపోయాడు? ఆ రొమాన్స్‌ని స్క్రీన్‌పైనే చూడాలి.
కొనె్నళ్లుగా కత్తెర వేయడానికి అలవాటుపడిన దర్శకుడు, కథను నేరేట్ చేయడంలో మాత్రం పనితనం చూపించలేకపోయాడు. కథకు కీలకమైన ఆయేషా పాత్రను పరిచయం చేయడంలోనే అనుభవరాహిత్యం కనిపించింది. తనకు సంబంధంలేని ఓ బ్యాచిలర్స్ పార్టీలో ఆయేషా తాగి చిందులేస్తూ పెళ్లి కొడుకుని టార్గెట్ చేసే సన్నివేశంతో ఆసక్తి కలిగించాడు దర్శకుడు. వీకెండ్స్‌లో బార్‌టెండర్‌గా తాగి తందనాలాడే ఆయేషా పాత్ర స్వభావాన్ని సస్టెయిన్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అనవసర ప్రవర్తనతో వధువుతో గొడవపెట్టుకున్న ఆయేషా -మళ్లీ ఆమె పెళ్లిలోనే ఆశిష్‌ని కలవడం, అతనితో డ్యాన్స్ సన్నివేశాలు.. ఇలా కథే ఓ కన్ఫ్యూజింగ్ మోడ్‌లో మొదలవుతుంది. మింగుడుపడని సన్నివేశాలకు మరింత బలం చేకూరుస్తూ -స్క్రీన్‌ప్లే సైతం కన్ఫ్యూజింగ్‌గా నడవటం ఆడియన్స్‌లో ఉన్న ఆసక్తి చచ్చిపోతుంది. దర్శకుడు సినిమాలో స్ట్రెయిట్‌గా చెప్పదలచుకున్న పాయింట్ బలహీనపడిపోవడంతో -బోర్‌డమ్ మొదలైంది.
50ఏళ్ల వ్యక్తి పాత్రలో అజయ్ హ్యాండ్సమ్‌గా కనిపించాడు. తన వయసులో సగం వయసున్న అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు చెప్పాల్సిన ప్రతి సన్నివేశంలో మంచి నటనను కనబర్చాడు. రకుల్‌తో ప్రేమలో పడే సన్నివేశాల్లో అజయ్ పెర్ఫార్మెన్స్‌ను ఎంచి చూపించలేం. అయితే ఈ పాయింట్‌లో అద్భుతమైన కామెడీ పండించే అవకాశం ఉన్నా, అజయ్ దేవ్‌గణ్‌ను దర్శకుడు అకీవ్ అలీ అద్భుతంగా వాడుకోలేకపోయాడు. సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన దానికంటే -రకుల్ గ్లామర్ డోస్ ఒకింత ఎక్కువగానే ఉంది. తొలిసారి బాలీవుడ్ చాన్స్ అందుకున్న రకుల్, భవిష్యత్ ప్రణాళికను ‘దే దే ప్యార్ దే’నుంచే అమలు చేయడం మొదలెట్టిందా? అన్నట్టుంది రకుల్ గ్లామర్ ప్రదర్శన. దానికితోడు పాత్రపరమైన స్వభావం కూడా కలిసి రావడంతో ఆమె ‘చలాకీతనా’నికి హద్దుల్లేవు. నిజానికి రకుల్ పాత్రకు ప్రాధాన్యతవున్నా, బలంగా తీర్చిదిద్దడంలో కథకుడు, దర్శకుడి వైఫల్యం కనిపించింది. టబు డిగ్నిఫైడ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. దానికితోడు భర్తకు దూరంగావుంటున్న మహిళను ఇష్టపడే వ్యక్తిగా జిమీ షేర్గిల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు, తన కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని పంచాడు. మిగతావారంతా తమ పాత్రల పరిథిమేర కనిపిస్తారు.
సినిమాటోగ్రఫీ కోణంలో సుధీర్ కే చౌదరి, సంగీతపరంగా అమాల్ మాలిక్‌ల కష్టం కనిపించింది. లవ్ ఫిల్మ్, టి సిరీస్ నిర్మాణ విలువలు బావున్నాయి.

-వి