రివ్యూ

ఈ హిప్పీ.. అదోటైపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిప్పీ * బాగోలేదు
*
తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జెజ్బాసింగ్, జెడి చక్రవర్తి, వెనె్నల కిషోర్, బ్రహ్మాజీ, సుదర్శన్, శ్రద్ధాదాస్ తదితరులు
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రఫీ: రాజశేఖర్ ఆర్‌డి
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
దర్శకత్వం: టిఎన్ కృష్ణ
*
సమీక్షకు సంబంధం లేకపోయినా -సినిమా చూసిన తరువాత.. ప్రభాస్ ‘మిర్చి’లోని డైలాగ్ గుర్తుకొచ్చింది. ‘ప్రేమిస్తే ఏంపోతుంది బాస్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’. చిన్న డైలాగే ‘మిర్చి’ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. మానవ సంబంధాలను విశే్లషించిన ఆ కథలో అదే ప్రాణం.
తిరిగి ప్రేమించడం మొదలైతే.. ప్రేమించిన వాడి పరిస్థితి ఏవౌతుంది? ఇదీ ‘హిప్పీ’ సినిమాకు సింపుల్ సూత్రం. ప్రేమించడానికి తాపత్రయపడే కుర్రాడి మనసు -తరువాత ప్రేమని స్వీకరించే విషయంలో ఎలాంటి ఆలోచనలకు తావిస్తోందన్న పాయింట్ మీద దర్శకుడు టిఎన్ కృష్ణ కథ అల్లుకున్నాడు. యూత్ ఆలోచనలకు అద్దంపట్టే కథ అనలేం. కొన్నిరకాల మనస్థత్వాల మధ్య పెరిగిన కుర్రాళ్ల ఆలోచనలకు ఇదోక రూపం. అంటే -ప్రేమకు ఇదో పార్శ్వం.
**
ఆర్‌ఎక్స్ 100తో హిట్టందుకున్నాడు కార్తికేయ. అనూహ్యమైన క్రేజ్ రావడంతో -సహజంగానే సెకెండ్ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది. తమిళ నిర్మాత కలైపులి థాను నిర్మాణంలో ‘హిప్పీ’ని ప్రకటించాడు. టైటిల్ వినగా -ఆటిట్యూడ్ బేస్డ్ సినిమా కనుక ఆసక్తి రెట్టింపైంది. ప్రచారంలో ‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్’ టాగ్ తగిలించటంతో -ఆసక్తి పీక్స్‌కి చేరింది. కార్తికేయ ‘ప్లేబోయ్’ అప్పియరెన్స్ కూడా ఓ కారణం. వెరసి విడుదలకు ముందే హిప్పీకి ఇమేజ్ వచ్చేసింది. అయితే కార్తికేయను ఆ రేంజ్‌కి తీసుకెళ్లిందో లేదో -కథలో చూద్దాం.
కథ:
దేవ అలియాస్ హిప్పీ దేవదాస్ (కార్తికేయ) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అంతకుమించి కిక్‌బాక్సర్. లైఫ్‌ని ఈజీగా తీసుకునే ఆటిట్యూడ్. స్నేహితులతో జీవితాన్ని సరదాగా లాగించేసే ప్లేబోయ్. గాళ్‌ఫ్రెండ్ -స్నేహ (జెబ్బాసింగ్) అతని ఆటిట్యూడ్‌కే పడిపోతుంది. లవ్ చేస్తుంది. దేవా- స్నేహ డేటింగ్ మొదలవుతుంది. ఇద్దరూ గోవా ట్రిప్పుకు రెడీ అవుతారు. ఈ ఫేజ్‌లోనే స్నేహ ఫ్రెండ్ ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవన్సీ) ఎదురవుతుంది. ఆమె అందానికి దేవ చలించిపోతాడు. ఇక్కడే దేవ లవ్ -ఆముక్తవైపు షిఫ్టవుతుంది. తనను స్నేహ ప్రేమిస్తుంది కానీ, స్నేహతో తాను లవ్‌లో లేనని భావిస్తాడు. ఈ సరిపెట్టుకున్న జవాబే -ఆముక్తకు దగ్గరయ్యే ప్రయత్నానికి నాందవుతుంది. ఆముక్త మనసు గెలవడం అంత సులువుగా జరగదు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఫ్లెక్సిబుల్ ఫ్రెండ్ స్నేహ -వాళ్లిద్దర్నీ కలుపుతుంది. ఇక్కడినుంచి ఆముక్త- దేవల లవ్ జర్నీ మొదలవుతుంది.
బెట్టు చేసినంతసేపూ హాయిగా అనిపించిన ఆముక్త -మెట్టుదిగాక బోర్ కొడుతుంది. ప్రతిస్పందన ప్రేమంతా -కండీషన్లమయం అనిపిస్తుంది. అంటే -ఆముక్త చూపించే ప్రేమ తన స్వేచ్ఛను హరిస్తున్నట్టు ఫీలవుతాడు దేవ. వదిలించుకోవాలని అనుకుంటాడు. అర్థం చేసుకున్న ఆముక్త -మరింత దగ్గరయ్యేందుకు ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ మొదలెడుతుంది. అయినా వాళ్ల జర్నీ కుదుపులమధ్యే సాగుతుంటుంది. కష్టం అనుకుంటారు, మనస్పర్థలతో విడిపోతారు. ఈ క్రైసిస్ ఫేజ్‌లో ఎంటరవుతాడు కార్తికేయ బాస్ అరవింద్ (జేడీ చక్రవర్తి). దేవాతో విసిగిపోయిన ఆముక్త -అరవింద్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇదే అదనుగా హిప్పీ కూడా మరో అమ్మాయి (శ్రద్ధాదాస్)వైపు షిఫ్టవుతాడు. సమస్య పతాకస్థాయికి చేరుతోన్న టైంలో ‘కౌన్సిలర్’ అవతారం ఎత్తుతాడు అరవింద్. దేవా- ఆముక్తల మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పడానికి ‘కండిషన్’ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ప్లేబోయ్- డెడికేటెడ్ గాళ్.. ఎలాంటి కండిషన్స్ ఎదుర్కొన్నారు? అవి వాళ్లను కలిపాయా? విడదీసాయా? ప్రాణంలాంటి ఫినిషింగ్‌ను మాత్రం స్క్రీన్‌పై చూడండి.
**
నిజానికి ఇలాంటి ‘లైన్’ ఆడియన్స్ ఎప్పుడో దాటేశారు. ఈ ఫార్ములా చాలా కథల్లో.. చాలా చాలా సినిమాల్లో.. భిన్నమైన కోణాల్లో -రుచి చూసేశారు. అయితే నేటి ట్రెండ్‌కు తగినట్టు తెరకెక్కించే ప్రయత్నమే అనుకుంటూ దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడు. ‘యూత్‌కు తగ్గట్టు’ అన్న భావనలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్‌లు, డబుల్ డోస్డ్ డైలాగులను -కథ కోసం ఏరుకున్నాడు తప్ప ‘సింక్’ చేయడం సాధ్యం కాలేదు. నిజానికి యూత్ అందరిదీ ఇదే ఆటిట్యూడ్ అనుకుని కథను (సూసైడ్ అటెమ్ట్ సీన్) ఎత్తుకోవడమే పెద్ద మైనస్.
ఆర్‌ఎక్స్ 100లో విఫల ప్రేమికుడిగా కనిపించిన కార్తికేయ -ప్లే కమ్ లవర్ బోయ్ క్యారెక్టర్‌తో ఓకే అనిపించుకున్నాడు. ‘... తిరిగి ప్రేమిస్తే నరకమే’ అన్న ఎమోషనల్ పెయిన్ చూపించటంలో మాత్రం ఫెయిలయ్యాడు. గత చిత్రానికి భిన్నమైన రోల్ కనుక -పాత్ర పరిధి మేరకు ఓకే అనుకోవాలి. హీరోయిన్ దిగంగనకు తొలి సినిమా. భాషా సమస్యను అధిగమించి ‘నేటివిటీ ఎక్స్‌ప్రెషన్స్’ పలికించటంలో మెప్పించింది. కథ స్పాన్ పెంచే పాత్రే అయినా -చర్చించుకోదగినంత పరిధి జెజ్బాసింగ్ పాత్రకు లేదు. అందంగానూ, హుషారుగా మాత్రం కనిపించింది. కథను మలుపుతిప్పి క్లైమాక్స్ చేర్చే పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించాడు. సహజంగా జేడీ ఇమేజ్‌కు ఇది ఏమాత్రం సూట్ కాని పాత్ర అనిపించింది. నేను పెళ్లి చేసుకునే మెటీరియల్‌ని కాదంటూనే, ప్రేమ సలహాలు వల్లించే పాత్రలో మెప్పించలేకపోయాడు. డైలాగ్ పరంగా తెలంగాణ యాసలో ఓ కొత్తదనం మాత్రం కనిపించింది. ఇక వెనె్నల కిషోర్ కామెడీ అంతంత మాత్రం. బ్రహ్మాజీ కామెడీ -ఓ ఫలించని ప్రయత్నమే. శ్రద్ధాదాస్ -చిన్న మెరుపు, అంతే.
దర్శకుడు టిఎన్ కృష్ణ విషయానికొస్తే -మొదటి చిత్రం ఇంపాక్ట్ నుంచి పూర్తిగా బయటపడినట్టు లేదు. ‘నువ్వు నేను ప్రేమ’ -(సిల్లును ఒరు కాదల్) అనే ప్రేమ కథను భార్యాభర్తల మధ్య ప్రేమ -అపోహలు కోణంలో చూపిస్తే, ఈసారి ‘హిప్పీ’తో లవర్స్ మధ్య గొడవలు -సమసిపోయాక ప్రేమ అన్న కోణంలో రొమాంటిక్ యాంగిల్‌ని టచ్ చేస్తూ చూపించాడు. ‘రొమాంటిక్’ అన్న ప్రయోగంలోనూ దర్శకుడి భావజాలనే్న దృష్టిలో పెట్టుకోవాలి. క్లాసిక్ టచ్ కంటే కల్ట్ స్ట్రోక్ ఫీల్ కలుగుతుంది. పైగా యూత్ ఆలోచనలను ప్రతిబింబించే కథ అని కూడా పూర్తిగా అనలేం. ఇంతకుమించి దర్శకుడు టిఎన్ కృష్ణ గురించి చెప్పేదేం లేదు. నివాస్ కె ప్రసన్న సంగీతం మైనస్ అయితే, ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ప్లస్. ఒక మైనస్.. ఒక ప్లస్ -సినిమాను బ్యాలెన్స్ చేశాయి తప్ప గట్టెక్కించలేదు. నిర్మాణ విలువల్లో భారీతనం బావుంది.
హీరో సూసైడ్ అటెమ్ట్ సీన్ (విషాదం) నుంచి హుషారైన హిప్పీ కథ మొదలవుతుంది. లవ్‌ట్రాక్.. డిఫరెంట్ స్టేజెస్‌ని ఫస్ట్ఫాలో చూపిస్తే, వదిలించుకోవాలనే సీన్లు, క్లైమాక్స్ ఎపిసోడ్‌ను సెకెండాఫ్‌లో చూపించారు. షాక్‌నిచ్చే ట్విస్టుల్లేని సినిమా. స్క్రీన్‌పై చూపించిందే యూత్ కోరుకుంటున్నారన్న భావన మాత్రం -సినిమాపై ఎక్కువ కనిపించింది.

-ప్రవవి