రివ్యూ

లోడెడ్ స్పైడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పైడర్ మ్యాన్ ** ఫర్వాలేదు
**
తారాగణం: టామ్ హాలెండ్, జెండాయా, శామ్యూల్ ఎల్ జాక్సన్, జెబి స్మూవ్, జాన్ ఫావ్రో, జాకబ్ బాటలాన్, కోబీ స్మల్డర్స్, మరిసా టోమీ, మార్టిన్ స్టర్, జేక్ గిల్లెన్‌హాల్ తదితరులు
సంగీతం: మైఖోల్ గియాచ్చినో
సినిమాటోగ్రఫీ: మాథ్యూ జె లాయిడ్
ఎడిటర్: డాన్ లెబెంటల్
నిర్మాతలు: కెవిన్ ఫీజ్, అమీ పాస్కల్
నిర్మాణ సంస్థలు: కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్, పాస్కల్ పిక్చర్స్
కథ: క్రిస్ మెకన్నా, ఎరిక్ సోమర్స్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాన్ వాట్స్
**
జాన్ వాట్స్. హాలీవుడ్ కుర్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. తీసినవి ఐదో ఆరో సినిమాలు. కానీ -వేటికవే సెనే్సషన్. థ్రిల్లర్‌ని ఇష్టపడే జాన్ వాట్స్ -‘కాప్ కార్’తో బాగా పాపులరయ్యాడు. అదే ఏడాదిలో ‘క్లోన్’ టైటిల్‌తో తెరకెక్కించిన హారర్ సినిమాతోనూ ఆడియన్స్‌ని భయపెట్టాడు. రెండేళ్ల క్రితం -ఇదే సూపర్ మ్యాన్‌ని ‘హోమ్ కమింగ్’ అంటూ చూపించిన వాట్స్ -ఇప్పుడు ‘్ఫర్ ఫ్రమ్ ద హోం’ అంటూ మళ్లీ థియేటర్లకు తెచ్చాడు. సినిమాను తెరకెక్కించటంలో జాన్ వాట్స్‌ది ప్రత్యేకమైన శైలి. ఆ శైలి -ఈసారి ఆడియన్స్‌ని కనెక్టయ్యిందా? ఎలాంటి అనుభూతికి గురి చేసిందో చూద్దాం.
ఇక ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాణ సంస్థల గురించి ముందే చెప్పుకోవాలి. నిజానికి వాటి చరిత్ర హాలీవుడ్ చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్‌కి సుపరిచితమే. సినిమాను మొదలుపెడితే బడ్జెట్‌ను పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతాయి. అవే -కొలంబియా, మార్వెల్, పాస్కల్. అలాంటి మూడు గొప్ప నిర్మాణ సంస్థలు -జాన్ వాట్స్ ఆలోచనల నుంచి పుట్టిన స్పైడర్ మ్యాన్‌కు ప్రాణం పోశాయి.
ఒక మనిషి -అతీత శక్తుల్ని కలిగివుండే ఫిక్షనల్ క్యారెక్టర్లను ఇష్టపడని వారుండరు. బ్యాట్ మ్యాన్, ఐరన్‌మాన్, సూపర్ మ్యాన్.. వీళ్లంతా ఈ కోవలోకే వస్తారు. వయసుతో, జెండర్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు కామన్ ఫ్యానే్స ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇలాంటి ఫ్యాన్స్ కోసమే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈమధ్యే -ప్రపంచవ్యాప్తంగా సెనే్సషన్ సృష్టించిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ అనంతర పరిణామాలే సన్నివేశాలుగా తెరకెక్కించిన చిత్రం ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం’. ఇదే అభిమానుల్లో ఆసక్తి పెంచడానికి కారణమైంది. అలా క్రేజ్ తెచ్చుకున్న ‘స్పైడర్ మ్యాన్’ మెప్పించాడో లేదో చూద్దాం.
పీటర్ పార్కర్ (టామ్ హాలెండ్ -స్పైడర్‌మ్యాన్) తన ఫ్రెండ్స్‌తో కాలేజ్ ట్రిప్‌లో భాగంగా యూరప్ విహారయాత్రకు బయల్దేరతాడు. తను స్పైడర్‌మ్యాన్ అన్న విషయం స్నేహితులకి తెలియనివ్వడు. మిషెల్ (జెండాయా)ను ఇష్టపడే పీటర్ -ఈ టైంలోనే తన ప్రేమను ఆమెకు చెప్పాలనుకుంటాడు. ఇంతలో -నిక్ ఫ్యూరీ (శామ్యూల్ జాక్సన్) పీటర్‌ను పిలిపించి ఓ అసైన్‌మెంట్ ఇస్తాడు. ఇందుకు మిస్టీరియా (జేక్ గెల్లెన్‌హల్) సహాయపడతాడని చెప్తాడు. ఈ అసైన్‌మెంట్‌లో భాగంగానే -పీటర్‌కు ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. పీటర్‌కు నిక్‌ఫ్యూరీ అప్పగించిన అసైన్‌మెంట్ ఏంటి? జెండాయాకు పీటర్ తన ప్రేమను వ్యక్తిపర్చాడా? ఈ రెండంశాల మధ్య ఆసక్తికరంగా సాగే కథను తెరపై చూడాలి.
విహార యాత్రకు బయలుదేరుతున్న పీటర్ పార్కర్ సీన్‌తో సినిమాను ఓపెన్ చేశాడు దర్శకుడు. సూపర్ హీరో కథకు సంబంధమున్న ముఖ్య పాత్రలను క్రమంగా పరిచయం చేస్తూనే -కథలోని బేస్‌పాయింట్‌ను తొలిభాగంలోనే చెప్పేశాడు. ఫన్నీగా సాగిపోతున్న ఈ అంశాలను ఎంజాయ్ చేస్తూనే -అసలు విషయం కోసం ఆడియన్స్ ఎదురు చూసేలా స్క్రీన్‌ప్లే ట్రిక్ ప్లే చేశాడు జాన్ వాట్స్. సినిమాను చూపించటంలో తనదైన భిన్నమైన శైలిని ప్రయోగిస్తూ -పాత్రలను ఆకళింపు చేసుకున్న ఆడియన్స్‌లో నిక్ ఫ్యూరీ పాత్రతో ఆసక్తిని రేకెత్తించాడు. పీటర్ జీవితంలోకి నిక్ ఫ్యూరీ ఎంటరవ్వడం నుంచే కథ బిగింపు మొదలవుతుంది. దీనికితోడు -సముద్రం నుంచి ఓ భయంకరమైన కీటకపు మనిషి ప్రజలపై దాడి చేయడం వంటి సన్నివేశాల్ని ప్రథమార్థంలోనే డిజైన్ చేసి -ఉత్కంఠ రేకెత్తించాడు. కీటకపు మనిషి నుంచి ప్రజల్ని రక్షించేందుకు మిస్టీరియో రావడం, కానీ అతనెవరో స్పైడర్ మ్యాన్‌కు తెలీకపోవడం.. కథలో సస్పెన్స్ మొదలవుతుంది.
ఈ సస్పెన్స్‌లోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన దర్శకుడు -ద్వితీయార్థంలో సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. మిస్టీరియో గురించి పీటర్‌కు ఓ షాకింగ్ విషయం తెలిస్తే, పీటర్ గురించి జెండాయాకు మరో షాకింగ్ విషయం తెలుస్తుంది. దీంతో కథనుంచి బయటకు రాకుండా ఆడియన్స్‌ని కూర్చోబెట్టాడు. సెకెండాఫ్‌ను పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్‌కు కేటాయించిన దర్శకుడు -పీటర్ సీక్రెట్‌ను మిస్టీరియో బయటపెట్టడమే సినిమాకు హైలెట్ అవుతుంది. హాలీవుడ్ టీంకు యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాతో పెట్టిన విద్య కనుక -ఆ పార్ట్‌ను అదరగొట్టేశారు.
స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలెండ్ సినిమాను పూర్తిగా భుజాలపై మోసేశాడు. స్క్రీన్‌పై కనిపించే ప్రతి సీన్‌లోనూ తామే స్పైడర్ మ్యాన్ అన్న అనుభూతిని ఆడియన్స్‌కి కలిగించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తూనే -అందమైన జెండాయాతో సాగే ‘లవ్ ఎపిసోడ్’ ఆకట్టుకుంటుంది. ఇద్దరిమధ్యా కెమిస్ట్రీ బావుంది. మిగిలిన కీలక పాత్రధారులు -సినిమా రేంజ్ ఎక్కడా తగ్గకుండా తమ ప్రతిభను చూపించారు. అతీత శక్తులు కలిగిన ‘స్పైడర్‌మ్యాన్’ క్రేజ్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లి నిలబెట్టాడు దర్శకుడు జేమ్స్‌వాట్. స్పైడర్ మ్యాన్ సాహస విన్యాసాలు, ప్రత్యర్థిని అడ్డుకోవడంలో చూపించే వ్యూహాత్మక తెగింపు ఆడియన్స్‌కి పూర్తిస్థాయి వినోదాన్ని అందించాయి. హాలీవుడ్ సాంకేతిక బృందం గురించి ఎంచి చూపించేదేదీ ఉండదన్నట్టే -మైఖేల్ గియాచ్చినో సంగీతం, మాథ్యూ జె లాయిడ్ సినిమాటోగ్రఫీ, డాన్ లెబెంటల్ కూర్పు సినిమాకు ప్రాణం పోశాయి. ప్రపంచంలోనే కొమ్ములు తిరిగిన మూడు నిర్మాణ సంస్థలు కలిపి నిర్మించిన చిత్రం కనుక -నిర్మాణ విలువలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల్ని ఇష్టపడే యాక్షన్ ప్రియుల్ని స్పైడర్‌మ్యాన్ -పిచ్చెక్కిస్తాడు.

-ప్రవవి