రివ్యూ

బలహీన కథనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథనం * బాగోలేదు

తారాగణం: అనసూయ భరద్వాజ్, ధన్‌రాజ్, రణధీర్, వెనె్నల కిషోర్, సమీర్, జగన్, శ్రీనివాస్ అవసరాల, సంపూర్ణేష్‌బాబు, మారుతి, పెళ్లి పృధ్వీ, జబర్దస్త్ అప్పారావు తదితరులు
సంగీతం: రోషన్ సాలూరు
నిర్మాతలు: బట్టీపాటి నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా
కథ, కథనం, దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల
===========================================================
ప్రేక్షకులు చాలా తెలివైనవారన్న అంచనా ‘కథనం’ చిత్ర బృందానికేమాత్రం వున్నా సినిమా ఇలా తేలిపోయి ఉండేది కాదు. అసలు ఫిల్మ్స్‌కి ఎంత లాజిక్కు అవసరం లేదనుకున్నా కథనంలాంటి థ్రిల్లర్‌కి అది తప్పకుండా ఉండాలి. అలాంటి ఉత్కంఠ విషయంలో ఉపేక్షత వహించడంవల్ల నాదెండ్ల (దర్శకుడు) కృషి రాణించవలసినంతగా రాణించలేదు. వివరాల్లోకొస్తే.. అను (అనసూయ భరద్వాజ్) సినీ రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వుంటూ, అవకాశం వస్తే దర్శకురాలిగానూ మారాలనుకుంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా కథలు రాసుకుని నిర్మాతలకీ, హీరోలకీ చెప్తూ వుంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వయసు మళ్లిన ఓ నలుగురు నిర్మాతలకు కథలు చెప్పడానికి వస్తుంది. వాళ్లు ‘మా దగ్గరే ఓ కథ ఉంది. దాన్ని డెవలప్ చెయ్’ అంటారు. ఆ డెవలప్‌మెంట్‌లో భాగంగా అను సృష్టించిన సన్నివేశాల్లో మాదిరి హత్యా సంఘటనలు జరుగుతాయి. ఇది ఎలా సంభవం? అంటూ అను ఫిర్యాదుతోనే పోలీసాఫీసర్ రణధీర్ (రణధీర్) రంగంలోకి దిగుతాడు. తర్వాతేమైంది అన్నదే ‘కథనం’ కథా కమామీషు. ఇలా వ్యక్తులు రాసుకున్నదే వాస్తవంగా జరగడం, మిస్టరీ ఛేదించడం అన్న ఛాయామాత్రపు తంతులతో గతంలోనూ అటూ ఇటుగా చిత్రాలొచ్చాయి. కానీ ఇందులో వున్న ప్రత్యేకత.. చంపినవారే హత్యలు జరిగాయంటూ కంప్లైంట్స్ ఇవ్వడం, తదనంతర పరిణామాలు. అసలీ మొత్తం వ్యవహారాల్లో పోలీసు శాఖ పరిశోధనా పద్ధతినే అపహాస్యం చేసినట్లయింది. ఉదాహరణకు ఓ ఎస్.పి ర్యాంక్ అధికారి, డాక్టర్, మాజీ కలెక్టరు తదితరులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే దాన్ని చాలా సునాయాసంగా తీసుకుని కేసును క్లోజ్ చేసినట్లు ఇందులో చూపారు. ఎంతగా విధి నిర్వహణలో అలసత్వం జరిగినట్లు అనుకున్నా, ఈ మాదిరి సన్నివేశాల్లో పోలీసుల ప్రతిస్పందన ఇలా వుండనే వుండదు. కనీసం హత్యా నేపథ్యాన్ని స్పృశించినట్లు ఇందులో కనపడలేదు. అలాగే అను తల్లి అరవింద (ఈ పాత్రనూ అనసూయా భరద్వాజే పోషించారు) ఎంతో తెలివైన వనితగా, మొత్తం గ్రామానే్న తన నాయకత్వ పటిమతో ఒక్క త్రాటిపై తెచ్చినట్లు తీర్చిదిద్దారు. మరి అలాంటి క్యారెక్టరు తాను ప్రేమించి పెళ్లాడిన రఘు (శ్రీనివాస్ అవసరాల) కేవలం డబ్బు మనిషి అని గ్రహించలేకపోయిందా? అన్నిటికన్నా అర్థంకాని విషయం, తన ప్రత్యర్థి బృందం కలెక్టరు, ఎస్‌పి, ఎంఎల్‌ఏల పన్నాగాలు పసిగట్టిన అరవింద, వాళ్ళతో జతకట్టిన భర్త విషయాన్ని తెలుసుకోలేకపోవడం. అదేవిధంగా రఘు పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. సినిమా ఆఖర్లో ట్విస్ట్ కోసం తండ్రీ, తల్లినీ, కొడుకుని చంపేసినట్లు చూపారు తప్ప దానికవసరమైన ప్రాతిపదికల్ని చిత్రంలో సరిగ్గా చూపలేదు. ఇక పోలీసు అధికార్లు ఓ విషయం తెలుసుకునేటప్పుడు, అవతలి వ్యక్తి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అలాకాకుండా అను చెప్పిన ఉదంతాలు వినేయడం, తర్వాత ఆమె నేపథ్యం కనుక్కొని తెలుసుకున్నట్లు చూపడం విడ్డూరం. ఈ అంశాన్ని ధృవీకరిస్తూ అనూయే ఓ సందర్భంలో రణధీర్‌తో ‘అంతా తెలుసుకుని వచ్చారన్నమాట’ అనడం ఈ వింతకు పరాకాష్ట. ఇదంతా ఎందుకు ఏకరవు పెట్టాల్సి వచ్చిందంటే, పరిశోధనకవసరమైన ఫండమెంటల్స్‌ని ఎంతగా ఇందులో నిర్లక్ష్యం చేశారో చెప్పడానికే! ఇన్ని లూజెండ్స్‌తో గంటా ఏభై నిమిషాలపాటు తెరకెక్కిన దీంట్లో మసాలాల పేరిట అనవసరపు పాటలకుగానీ, ఇతరేతర విషయాలకుగానీ అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషం. నటీనటుల్లో నిశ్చయంగా అనసూయకే అగ్రతాంబూలం దక్కుతుంది. తల్లి అరవిందగా, కూతురు అనుగా మంచి వేరియేషన్ చూపడానికి ఆమె ప్రయత్నించారు. అయితే గొంతులో కొన్ని కొన్నిచోట్ల మాడ్యులేషన్ పరంగా వస్తున్న హెచ్చుతగ్గుల్ని, ముఖ్యంగా కొన్నిచోట్ల మాట జారిపోతున్న వైనాన్ని సరిచేసుకోవాలి. ప్రత్యేకించి ఇలాంటి అపసవ్యత అరవిందను విలన్ల బృందం చంపడానికి వచ్చిన సందర్భంలో ప్రస్ఫుటంగా కన్పడింది. ఇదేమాదిరి అపశృతి అను పాత్రను ఆఖర్లో కుర్చీకి కట్టేసిన సందర్భంలో పలికిన సంభాషణలప్పుడూ వ్యక్తమైంది. అను స్నేహితుడు ధన పాత్రలో ధన్‌రాజ్‌కు ఇందులో పూర్తిస్థాయి రోల్ దొరికింది. దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. క్రియేటర్ కిషోర్- సి.కెగా వెనె్నల కిషోర్ తనకలవాటైన వన్‌లైన్ పంచ్‌లతో పాత్రను లాగించారు. కానీ ఈ పాత్రకిచ్చిన అండర్‌వేర్ కామెడీ నిడివి ఎక్కువై విసిగించింది. అట్టర్‌ఫ్లాప్ అయిన రెండు పాత చిత్రాల సీడీలతో కొత్త సినిమా కథ చెయ్యచ్చు అన్న ఈ పాత్ర చెప్పిన ఫార్ములా ఇప్పటికే ఫిలిం ఫీల్డులో కొందరు అమలుచేసేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి రిలవెంట్ కామెడీ బాగా పండింది. శ్రీనివాస్ అవసరాల పాత్ర ఉనికిని మాత్రం దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు అనిపించింది. రోషన్ సాలూరు సంగీతం పాటలపరంగా ఒక్కదానికే పరిమితమైంది. ‘చీకటి కొండలో తూరుపు నీవమ్మా’ అన్న ఈ పాట ఓకేగానే వుంది. అయితే చిత్రీకరణను బాగా తీస్తే పాట ఇంకా రాణించేది. ఎంచుకున్న కథా కేంద్రంలో పాయింట్ కొనసాగింపు (కథ కొనసాగించే విధానమే ‘కథనం’ అంటూ ఇందులో నిర్వచించారు కూడా)లో చొప్పించిన అవాస్తవపు సన్నివేశాలవల్లే ‘కథనం’ కుదురు కోల్పోయింది. ‘స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఏ నెవ్వర్ ఎండింగ్ జర్నీ’ అంటూ ఈ సినిమాలో చెప్పినట్లే ‘్ఫల్మ్ మేకింగ్ ఆల్సో ఈజ్ అన్ ఎండింగ్ ప్రోసెస్’ కనుక దర్శకుడు రాజేష్ నాదెండ్ల ఈ తొలి కథనంలో చేసిన పొరపాట్లు మళ్లీ మలి చిత్ర కథనాల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం.

-అన్వేషి