రివ్యూ

ఇంటిలిజెంట్ క్రైమ్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు? *** బాగుంది
***
తారాగణం: అడివి శేష్, రెజీనా నవీన్‌చంద్ర, మురళీశర్మ, పవిత్ర లోకేష్, రాజారవీంద్ర, నిహాల్ కోదాటి
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఆర్ట్: అవినాష్
ఎడిటింగ్: గ్యారీ బి హెచ్
సంభాషణలు: అబ్బూరి రవి
నిర్మాతలు: పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అనె్న
దర్శకత్వం: వెంకట్ రాంజీ
***
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నది -తెలుగు నానుడి. సింపుల్‌గా క్రైమ్ ఫార్మాట్‌లో చెప్తే -ఎవరు? సినిమా. కట్టుకథని కట్టుకథతో తిప్పికొట్టడమనే థ్రిల్లింగ్ ఎలిమెంట్ గేమ్.
2012లో ‘ద బాడీ’ సినిమాతో -క్రైమ్ థ్రిల్లర్‌కు కొత్తకోణాన్ని చూపించాడు స్పానిష్ దర్శకుడు ఓరియల్ పౌలో. అదే దర్శకుడి మైండ్ నుంచి రెండేళ్ల క్రితం ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ టైటిల్‌తో మరో క్రైమ్ థ్రిల్లరొచ్చింది. విమర్శకుల మెప్పుపొందిన ఆ కథతోనే -అనేక భాషల్లో అలాంటి సినిమాలు రూపుదిద్దుకున్నాయి. అలా బాలీవుడ్‌లో ‘బద్‌లా’, టాలీవుడ్‌లో -ఎవరు? వచ్చాయి. కాకపోతే -‘ది ఇన్విజిబుల్ గెస్ట్’కి ‘ఎవరు?’ ఓ సూపర్ ఇంపోజిషన్. రెండు సినిమాల్లో థ్రిల్‌నిచ్చే టూల్స్ ఒకటే అయినా.. పరిచయ క్రమం, నడక విధానం -వైవిథ్యం. అంటే కట్టుకథని కట్టుకథతో తిప్పికొట్టడమనే నేటివిటీకి -అసలు కథను ముడిపెట్టారన్న మాట.
**
ఒకప్పుడు-
పరిమిత బడ్జెట్ సినిమా అనగానే థ్రిల్లరో, హారరో వెతుక్కునే పరిస్థితి. వీటికి ఆడియన్స్ కనెక్టివిటీ పెరగటంతో -స్టార్ హీరోలూ థ్రిల్లర్లను అడాప్ట్ చేసుకున్నారు. ఆ ట్రాక్‌లో ఐదారడుగులు ముందున్నాడు -హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరు?తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ ‘ఇన్విజిబుల్ గెస్ట్’ ఎలాంటి ‘విజిబుల్’ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడో చూద్దాం.
**
స్టోరీ:
ఓ ఇండస్ట్రియలిస్ట్ వైఫ్ -సమీర మహా (రెజీనా). రిసెప్షనిస్ట్ నుంచి సీఇవో స్థాయికి ఎదిగిన గార్జియస్ గాళ్. ఓ ఇన్సిడెంట్‌లో డిఎస్పీ అశోక్ (నవీన్‌చంద్ర)ని చంపేస్తుంది. రేప్‌కి ట్రై చేయటంతో, ఆత్మరక్షణార్థం కాల్చేశానన్నది ఆమె సమాధానం. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా కరెప్టెడ్ పోలీస్ విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) సీన్‌లోకి దిగుతాడు. కేసు నుంచి సమీరను తప్పించేందుకు ముందే డీల్ మాట్లాడుకుంటాడు. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్‌లో దొరికిపోకుండా ఉండాలంటే -యథార్థంగా ఏంజరిగిందో చెబితే.. అందుకు తగినట్టు ప్రిపేరేషన్ చేస్తానంటాడు. జరిగినదంతా చెబుతుంది సమీర. తన దగ్గరున్న ఇనె్వస్టిగేషన్ కథతో కట్టుకథకు పొంతన కుదరడం లేదంటాడు విక్రమ్. నమ్మిస్తూ నిజాలు దాచాలని ఒకరు.. నిజాయితీగా అబద్ధాన్ని నిజం చేయాలని మరొకరు.. మొత్తంగా సిట్యుయేషన్‌ను తమ తమ కంట్రోల్‌లో పెట్టుకోడానికి ఇద్దరూ ట్రై చేస్తారు. మరి -కేసులో ఎవరు నిజం? ఎవరిది నిజం? క్రైమ్‌ని సైతం విస్మయపర్చే స్కెచ్ ఏమిటి? అశోక్‌ని సమీరే హత్యచేసిందా? విక్రమ్ వాసుదేవ్ ఓపెన్ చేసిన వినయ్ వర్మ (మురళీశర్మ) మిస్సింగ్‌కీ, సమీర కేసుకీ సంబంధముందా? క్లైమాక్స్‌కి చేరేసరికి ఎవరు ఎవరుగా మారారు? అసలు క్రైమ్ చేసిందెవరు? ఇన్ని ప్రశ్నలకు అన్ని ట్విస్ట్‌లతో ఇచ్చే ఇంట్రెస్టింగ్ ఇనె్వస్టిగేటివ్ సొల్యూషనే -ఎవరు?
**
ఓరిజినల్ స్క్రీన్‌ప్లేతోనే కథను ఓపెన్ చేశాడు దర్శకుడు వెంకట్ రాంజీ. కాకపోతే, కరెప్టెడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో -్ఫదర్ మిస్సింగ్ కేసు అనబడే ఫ్యామిలీ స్టోరీ తగిలించి ఆడియన్స్ మైండ్‌ని పూర్తిగా క్యాప్చర్ చేసేశాడు. అసలు కథ వదిలేసి, ఫస్ట్ఫా ఫినిషింగ్ వరకూ మిస్సింగ్ కేసుతోనే ఆడియన్స్ ట్రావెలవుతారు. స్క్రీన్ రైటర్ ప్రయోగించిన స్క్రీన్‌ప్లే స్ట్రాటజీ ఇక్కడ బాగా వర్కౌటైంది. ఫస్ట్ఫా ముగుస్తుందనగా.. కట్టుకథను అసలు కథకు కనెక్ట్ చేయడమే ఇంటర్వెల్ బ్యాంగ్‌గా సినిమాపై మరింత పట్టు బిగించాడు. ఇదే అసలు కథ అన్నంత బిగింపు భ్రమలో ఆడియన్స్‌ని కూర్చోబెట్టడం -మాతృకను చూసినోళ్లకూ షాకింగ్ ఎక్స్‌పీరియనే్స. అదే -ఎవరు?కి సక్సెస్ సీడ్.
మాతృకను మిస్సవకుండా -సెకెండాఫ్‌లో ‘ఇన్విజిబుల్’ ఇంటెన్సిటీని కంటిన్యూ చేయటంలో దర్శకుడు మరోసారి తన ప్రతిభ చూపించాడు. మాతృకలోని ముఖ్య ఘట్టాలను డిఫరెంట్ ప్యాట్రన్‌లో స్క్రీన్‌మీద చూపిస్తూనే -రీమేక్ అన్న భావనకు ఆడియన్స్‌ని దూరంగా పెట్టడంలో దర్శకుడి ఇంటిలిజెంట్ కనిపిస్తుంది. ఇలాంటి కథల్లో మాతృకమీద ప్రయోగాలు చేయడం నిజానికి రిస్కే. కాకపోతే తెలుగు నేటివిటీకి కథను తేవడం, గ్రిప్పింగ్‌గా నెరేట్ చేయడానికి చూపించిన తెగింపు -ఎవరు?కి ఎక్స్‌ట్రా ప్లస్సైంది. కన్ఫ్యూజన్ ట్విస్ట్‌ల మధ్య కథను చెబుతూనే -క్లైమాక్స్ టైంకి కథను మాతృక ప్యాట్రన్‌లోకి తేవటంతో ఫినిషింగ్ ట్విస్ట్ బలంగా ఆడియన్స్‌లోకి దూసుకెళ్లింది. దాంతో -కొత్త సినిమా చూసిన అనుభూతి పొందారు ఆడియన్స్.
కథలోని అటెన్షన్‌ను దెబ్బతీసే సీన్లను ఏరిపారేసిన ఎడిటర్ -అవసరానికి మించిన ట్విస్ట్‌లపై కత్తెర పెట్టకపోవడం చిన్న మైనస్. శేష్, రెజీనా మధ్య క్రిస్పీగా సాగే ఇంటిలిజెంట్ టాక్ సినిమాకు కొత్త ఫ్లేవరే. కాకపోతే -కామన్ ఆడియన్‌కి కనెక్టవ్వక పోవడం మరో మైనస్. అయితే, ఈ మైనస్‌లేవీ గుర్తుకురాకుండా -హైనోట్ క్లైమాక్స్ ఆడియన్స్‌ని సంతృప్తిపర్చేసింది.
**
కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను అడవి శేష్ పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. ఇలాంటి పాత్రలు ఇదివరకే స్టార్ హీరోలు చేసినా -శేష్ స్టయిల్ మాత్రం డిఫరెంట్‌గా అనిపించింది. క్లైమాక్స్ సీన్స్‌లో శేష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ -పాత్రకు అదనపు బలాన్నిచ్చింది. పాత్ర కదలిక, సంభాషణల తీరు.. మాతృకలోని లీడ్ క్యారెక్టర్ ఇంపాక్ట్‌ని గుర్తు చేస్తాయి. కాంప్లెక్స్ క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేయటంలో రెజీనా స్టామినా అల్టిమేట్. కట్టుకథను నిజమైన కథగా దర్శకుడు నమ్మించటానికి -నవీన్ చంద్ర పెర్ఫార్మెనే్స దోహదపడింది. మురళీ శర్మ, పవిత్ర లోకేష్, ఆదర్శ్‌వర్మ పాత్రలో నటించిన కుర్రాడు మెప్పించారు. డ్రామాని ఎలివేట్ చేస్తూ, సస్పెన్స్‌ని సస్టెయిన్ చేసిన దర్శకుడి ప్రతిభతో -శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీని వేరు చేసి చూడలేం.
దర్శకుడు వెంకట్ రాంజీ, హీరో శేష్ ద్వయం -సినిమాను పూర్తిగా భుజస్కంధాలపై మోసేశారు. థ్రిల్లర్‌కి సరిగ్గా సరిపోయే స్పాన్‌వున్న క్రైమ్ ఎలిమెంట్ స్టోరీ కావడంతో -ఇద్దరి పనీ సులువైంది. మాతృక ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చూసినవాళ్లకైనా -కొత్త అనుభూతి కలిగించే సినిమా ఎవరు?. స్క్రీన్ రైటర్‌గా మంచి కథలు రాసుకుంటూ, నటుడిగా స్టామినా చూపిస్తోన్న శేష్‌కు పేరు తెచ్చే సినిమా. తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నెత్తికెత్తుకున్నా -ఓ కథను సస్టెయిన్డ్ సస్పెన్స్‌తో చెప్పగలడన్న కోణంలో వెంకట్‌కు మంచి పేరొస్తుంది. ఏ సెంటర్స్, థ్రిల్లర్స్‌ని ఇష్టపడే ఆడియన్స్ సపోర్ట్ -ఎవరు? నిర్మాతకు ఆనందాన్నిచ్చేదే. క్రైమ్ థ్రిల్లర్ కోణంలో ఓ ఇంటిలిజెంట్ ప్లే -ఎవరు?

-విజయ్‌ప్రసాద్