రివ్యూ

ఫలించని ప్రతీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌లీడర్ ** ఫర్వాలేదు
**
తారాగణం: నాని, ప్రియాంక అరుల్ మోహన్, లక్ష్మి, కార్తికేయ, శరణ్య, వెనె్నల కిషోర్, ప్రియదర్శి, బేబీ ప్రాణ్య
సంగీతం: అనిరుథ్
కూర్పు: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెకో
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి, మోహన్
దర్శకుడు: విక్రమ్ కె కుమార్
**
300 కోట్ల దోపిడీ.
ఆరు హత్యలు.
రెంటికీ కారకుడైన విలన్
వాడిపై -ఐదుగురు బాధిత మహిళల పగ.
యాక్షన్ రివేంజ్‌కు -ట్రూ కాపీ రాసే నవలా రచయిత.
ఈ ముడిసరుకుతో కథల్లుకోమంటే -ఆడియన్స్ ఊహాకు రెక్కలొచ్చేస్తాయి. శక్తికొలదీ చూసిన సినిమాల అనుభవంతో ఎవరికి నచ్చిన జోనర్‌లో వాళ్లు కథల్లేస్తారు. ఈ ముడిసరుకుతోనే దర్శకుడు విక్రమ్ కె కుమార్ కథల్లుతున్నాడంటే మాత్రం -ఆడియన్స్ మైండ్‌లోకి ‘ట్వెంటీ ఫోర్’ ఫ్రేమ్స్‌లో మనం, ఇష్క్‌లాంటి కథలు దొర్లాడతాయి. ఆ కథకు నేచురల్ స్టార్ నాని హీరో అనగానే -హిట్టు స్టోరీకి ఫిట్టు కాంబినేషన్ అనేసుకుంటాం. నానీస్ గ్యాంగ్‌లీడర్ విషయంలో ఇదే జరిగింది. సైలెంట్‌గా సినిమా రెడీ అయిపోయాక -బయటికొచ్చిన ట్రెయిలర్ చూసి ఆడియన్స్ ‘యస్.. మనం కరెక్ట్’ అనేసుకున్నారు.
కథ: పాప నుంచి బామ్మ వరకూ.. మూడు జనరేషన్స్‌లోని ఐదుగురు ఆడాళ్లకు కామన్ ఎనిమీ ఉంటాడు. అజ్ఞాత శత్రువుపై పగ తీర్చుకోవడమే -తమకు జరిగిన అన్యాయానికి ప్రతి న్యాయమన్నది గ్యాంగ్ లక్ష్యం. అందుకు తగిన ప్రతీకార వ్యూహాన్ని రచించగల ‘హీరో’గా పెన్సిల్ పార్థసారథిని గుర్తిస్తారు. అజ్ఞాత విలన్‌ని ఈ గ్యాంగ్‌లీడర్ ఎలా అనే్వషించాడు? ఎలా అంతమొందించాడు? ఇదీ కథ. సీరియస్ స్టోరీని కితకితల కథనంతో చెప్పడానికి దర్శకుడు ప్లే చేసిన ట్రిక్ -పెన్సిల్ పార్థసారథి. హాలీవుడ్ సినిమాలకు ట్రూ ట్రాన్స్‌లేషన్‌తో కొత్త అర్థాన్ని కనిపెట్టి, రివేంజ్ నవలలు రాసే పాత్రగా ‘పెన్సిల్’ను సెట్ చేయడమే -స్టోరీ ఫ్లేవర్ మారిపోయింది. స్టోరీకి అద్భుతమైన సెటప్ కుదిరింది. ప్రతీకారంతో రగిలిపోతున్న గ్యాంగ్‌ను వెనకేసుకుని -విలన్ పని’పట్టడానికి ‘కాపీ’రైటర్ చేసే హంగామా ఫస్ట్ఫాకి ప్రాణం పోసింది.
మారిన కథా గమంనలో -‘విలన్ వీడే’నన్న విషయం ఆడియన్స్‌కి అర్థమయ్యాక.. లాజిక్కుకు అందని హీరోయిజాన్ని భరించటం కష్టమైంది. దర్శకుడిగా కథ చెప్పడంలో విక్రమ్‌కుమార్‌కి ఓ వాలుంటుంది. పాత్ర స్వభావ సాంధ్రతను పెంచుకుంటూ పోవడం ముందు సినిమాల్లో కనిపిస్తుంది. ఈసారీ అలాంటి అవకాశమున్నా -క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయటంలో జరిగిన పొరబాటు కంటెంట్‌ను దెబ్బతీశాయి. తేలికపాటి రచయితగా పరిచయమైన నాని -పోలీసులు సైతం కనిపెట్టలేని కర్కోటకుడిని టక్కు టమార ట్రిక్కులతో కనిపెట్టేయడం లాజిక్‌కు అందని అంశం. షేడ్స్ మారిపోతున్నా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల నాని హీరో కనుక -ఇంటర్వెల్ వరకూ అనుమానాల్ని బుర్రలోకి రానివ్వకుండా ముందుకెళ్లిపోతాం. ముసుగు తొలగిన విలన్ మోటివ్ తెలిశాక, అతని స్టేటస్ ఎంత గొప్పదో అనుభవంలోకి వచ్చాక.. -ఆడియన్ షాక్ తినాలి. ఆ ఫీల్ ఎంతమత్రం అందలేదు. పైగా గ్యాంగ్ అప్రోచ్‌పై ఆడియన్స్‌లో ఉత్కంఠ రేకెత్తలేదు కూడా. తనపై పగబట్టిన గ్యాంగ్ స్కెచ్ తెలుసుకున్న ప్రతినాయకుడు -ఎంతమాత్రం ప్రతిఘటించడు. సొంత మనుషులనే విచక్షణ లేకుండా చంపేస్తే కర్కోటకుడు -గ్యాంగ్‌ని ఏంచేస్తాడోనన్న భయం ఆడియన్స్‌లో ఏకోశానా కలగదు. ప్రతినాయకుడిని అందమొందించటం కథానాయకుడి వీర లక్షణమన్నట్టు -రొటీన్ ట్రాక్‌లోకి వచ్చేస్తాడు హీరో.
లైటర్ వీన్‌లో కథను మొదలుపెట్టి థ్రిల్లింగ్‌గా కథను ముగించాలన్న ఫార్మేషన్ -గ్యాంగ్‌లీడర్‌కు వర్కౌట్ కాలేదు. కాపీ కథలు రాసిన అనుభవంతోనైనా ‘కాపీ ఇంటిలిజెన్సీ’ని హీరో అడాప్ట్ చేసుకునివుంటే కథ మరోలా ఉండేది. ‘గ్యాంగ్’ అన్న కట్టుబాటుకి తలొగ్గి -హీరో హీరోయిన్లకు స్పేస్ ఇవ్వకపోవడంతో ‘రొమాన్స్‌కీ, రొమాంటిక్ సాంగ్స్’కీ తావులేకుండా పోయింది.
పెన్సిల్ పార్థసారథిగా నాని సినిమాను పూర్తిగా మోసేశాడు. అతని టైమింగ్, టాలెంట్ సినిమాకు పూర్తిగా ప్రాణమైంది. సీనియర్ ఆర్టిస్టులు లక్ష్మీ, శరణ్య, విలన్‌గా కార్తికేయ, గుంపులో ప్రత్యేకంగా ప్రియాంక -సినిమాకు ఫ్లస్సయ్యారు. వెనె్నల కిషోర్ కామెడీ ఓకే. అనిరుథ్ నేపధ్య సంగీతం, కూబా సినిమాటోగ్రఫీ బావుంది. మైత్రీ ప్రాడెక్ట్ కనుక క్వాలిటీకి వంకపెట్టలేం. సెకెండాఫ్‌పై కాస్త కసరత్తు జరిగివుంటే -గ్యాంగ్‌లీడర్ నవ్వులకే పరిమితమయ్యేవాడు కాదు. పడిపోతున్న సినిమాను నిలబెట్టగలిగే నాని స్టామినా చూడాలంటే -గ్యాంగ్‌లీడర్ చూడొచ్చు.

-‘వి’