రివ్యూ

ఆపరేషన్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ** ఫర్వాలేదు
**
తారాగణం: ఆది సాయికుమార్, అబ్బూరి రవి, అనీల్ కురువిల్ల, కార్తీక్ రాజు, మనోజ్ నందం, పార్వతీశం, సాషా చైత్రి, నిత్యా నరేష్, నరేష్.
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కెమెరా: జైపాల్‌రెడ్డి
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.
నిర్మాతలు: ప్రతిభ అడవి, పద్మనాభరెడ్డి, ఆశిష్‌రెడ్డి, కేశవ్‌స్వరూప్
దర్శకత్వం: అడివి సాయికిరణ్
**
ఒక దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఏ విషయాన్నైనా శిక్షించేలా వున్నా అదే శిక్షార్హమైన నేరం చేసిన భారత సైన్యాధిపతిని శిక్షించడం ఎంతవరకు సహేతుకమైన నిర్ణయం? ఓ ఉగ్రవాదిని ఉపేక్షించడం ఎంత నేరమో దేశం కోసం ప్రాణాలను ఒడ్డి ఉగ్రవాదులను ఏరేస్తున్న దేశభక్తులైన కమెండోలను గౌరవించాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆపరేషన్ గోల్డ్ఫిష్ చిత్రం. పొరుగుదేశం నుండి వచ్చిన ఉగ్రవాది దేశంలో మతకలహాలు సృష్టించి ఎంతోమందిని ఊచకోత కోసినా చివరికి దేశం అతన్ని చెరసాలలో వుంచి రక్షించడం ఎంత తప్పో, అదేవిధంగా దేశంకోసం ఉగ్రవాదులను ఎదుర్కొని ఆ యుద్ధంలో విజయం సాధించిన సైనికులకు మనం ఇచ్చే గౌరవం ఎలా వుండాలి అని చెప్పేవిధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథలోకెళితే...
విదేశీ ఉగ్రవాది ఘాజీబాబా (అబ్బూరి రవి) కాశ్మీర్‌లో జొరబడి అక్కడి పండిట్లన ఊచకోత కోస్తాడు. మిగిలినవాళ్లు ప్రాణభయంతో పారిపోవలసిందిగా హుకుం జారీ చేస్తాడు. మిగిలినవాళ్ళను చంపడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. కాశ్మీరీ పండితుడైన అర్జున్ పండిట్ (ఆది సాయికుమార్) తల్లిదండ్రులను కూడా ఘాజీ బాబా అంతమొందిస్తాడు. అలా అతని అకృత్యాలు 20 ఏళ్ళు సాగాక ఓ విధ్వంసం సృష్టించడానికి హైదరాబాద్ వస్తాడు ఘాజీ బాబా. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా ఎన్‌ఎస్‌జి కమెండో అయిన అర్జున్ పండిట్ తెలుసుకొని ఓ ఆపరేషన్ ద్వారా అరెస్టు చేస్తాడు. ఇహ అక్కడినుంచి ఉగ్రవాదులు ఘాజీబాబాను విడిపించడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అనేది సినిమా కథనం. సెంట్రల్ మినిస్టర్ శర్మ (రావు రమేష్) కూతురును కిడ్నాప్ చేసి తద్వారా ఘాజీ బాబాను విడిపించాలని ఉగ్రనాయకుడు ఫారూక్ (మనోజ్ నందం) సన్నాహాలు చేస్తాడు. ఈ విషయాన్ని కూడా గుర్తించిన అర్జున్ పండిట్, శర్మ కూతురిని కాపాడడానికి ఆమెకు తెలియకుండానే సెక్యూరిటీని ఏర్పాటుచేస్తాడు కాలేజీలో. ఈ విషయం తెలియని విద్యార్థులు కార్తీక్ (కార్తీక్ రాజు), సాల్మన్ (పార్వతీశం), తాన్య (సాషాచైత్రి) కేంద్ర మంత్రి కూతురైన నిత్య (నిత్యా నరేష్)తో స్నేహం చేస్తారు. ఇక అక్కడినుండి కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతోనే సగం చిత్రం పూర్తవుతుంది. నలుగురు విద్యార్థులు కలిసి వైజాగ్ అరకుకు వెళతారు. ఈవిషయాన్ని గుర్తించిన ఫారూక్ తన బృందంతో నిత్యను కిడ్నాప్ చేయడానికి వస్తాడు. నిత్యను రక్షించడానికి అర్జున్ పండిట్ తన కమెండోలతో వస్తాడు. అరకు అందాలు, కొండలమధ్య ఈ మూడు గ్రూపులు దాడుగుమూతలతో సాగిన సన్నివేశాలు చివరికి క్లైమాక్స్‌కు వస్తాయి. చివరిలో ఘాజీబాబాను ఫారూక్ బృందం విడిపించుకుందా? విడిపించుకుంటే అర్జున్ పండిట్ ఏం చేశాడు అనే ఆసక్తికర ముగింపును దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు.
ఆర్టికల్ 370ని దృష్టిలో పెట్టుకుని ఈ కథను చక్కగానే అల్లుకున్నారు. కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం కానీ అది పాకిస్తాన్‌లో కలిసిపోవాలని, భారతదేశం అంతా ఒకేమతం ఉండాలని ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని చెప్పే ప్రయత్నం ఈ సినిమా చేసింది. 1990లో కాశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయాలు, దేశ విభజన సమయంలో జరిగిన ఘోరాలు పునాదిగా చేసుకొని సన్నివేశాలను తీర్చిదిద్దుకోవడంలో రచయిత, దర్శకుడి శైలి బాగుంది. ఎన్‌ఎస్‌జి కమెండోలు తమ కుటుంబాలను కోల్పోయినా ఆత్మస్థైర్యం వదలకుండా ఉగ్రవాదులపాలిట యమదూతల్లా మారి వారిని ఏ విధంగా వేటాడుతున్నారు అనే విషయాన్ని కూడా అక్కడక్కడా చర్చించే ప్రయత్నం చేశారు. ఉగ్రవాదానికి మూలం ఎక్కడుందో దాన్ని తొలగించాలి కానీ, ఉగ్రవాదాని అంతమొందిస్తే సరిపోదని చెప్పిన తీరు బాగుంది. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు కథమీద వున్న క్లారిటీ పట్టుతో చక్కగా తీర్చిదిద్దారు. ఇక నటీనటులలో లవర్‌బాయ్‌గా కనిపించే ఆది సాయికుమార్‌లో మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సెటిల్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చి తాను ఇలాంటి పాత్రలకు ప్రూవ్డ్ అన్నట్టుగా నటించారు. మరొక నటుడు అనీష్ కురువిల్లా కూడా తానేం తక్కువ కాదన్నట్టు నటించాడు. ఫారూక్‌గా మనోజ్ నందం, ఘాజీ బాబాగా అబ్బూరి రవి మార్కులు కొట్టేస్తారు. కార్తీక్‌రాజు, పార్వతీశం, సాషాచైత్రి పాత్రలకు తగిన విధంగా చేశారు. నిత్యా నరేష్ పాత్రే సినిమాకు ఆయువుపట్టు. మొదటినుండీ ఆ పాత్రపై ప్రేక్షకుడి దృష్టిని పడనీయలేదు. చివర్లో ఇచ్చిన మలుపు బాగుంటుంది. రావురమేష్ కనిపించేది మూడే సన్నివేశాలైనా తనకలవాటైన పద్ధతిలో నటించాడు. ఒకవైపు కాశ్మీర్‌ను, మరోవైపు అరకు కొండల అందాన్ని చిత్రంలో పట్టే ప్రయత్నం చేశారు జైపాల్‌రెడ్డి. పాటలు క్యాచీగా లేకపోయినా ఆర్‌ఆర్ మాత్రం శ్రీచరణ్ పాకాల ఓకె అనిపించాడు. యుద్ధంలో గెలుపుకన్నా ప్రాణం విలువైనది కాదు అన్న మాటలు అక్కడక్కడా మెరుస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వ పరంగా ఓ మంచి పాయింట్‌ను ప్రేక్షకుడికి బాగా అర్థమయ్యేలా అందించడంలో సాయికిరణ్ అడవి సఫలీకృతుడైనాడు.

-జి.ఆర్.ఆర్.