రివ్యూ

రోసం లేని మీసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పరా మీసం * బాగోలేదు
*
తారాగణం: శ్రీవిష్ణు, నిక్కీతంబోలి, నవీన్, రోహిణి, శ్రీకాంత్ అయ్యర్, బెనర్జీ, భాను తదితరులు
కెమెరా: సిధ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: రిజ్వాన్
రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్
*
వైవిధ్యమైన సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. ఆ విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండా చేసిన సినిమా -తిప్పరా మీసం. దానివల్ల దర్శకుడు కృష్ణవిజయ్ తెరపై తిప్పిన ఏ సీన్‌కీ క్లారిటీలేక ఆద్యంతం నిరుత్సాహపర్చింది.
చిన్నతనంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన మణిశంకర్ (శ్రీవిష్ణు)ని తల్లి లలిత (రోహిణి) రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పిస్తుంది. ఆ సంఘటనతో తల్లిపై కసి పెంచుకుంటాడు మణి. సంస్కరణ కేంద్రం నుంచి పారిపోయి.. ఓ హోటల్‌లో డీజే అవుతాడు. అక్కడ -క్రికెట్ పందాలు కాస్తూ బుకీ జోసఫ్‌కి 30లక్షలు బాకీ పడతాడు. అమ్మని ఆ సొమ్మడుగుతాడు. ‘అంత ఇవ్వలేను. 5 లక్షలే ఇవ్వగలను’ అంటూ చెక్కు ఇస్తుంది. చెక్కులోని 5 లక్షల్ని 40 లక్షలుగా మార్చి బ్యాంకులో వేస్తే బౌన్స్ అవుతుంది. దాంతో తల్లిపైనే కోర్టులో కేసు వేస్తాడు. ‘మేము సెటిల్ చేసుకుంటాం’ అని కోర్టుకు చెప్పిన తల్లి, ఆ మొత్తాన్ని మణికి ఇచ్చేస్తుంది. తర్వాత మణి ఓ హత్య కేసులో చిక్కుకోవడంతో -ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. నిజానికి మణి హంతుకుడు కాకున్నా -ఎవరికోసం నేరం ఒప్పుకున్నాడు. అసలు మీసం ఎందుకు తిప్పాడు? అన్న ప్రశ్నలకు సమాధానంతో రెండున్నర గంటలకు పైగా సినిమా సాగుతుంది. ఇదొక వైవిధ్యమైన సినిమాగా చిత్రబృందం చెప్పుకుంది. సినిమాలో లెక్కలేనన్ని లోపాలుండటమే -వాళ్లు చెప్పిన వైవిధ్యమైవుండొచ్చు. కొన్నిటిని చూద్దాం.
రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్చడమే -తల్లిపై మణి కసి పెంచుకోడానికి కారణంగా చూపించారు. అయితే పునరావాస కేంద్రంలో చూపించిన సంస్కరణా విధానాలే వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. కాళ్లూ చేతులు కట్టేయడం అన్నది వ్యక్తి పారిపోకుండా ఉండటానికే అనుకున్నా, దారుణంగా కొట్టినట్టు చూపించే సన్నివేశంతో కనెక్టవ్వలేం. అది -పునరావాస కేంద్రమా? పోలీసు ఇనె్వస్టిగేషన్ (్థర్డ్ డిగ్రీ స్థాయిలో) కేంద్రమా? అన్న అనుమానం కలగకమానదు. మరోరకంగా చూస్తే.. రిహాబిలిటేషన్‌కు తరలించే సమయానికి మణి మెచ్యూర్డ్ వయసుకొచ్చాడు. అంతకుముందు మాటెలావున్నా, అప్పుడతన్ని మామూలు స్థితికి రప్పించడానికి అనువైన మార్గాలున్నాయి. వాటివైపు వెళ్లకుండా టార్చర్‌లాంటి అసహజ సన్నివేశాలను రిహాబిలిటేషన్ సెంటర్స్ పంథాలో చూపడం కేవలం కథ నడపడానికే అన్నట్టుంది.
ఇక కాళిని చంపాడన్న అభియోగంలో నిందితుడే నేరాన్ని అంగీకరించినందుకు ఐపీసీ 302 కింద ఏడేళ్లు జైలుశిక్ష విధించారు. సెక్షన్ 302లో మరణశిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధిస్తారు తప్ప, సినిమాలోలా సాధారణంగా ఏడేళ్ల జైలు విధించటం ఉండదు.
అలాగే చెక్ బౌన్స్ కేసులో బ్యాంకుకు లలిత -తాను ఐదు లక్షలకే చెక్కు ఇచ్చానని చెప్పింది. అలాంటప్పుడు అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఫోర్జరీ అయిన చెక్కులను సులభంగా కనిపెట్టొచ్చు. వాటిని బ్యాంకులు అనుసరిస్తాయి కూడా. ఇలాంటి క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించకుండా సన్నివేశాల్ని ఎలాపడితే అలా కల్పించడం దర్శకుని విభిన్న శైలి అనుకోవాలా? అశ్రద్ధ అనుకోవాలో అర్థంకాదు. ఇక సత్ప్రవర్తన పేరిట ఏ ఖైదీకీ ఉన్న ఏడేళ్ల శిక్షలో రెండేళ్లు తగ్గించడం జరగదు. అందులోనూ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఖైదీపట్ల అంత రాయితీ ఉండడానికి అవకాశాలు బహుతక్కువ. ఇంకోవిధంగా చూసినా కేవలం ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సూదిరెడ్డి నారాయణరెడ్డి తెచ్చిన కేష్ షీట్, నిందితుడు ఒప్పుకున్నాడన్న కారణంగా శిక్షనువేయరు. అదీకాకుండా అప్పుడే డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన పోలీసు ఆఫీసర్ వౌనిక (నిక్కీ తంబోలి) ‘నీ కేసు స్టడీ చేశాను. నువ్వు హత్య చేయలేదనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మూడో మనిషి ఆ సమయంలో ఉన్నారు’ అన్న అనుమానం కూడా వ్యక్తం చేసినట్టు చూపారు. కేసులో శిక్ష ధృవీకరించేటపుడు సంబంధిత న్యాయమూర్తి కూడా క్షుణ్ణంగా విషయాన్ని అధ్యయనం చేస్తారు. అలా స్టడీ చేసినపుడు వౌనికకు వచ్చిన అనుమానాలే జడ్జీకీ వస్తాయి. ఇవేవీలేకుండా కోర్టు శిక్ష వేయదు. వీటన్నిటిని కన్వీనియంట్‌గా దర్శకుడు కృష్ణవిజయ్ కనుమరుగు చేసేశాడు. ఇంతకుముందు నా గెలుపుకోసం మీసం తిప్పాను. ఇపుడు మంచి గెలవడం కోసం మీసం తప్పుతున్నాను లాంటివి టైటిల్ జస్ట్ఫికేషన్ చేసిన ప్రయత్నాలూ ఫలవంతం కాలేదు. మణిశంకర్‌గా శ్రీవిష్ణు తనకలవాటైన ధోరణిలో మరోమారు నటించారు. లలితగా రోహిణి మాత్రం చాలా సమర్థతతో పాత్రను చేశారు. కానీ కథలో సమర్థనీయ అంశాలుంటే ఇది ఇంకా గుర్తింపుకొచ్చేది. హీరోయిన్ నిక్కీ తంబోలికిచ్చిన వౌనిక పాత్ర పరిమితమైంది. హీరో చెల్లెలు పల్లవి పాత్రలో నటించిన నటి బాగా నటించింది. కానీ ఆమే కాళిని చంపినట్టు చూపడానికి పెట్టిన సన్నివేశం, కారణాలూ సరిగ్గా కుదరలేదు. హీరో ఫ్రెండ్ కాకి పాత్రే కాస్త సినిమాలో రిలీఫ్. దాన్ని ఆ నటుడు చక్కగా వినియోగించుకున్నాడు. ‘మనిషి క్యారెక్టర్‌ను బూతద్దంలో చూపగలిగేది డబ్బు మాత్రమే’ అన్న డైలాగు బాగుంది. ‘నువ్వు మోషన్‌నైనా ఆపుకోగలవు. కానీ ఎమోషన్‌ని ఆపుకోలేవు’ అన్నాడు. సంభాషణాపరంగా ఓకె అయినా అది హీరోనుద్దేశించి అనడం సరిగ్గా లేదు. ఎందకుంటే సినిమా కేంద్ర వస్తువే చిత్ర నాయకుడికి ఏ ‘ఎమోషన్స్, సెంటిమెంట్స్’ లేవనే కదా! మరోచోట ‘వీడు బయట బానే పోరాడాడుకానీ లోపల ఎలా పోరాడతాడో’ అని ఓ జంటనుద్దేశించి కాకి పాత్రతో అనిపించడం అనవసరం. అలాగే కాళితో వచ్చిన ఓ కాల్‌గర్ల్‌ని ఉద్దేశించి ‘నీ పెర్‌ఫార్మెన్స్ బావులేదేమో’నన్న కారణంతో నీకివ్వాల్సిన డబ్బు తగ్గింది అనిపించడమూ మంచి అభిరుచిగా అన్పించలేదు. సురేష్ బొబ్బిలి రాగాల్లో ‘వౌన హృదయరాగాన’ అన్నది గాయని రంజని బాగా ఆలపించింది. అందులో ‘నాడు వరం నేడు రణం’ అన్న పదప్రయోగం బాగుంది. ఒకచోట నాయకుని మనఃస్థితికి అనుగుణంగా ‘రెస్ట్‌లెస్’ అని స్లోగన్‌వున్న కాస్ట్యూమ్‌ని వాడటం రిలెవెంట్‌గా వుంది. నైట్ సన్నివేశాలకు కావాల్సిన ఎఫెక్టును సిధ్ కెమెరా బాగా కాప్చర్ చేసింది. ముందు టైటిల్ అనుకుని తర్వాత కథే లేని కథతో సినిమా ప్రొసీడైనట్టు అనిపించిన కారణంగా ‘తిప్పరా మీసం’ ఎంతగా తిప్పినా ప్రయోజనం లేకపోయింది.

-అన్వేషి