రివ్యూ

మాటున ఉన్నది..ఓ మంచి సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** జాను
***
తారాగణం: శర్వానంద్, సమంత, వెనె్నల కిషోర్, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేష్, రఘుబాబు, వర్షబొల్లమ్మ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: మహేంద్రన్ జయరాజు
అడిషినల్ డైలాగ్స్: మిర్చి కిరణ్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: సి ప్రేమ్‌కుమార్
***
మాటున ఉన్నది/ ఓ మంచి సంగతి...
-దాన్ని బయటకు తీశాడు దర్శకుడు సి ప్రేమ్‌కుమార్. భాషలో చెప్పలేని భావాన్ని దృశ్యంలోకి అనువదించి చూపించాడు. అది తమిళంలో ‘96’ కావొచ్చు. జాన తెలుగులో ‘జాను’ అని సంబోధించొచ్చు. ఈ కథకు మూలమైతే అదే. కొన్ని భావోద్వేగ జ్ఞాపకాల దొంతర అంతే! ఇదొక ప్రేమ కథ అంటే నేరం చేసినవాళ్లవుతాం. చిన్ననాటి స్నేహితుల జర్నీ అన్నా -మనస్ఫూర్తిగా ఒప్పుకోలేం. ఇందులో నచ్చే విషయమేదో ఉంది. అది -ఇదీ అనైతే చెప్పడానికి మనస్కరించదు. అందుకే -ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేకంటే -సైలెంట్‌గా వెళ్లి చూసి ఫీలైతే అదే బావుంటుంది. కాకపోతే భాష పరిధి.. పదాల్లోని గాఢత.. కాలమాన పరిస్థితుల ప్రభావం.. మాతృకకివ్వాల్సిన గౌరవంలాంటి కోణాల కారణంగా తమిళం కాస్త ఎక్కువ, తెలుగు కాస్త తక్కువ అనిపించొచ్చేమో.
**
సినిమాకు వచ్చేవాళ్లంతా కర్చ్ఫీలు తెచ్చుకోండి -అంది ప్రమోషన్స్ టైంలో సమంత. సరదాగా చెప్పిందో, తను ఫీలైన మ్యాజిక్ ప్రభావంతో చెప్పిందో కానీ -సినిమా కంటతడి పెట్టించింది. కాదు, కథ మనసు లోతుల్లోకి ఇంకిపోయి తేమ కళ్లలోకి తేలింది. అలాంటి సన్నివేశాలు స్క్రీన్‌మీద కనిపించిన ప్రతిసారీ -కళ్లు తుడుచుకోడానికి చొక్కా మడతో, చున్నీ కొసరో కావాలనటంలో తప్పైతే లేదు. తమిళ ‘96’ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే.. నిర్మాత దిల్‌రాజు సారథ్యంలో ‘జాను’గా -శర్వానంద్, సమంతలతో కథ చెప్పాడు. అదీ ఇలా..
ట్రావెల్ ఫొటోగ్రాఫర్ రామచంద్ర (శర్వానంద్). లైఫ్ జర్నీలో భాగంగా టెన్త్ చదివిన విశాఖకు వస్తాడు. చదువుకున్న స్కూల్‌కి వెళ్తాడు. పాత జ్ఞాపకాలను తవ్వుకుంటాడు. ఆ జ్ఞాపకాల్లో అందమైన ‘ఇష్టం’ జాను (సమంత). స్నేహితులకు ఫోన్లు చేస్తాడు. రీ యూనియన్ ఫంక్షన్‌కు పూనుకుంటారు. అక్కడికి జాను వస్తుంది. ఇదీ -్ఫజికల్ స్టోరీ. జ్ఞాపకల్లో పదిలంగా ఉండిపోయిన జాను ఫ్రెండా? ప్రేమా? అంతకంటే ఎక్కువా? అసలు ఎవరామె? రామచంద్ర మనసులోని జాను కథేంటి? జ్ఞాపకాలను దాటొచ్చి ఇద్దరూ వర్తమానంలో కలిస్తే...? ఇదే మ్యాజిక్. ఇదే సినిమా. అదే -జాను.
మాతృకను మళ్లీ సృష్టించటం అంత సులువు కాదు. నిజానికి సాధ్యం కాదు. ఇక్కడా సాధ్యం కాలేదు. ‘96’ని మళ్లీ చూస్తున్నామన్న భావనే కలిగింది తప్ప, ‘96’ చూస్తున్న ఫీల్ రాలేదు. కాకదోతే ‘్భవం.. భావోద్వేగం’ అదే కనుక -రీమేక్ పదాన్ని మైండ్‌లోంచి డిలీట్ చేసేసి చూస్తే మాత్రం -జానుని ఇష్టపడతాం రామ్‌లా. అలా ఇష్టపడాలంటే మాత్రం -కంపారిజన్స్‌ని పూర్తిగా వదిలేయాల్సిందే.
దిల్‌రాజు జడ్జిమెంట్‌పై నమ్మకంతో చేశానన్నాడు హీరో శర్వా. నిజమే -దిల్‌రాజు కరెక్ట్‌గానే జడ్జి చేశాడు. నువ్వు పుట్టించిన దాన్ని మళ్లీ నువ్వే ఆవిష్కరించు’ అంటూ రీమేక్‌నూ ప్రేమ్‌కుమార్ చేతిలో పెట్టాడు. అతనికి శర్వా, సమంతలను ఇచ్చాడు. దిల్‌రాజు చేసిన ఈ రెండే -మళ్లీ మ్యాజిక్‌కు కారణమయ్యాయని బలంగా చెప్పొచ్చు.
జాను -ఎవరైనా రిలేట్ చేసుకోగలిగే ‘ఇష్టమైన’ కథ. నిన్నటితరంలో స్కూలింగ్ పూర్తిచేసిన వాళ్లయితే ఎమోషనల్‌గా కనెక్టవ్వడం ఖాయం. ఇద్దరి పాత్రల మధ్య ‘రిలేషన్’కు ఫ్రేమ్ పెట్టకుండా చూస్తే (దర్శకుడి ఉద్దేశం కూడా అదే అయివుండాలి) -వాటిలోని స్వచ్ఛత హృదయాల్ని బరువెక్కిస్తుంది. ఆ గాఢత కళ్లను తడిపేస్తుంది. చిన్న మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఇద్దరూ విడిపోవడం -చెరో దిశగా ఇద్దరి జీవితాలు ప్రయాణం చేయడం ఈ తరానికి కాస్త నాటకీయం అనిపించినా.. నిన్నటి తరానికి మాత్రం రియలిస్టిక్‌గానే అనిపిస్తుంది.
దర్శకుడి భావుకతను తెరపైకి తేవడానికి అతను ఎంచుకున్న టీం పర్ఫెక్ట్ అనిపించింది. ఆర్టిస్టుల కోణంలో ప్రధానంగా శర్వా, సమంత, టెక్నికల్‌గా గోవింద్ వసంత, మహేంద్రన్ జయరాజు ముఖ్యులుగా కనిపించినా -లైట్ బోయ్ నుంచి లెన్స్ అందించేవాడి వరకూ సినిమా కోసం ప్రాణం పెట్టారన్న భావన కలిగించింది.
ఇలాంటి చిత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే -అంత గౌరవాన్ని ఇచ్చిన వాళ్లవుతాం. సెక్స్‌ని తారాస్థాయిలో చూపించే సినిమాలు ఎప్పుడూ వస్తున్నట్టే.. సెన్సిబిలిటీస్‌ని పీక్స్‌లో చూపించే సినిమాలు అప్పుడప్పుడే వస్తాయి. సో, అలాంటి వాటిగురించి లోతుల్లోకి చర్చించి అగౌరవపర్చేకంటే -ఓ సంస్కారవంతమైన సినిమాగా గుండెల్లో పదిలం చేసుకోవడం మంచిది. క్లుప్తంగా చెప్పాలంటే -జాను బావుంది. తమిళంలో 96ని చూసినోళ్లు, కన్నడలో 99ని చూసినోళ్లు కూడా తెలుగులో ‘జాను’ని చూడొచ్చు. చూడాలి కూడా.

-ప్రవవి