రివ్యూ

పెళ్లి చుట్టూ ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది.. పెళ్లిచూపులు
***
తారాగణం: విజయ్ దేవరకొండ, రీతూవర్మ, అనీష్ కురివెల్ల, కేదార్ శంకర్, ప్రియదరిశి, గురురాజ్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
సమర్పణ: డి.సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్ కందుకూరి, యష్ రంగినేని
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
***
ఏ కథనైనా చెప్పే రీతిలో చెప్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది అనటానికి తాజా మజిలీ ఈ ‘పెళ్లిచూపులు’. పోస్టర్లపై ఆయా ‘ఎక్స్‌ప్రెషన్స్’ తిలకించిన జనానికి ఏదో వెరైటీ స్టోరీనీ, తీయటి అనుభూతినీ అందించబోతున్నాడా? అన్న భావన కలిగించాడు తరుణ్. ‘అనుకోకుండా’ ‘సైన్మా’ లాంటి షార్ట్ ఫిలిమ్స్‌తో తన స్టైల్ ఏమిటో చాటిన దర్శకుడు.. ఈ సాదాసీదా కథని అద్భుతంగా మలిచాడు. ప్రోమోస్ చూస్తే- ఇహ సినిమాకి వెళ్లటమే తరువాయి.. అన్నట్టుగా ఉండటంతో సహజంగానే ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తింది.
ఇంజనీరింగ్ విద్యని ముక్కీ మూలిగీ కంపార్ట్‌మెంటల్‌గా పాసై - ఎవరైనా ఓ కోటి రూపాయలు కట్నంగా ఇచ్చేసి పెళ్లీ గట్రా చేసేస్తే.. ఆ సొమ్ముని బ్యాంక్‌లో వేసుకొని నెలనెలా వచ్చే వడ్డీతో బ్రహ్మాండంగా బతికేయ్యొచ్చుననుకొనే కుర్రాడు ప్రశాంత్. ఇతగాడు అల్లరిచిల్లరిగా తిరుగుతూన్నా ‘వంట’లో ఎక్స్‌పర్ట్. వంటలవీ చేసేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తుంటాడు. కనుక.. ఇంజనీరింగ్ పట్టాతో పాటు ‘చెఫ్’ అవతారం ఎత్తాలన్న లక్ష్యం కోసం ఎదురుచూస్తూంటాడు. కానీ- అతగాడి పనితనం తెలిసిన ప్రశాంత్ తండ్రి వీడికి పెళ్లి చేసేస్తే.. ఆ అమ్మాయే వీణ్ణి సరైన దారిలో పెడుతుందన్న ఆశతో బతికే తండ్రి. అనుక్షణం వీళ్లిద్దరి మధ్య యుద్ధ్భేరి.
ఇంకోవైపు -తండ్రి చేసే బలవంతపు పెళ్లిని అవాయిడ్ చేసి ఆస్ట్రేలియా వెళ్లి ‘్ఫడ్ ట్రక్’ పెట్టుకోవాలన్న కోరికతో తపించే అమ్మాయి చిత్ర.
వీళ్లిద్దరికీ పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు పెద్దలు. కొన్ని కారణాంతరాల వల్ల ఒక గదిలో చిక్కుకు పోవటం.. ఆ ఏకాంతం వారిద్దరూ మనసులు విప్పి మాట్లాడుకొనేలా చేస్తుంది. దాంతో ఒకరంటే ఒకరికి తెలీని ఇష్టం ఏర్పడుతుంది.
ఆ మాటల సందర్భంలో -తనకు ‘చెఫ్’ కావాలని ఉందనీ.. తను చేసిన వంటా వార్పూ యూట్యూబ్‌లో వస్తాయనీ చెప్తాడు ప్రశాంత్. ‘్ఫడ్ ట్రక్’ గురించి చెబుతూ.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ‘్ఫడ్’ బిజినెస్ చేద్దామనుకొంటే.. అతడు మిస్సవటంతో తను టార్గెట్ ‘మిస్’ అవుతానేమోనని అంటుంది చిత్ర. ‘పెళ్లిచూపులంటే’ ఇష్టం లేని ఆ జంటని ఈ ‘పెళ్లిచూపులు’ ఒక్కటి చేశాయా? లేదా? అన్నది క్లైమాక్స్.
ఇదీ - సింపుల్‌గా కథ. నేటి యువత ఆలోచనల్ని చక్కగా పట్టుకోగలిగాడు తరుణ్. ఆ ఆలోచనల్ని చక్కటి స్క్రీన్‌ప్లేతో.. అతిచిక్కని మలుపులతో ఆకట్టుకొనేలా మలచుకొన్నాడు. ప్రత్యేకించి కామెడీ ట్రాక్ పెట్టకండా.. అంతా సిట్యుయేషనల్ కామెడీతో నడిపించటంతో - ప్రేక్షకుడు కథలో ఇన్‌వాల్వ్ అయిపోతాడు. కథలో కొన్ని ఉపకథల్ని జొప్పించటంలోనూ వెరైటీని కనబరిచాడు. విజయ్ మాజీ లవర్ ఫోన్ నెంబర్ గొడవ - కాల్‌సెంటర్ -యూట్యూబ్ సన్నివేశాలు దేనికదే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అమ్మాయి - అబ్బాయి ‘పెళ్లి’పట్ల విముఖత.. ఆ తర్వాత కలిసిపోవటం కొన్ని సినిమాల్లో చూసిందే. కాకపోతే- తరుణ్ భాస్కర్ తన కథని ఆ వైపు మళ్లించలేదు. ప్లాట్ ఒక్కటే ఎంచుకొన్నాడు. ఆ ప్లాట్‌కి స్క్రీన్‌ప్లేని జోడించాడు. దాంతో ఒక విధమైన ఫ్రెష్‌నెస్‌ని ఫీల్ అయ్యేట్టు చేశాడు. ‘యూత్’ కథల పట్ల ఆకర్షితులు కానిదెవరు? వారి భావోద్వేగాలతో కలసి రానిదెవరు? ఆ ప్లస్‌పాయింట్‌తో కథని ఆద్యంతం నవ్వుల నావలో పయనింపజేశాడు దర్శకుడు. నేటి యువతకి కెరీర్ పట్ల ఉన్న అవగాహన.. పెళ్లి పట్ల ఉన్న అభిప్రాయాలూ.. జీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలన్న కోర్కెలనూ.. అందంగా పట్టేశాడు. అదొక్కటి చాలు. వీటికి తోడు -హాస్యాన్ని అలవోకగా పలికించాడు. హీరో ఫ్రెండ్స్.. అందులో ప్రియదర్శి ‘పంచ్’లు థియేటర్‌లో నవ్వుల్ని పూయించాయి. తెలంగాణ మాండలికంలో అతడు వేసిన పంచ్‌లు అదుర్స్. ఒక్క హాస్యమే కాదు.. ఎమోషనల్ సీన్లని కూడా పై స్థాయిలోనే నిలబెట్టాడు. దర్శకుడిగా తరుణ్‌కి ఇది తొలి చిత్రమే అయినప్పటికీ.. తన సహజ ధోరణిలోనే సాగుతూ.. ‘పెళ్లిచూపులు’ నిర్వహించాడు. విజయ్ దేవరకొండ సహజంగా నటించాడు. రీతూ వర్మ పక్కింటి అమ్మాయిలా కనిపించింది. తండ్రీ కొడుకుల సంవాదం చూస్తూంటే.. ఇలాంటివి తరచూ ఎదురింట్లోనో మనింట్లోనో జరుగుతున్నట్టు అనిపించేలా నటించారు. ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. ఆయా పాత్రలకు జీవం పోశారు. సంగీతం ఫర్వాలేదు. సాంకేతికపరంగా సినిమా ‘రిచ్’గా ఉంది. నిజంగానే ఇది - న్యూ ఏజ్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ. నో డౌట్.

-అనిల్