రివ్యూ

వాడిపోయన కామెడీ పువ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *బంతిపూల జానకి

తారాగణం: ధన్‌రాజ్, దీక్షాపంథ్, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, రాఘవ, రఘు తదితరులు
నిర్మాత: కళ్యాణి-రామ్
సంగీతం: భోలే
దర్శకత్వం: ప్రవీణ్ చందర్
***
జబర్దస్త్ సిరీస్‌లో కమెడియన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ధన్‌రాజ్ -ఇటీవల హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిన్న బడ్జెట్ సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడు. తాజాగా ధన్‌రాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బంతిపూల జానకి’. కామెడీ థ్రిల్లర్ జానర్లో ఎప్పుడో పూర్తి చేసుకున్న చిత్రం- ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బంతిపూల జానకి మురిపించిందో లేదో తెలుసుకోవాలంటే -కథలోకి వెళ్లాలి.
కథ:
‘బంతిపూల జానకి’ చిత్రంలో హీరోయిన్ జానకి (దీక్షాపంథ్) నటనకు జాతీయ అవార్డు ప్రకటిస్తారు. ఇక జానకికి అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ఆ సినిమా హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్), రచయిత మిరియాలు (రాఘవ), నిర్మాత బంగారయ్య (రఘు), దర్శకుడు అహంకారం (చమ్మక్ చంద్ర).. ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటారు. అనుకోకుండా ఒకదగ్గర చేరిన వీరంతా ఆ సాయంత్రం తమ సినిమాకు అవార్డురావడాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూంటారు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ ఒక్కొక్కరూ జానకి చేతిలో చనిపోతూ ఉంటారు. అయితే, ఈ హత్యలనుంచి జానకి ఎలా తప్పించుకుంది? జానకి స్నేహితుడు, మేనేజర్ అయిన శ్యామ్ (్ధన్‌రాజ్) ఆమెను ఎలా కాపాడాడు? అన్నది మిగతా సినిమా.
అదుర్స్ రఘు, రాఘవ, సుధీర్, చమ్మక్ చంద్రల మధ్యన వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘు కొన్నిచోట్ల తన డిక్షన్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. ధన్‌రాజ్ సిన్సియర్‌గా తన పాత్రలో బాగా నటించేశాడు. అయితే కామెడీ యాంగిల్ లేని పాత్ర కావడంతో అతని ఇమేజ్‌కు ఈ పాత్ర సరిపడదనిపించింది. చమ్మక్ చంద్ర, రాఘవులు తమ డైలాగ్ డెలివరీతో సినిమాను చాలాచోట్ల నిలబెట్టారు.
సాంకేతిక అంశాలపరంగా చూస్తే దర్శకుడు ప్రవీణ్ చందర్, ఒక వీక్ స్క్రిప్ట్‌తో సినిమా తీస్తూ, ఆ తీసే ప్రయత్నంలో అక్కడక్కడా కూడా మెప్పించే సన్నివేశాలను చెప్పలేక విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. ఒకే ఇంట్లో జరిగే 90 నిమిషాల సినిమాను దర్శకుడు ఇంత బోరింగ్‌గా ఎలా తయారు చేశాడా? అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. డైలాగ్స్, ఎడిటింగ్, మ్యూజిక్.. ఇలా టెక్నికల్‌గా సినిమా వీక్ అని చెప్పుకోవాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదనేలా ఉన్నాయి.
కామెడీ జానర్‌లో చిత్రాన్ని నిర్మించేటపుడు -నమ్ముకున్న కామెడీనే బలంగా ప్రయోగించాలన్న కనీస అవగాహన దర్శకుడికి మిస్సయ్యింది. సన్నివేశాలు సిల్లీగావున్నా, అందులోనే ఏదోకచోట లాజిక్‌ను బలంగా ప్రదర్శించాలన్న అవగాహన కానె్సప్ట్ డిజైన్ చేయడంలో మిస్సయ్యింది. దీంతో కామెడీ థ్రిల్లర్ మిస్‌ఫైర్ అయ్యింది. కథ సింపుల్ అయినా, కథనంతో కంగాళీగా మారడం, హాయిగా నవ్వించే సన్నివేశాలు ఎక్కడోగాని తగలకపోవడం లాంటి మైనస్సులు సినిమాను పీడించాయి. ‘జబర్దస్త్’ యాక్టర్స్ కాస్త నవ్వించారన్నదే ప్లస్. ఇంతకుమించి కథలో బలం లేకపోవడంతో, వీక్ కథలోనైనా కథనం మరింత బలహీనపడటంతో.. ఆడియన్స్ సబ్జెక్ట్‌నుంచి డీవియేట్ అయిపోయారు. చిన్న పాయింట్‌ను పట్టుకొని 90 నిమిషాల సినిమాగా మలచడంలో దర్శకుడు విఫలమై బోర్ మిగిల్చాడు. కామెడీ థ్రిల్లర్ అన్న మాటేగానీ -కంటెంట్‌లో ఎక్కడా ఎగ్జైట్‌మెంట్ లేకుండా సాగిపోతుంది. ఉన్న ఒక్క పాయింట్‌నీ సిల్లీగా మార్చేయడంతో -సినిమాలో మైనస్‌లు ఎక్కువ, ప్లస్‌లు తక్కువ అన్నట్టు తయారైంది. అవార్డు సాధించిన హీరోయిన్‌పై ఒకలాంటి ఇంట్రెస్ట్‌తో -అభినందించేందుకు వచ్చిన వాళ్లంతా ప్రమాదవశాత్తూ చనిపోతుండటం, దాన్ని దాచిపెట్టేందుకు హీరోయిన్ పడిన కష్టాలు.. ఈ మొత్తం ఎపిసోడ్స్‌లో ఎక్కడా బిగింపు లేకపోవడంతో కంటెంట్ మొత్తం నీరుగారిపోయింది. పోనీ పక్కా కామెడీ అనుకున్నా -ప్రేక్షకుడు కాసింత నవ్వుకుని ఉండేవాడు. కామెడీ -థ్రిల్లర్ కన్ఫ్యూజన్ నుంచి దర్శకుడే బయటపడలేకపోవడంతో సినిమా తేలిపోయింది. కథకు కీలకమైన హీరోయిన్ పాత్రకు దీక్షాపంథ్ ఏమాత్రం సూట్ కాలేదు. బరువైన పాత్రను ఆమె ఏవిధంగానూ రక్తికట్టించలేకపోవడంతో -ఆ పాత్రతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. ఎన్ని అందాలు ఆరబోసినా.. పతాక సన్నివేశాల్లో దీక్షా నటన మరింత సాదాసీదా అయిపోవడంతో -అందాలను వదిలేసి అయిపోయింది అన్న టైటిల్ కార్డు కోసం ప్రేక్షకుడు ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

-త్రివేది